Tirupathi Rao
Tirupathi Rao
వరల్డ్ కప్ 2023కి సర్వం సిద్ధమవుతోంది. వార్మప్ మ్యాచులతో జట్లు ఫామ్ లోకి వస్తున్నాయి. తమ బలాలు, బలహీనతల మీద దృష్టి సారిస్తున్నారు. కప్పు కొట్టడమే లక్ష్యంగా అన్నీ జట్లు కృషి చేస్తున్నాయి. అయితే వరల్డ్ కప్ అనగానే కచ్చితంగా టైటిల్ ఫేవరెట్ జట్లు అని కొన్ని ఉంటాయి. వాటిలో పాకిస్తాన్ పేరు కూడా వినిపిస్తోంది. టైటిల్ ఫేవరెట్ గానే పాక్ జట్టు ఇండియాలో అడుగుపెట్టింది. కానీ, వాళ్ల క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా మాత్రం చెత్త ప్రదర్శన, చెత్త జట్టు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. రమీజ్ రాజా కాస్త గట్టిగానే చురకలు అంటించాడు.
వరల్డ్ కప్ 2023 వార్మప్ మ్యాచుల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ తో తలపడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. పాకిస్తాన్ బ్యాటింగ్ చూసి అభిమానులు అంతా తెగ సంబర పడిపోయారు. 50 ఓవర్లలో.. అది కూడా న్యూజిలాండ్ లాంటి జట్టు మీద 345 పరుగులు చేయడం అంటే మామూలు విషయం కాదంటూ చెప్పుకున్నారు. రిజ్వాన్(103), బాబర్ అజమ్(80), షకీల్(75) పరుగులతో రాణించారు. అయితే కట్ చేస్తే సీన్ అంతా రివర్స్ అయింది. అంత పెద్ద లక్ష్యాన్ని న్యూజిలాండ్ జట్టు సింపుల్ గా ఛేదించింది. 6.2 ఓవర్లు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్ లో వాహ్ అనిపించుకున్న పాక్ జట్టు.. బౌలింగ్ లో మాత్రం తేలిపోయింది. న్యూజిలాండ్ బ్యాటర్ల ముందు ఏ పాక్ బౌలర్ కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఈ విషంపై పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాక్ జట్టు మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాక్ జట్టుకు ఓటమి అలవాటు అయిపోయినట్లు ఉంది అంటూ చురకలు అంటించారు.
“అది ప్రాక్టీస్ మ్యాచ్ కావచ్చు. కానీ, ఆ మ్యాచ్ లో కూడా విజయం సాధించాల్సిందే. అప్పుడే గెలవడం ఒక అలవాటుగా మారుతుంది. అయినా పాకిస్తాన్ జట్టుకు ఓటమి అలవాటు అయిపోయినట్లు కనిపిస్తోంది. మొన్న ఆసియా కప్ ఓడిపోయారు..ఇప్పుడు 345 పరుగులు చేసి కూడా ఓటమిపాలయ్యారు. ఇలాంటి పిచ్ లు వరల్డ్ కప్ లో కూడా ఉంటే.. మీరు ఇలాగే బౌలింగ్ మిస్ ఫైర్ చేస్తూ ఉంటే.. 50 ఓవర్లలో 400 పరుగులు చేయాలి. మీ టెక్నిక్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు రిస్కులు కూడా తీసుకోవాలి. కానీ, పాకిస్తాన్ జట్టు అలా మాత్రం చేయదు. మొదటి 15 ఓవర్లు డిఫెన్స్ ఆడి.. ఆ తర్వాత గేరు మారుస్తాం” అంటూ రమీజ్ రాజా గట్టిగానే కౌంటర్స్ వేశాడు. మరి.. రమీజ్ రాజా మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.