iDreamPost
android-app
ios-app

IND vs PAK: చిక్కుల్లోపాక్ టీమ్.. ICC సీరియస్!

  • Author Soma Sekhar Published - 05:42 PM, Mon - 11 September 23
  • Author Soma Sekhar Published - 05:42 PM, Mon - 11 September 23
IND vs PAK: చిక్కుల్లోపాక్ టీమ్.. ICC సీరియస్!

ఆసియా కప్ 2023లో పాల్గొంటున్న పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మరోసారి చిక్కుల్లో పడింది. ఈ టోర్నీ సూపర్ 4లో భాగంగా.. ఆదివారం టీమిండియాతో తలపడేందుకు రెండు రోజుల ముందే కొలంబోకు పాక్ టీమ్ చేరుకుంది. కాగా.. పాక్ జట్టు మీడియా మేనేజర్ ఉమర్ ఫారూక్ కల్సన్ తో పాటుగా పీసీబీ బోర్డుకు చెందిన జనరల్ మేనేజర్ అద్నన్ అలీ చేసిన పనికి పాక్ జట్టుపై ఐసీసీ సీరియస్ అయినట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి కొలంబోలో క్యాసినోకి వెళ్లి.. కెమెరా కంటికి చిక్కారు. దీంతో విషయం కాస్తా ఐసీసీ దాక వెళ్లింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఆసియా కప్ లో భాగంగా ఆదివారం టీమిండియాతో తలపడే సూపర్ 4 మ్యాచ్ కోసం రెండు రోజుల క్రితమే శ్రీలంక చేరుకుంది పాక్ జట్టు. ఈ క్రమంలోనే పాక్ జట్టు మీడియా మేనేజర్ ఉమర్ ఫారూక్ కల్సన్ తో పాటుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ కు చెందిన జనరల్ మేనేజర్ అద్నన్ అలీ ఇద్దరూ కలిసి కొలంబోలోని క్యాసినోకి వెళ్లారు. ఈ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. అయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా వీరిద్దరూ క్యాసినోకి వెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం తీవ్ర వివాదాస్పదమైంది. ఇక ఈ విషయంపై ఐసీసీ కూడా సీరియస్ అయినట్లు సమాచారం.

ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఓ జట్టు అధికారిక పర్యటనలో ఉన్నప్పుడు, ఆ జట్టు ఆటగాళ్లకు గానీ, ఆ టీమ్ కు సంబంధించిన అధికారులు గానీ క్యాసినోలకు వెళ్లి గ్యాంబ్లింగ్ లో పాల్గొనడం నిషేధం. వీరిద్దరూ ఈ నిబంధనను అతిక్రమించి క్యాసినోకు వెళ్లారు. అయితే క్యాసినోకు వెళ్లిన ఆ ఇద్దరి వాదన మాత్రం వేరే విధంగా ఉంది. మేం కేవలం డిన్నర్ కోసమే క్యాసినోకి వెళ్లామని వారు పాక్ మీడియాకు వెళ్లడించారు. డిన్నర్ కు ఎవరైనా రెస్టారెంట్ కో.. హోటల్ కో వెళ్తారు.. కానీ క్యాసినోకి వెళ్తారా? అంటూ సోషల్ మీడియా వేదికగా పరువు తీస్తున్నారు నెటిజన్లు. మరి ఈ విషయంపై ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే పెట్టినా గానీ వరుణుడు మాత్రం కరునించడం లేదు. పదే పదే ఆటకు అంతరాయం కలిగిస్తూనే ఉన్నాడు.