పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై భారత ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. విరాట్ కోహ్లీని తిట్టిన క్రికెటర్‌కు ఎలా ప్రమోషన్ ఇస్తారంటూ సీరియస్ అవుతున్నారు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై భారత ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. విరాట్ కోహ్లీని తిట్టిన క్రికెటర్‌కు ఎలా ప్రమోషన్ ఇస్తారంటూ సీరియస్ అవుతున్నారు.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023లో భారత జట్టు వరుస విజయాలు సాధిస్తూ నాకౌట్ దశకు చేరుకుంది. ఫేవరెట్లలో ఒకటైన న్యూజిలాండ్‌ను సెమీఫైనల్లో చిత్తు చేసి మెగా టోర్నీ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా లీగ్ స్టేజ్‌లో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ నెగ్గిన భారత్.. నాకౌట్ ఫైట్‌లో కివీస్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ మ్యాచ్‌లోనూ మన టీమ్ ఫుల్ డామినేషన్ చేసింది. కేన్ విలియమ్సన్-డారిల్ మిచెల్ బ్యాటింగ్ చేస్తున్న టైమ్‌లో తప్పితే సెమీస్ మొత్తం రోహిత్ సేన ఆధిపత్యమే నడిచింది. అన్ని విభాగాల్లోనూ అపోజిషన్ టీమ్ కంటే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన భారత్.. ఫైనల్‌కు చేరుకొని కప్పుపై ఆశలను మరింత పెంచేసింది.
సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్లో నెగ్గిన టీమ్‌తో ఫైనల్లో తలపడేందుకు రోహిత్ సేన రెడీ అవుతోంది. ప్రస్తుతం మన టీమ్ ఉన్న ఫామ్‌లో ఎదురుగా ఏ టీమ్ వచ్చినా చిత్తవడం ఖాయంగా కనిపిస్తోంది. అభిమానుల ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్లు ఫైనల్ ఫైట్‌లోనూ ఆడి కప్‌ను గెలుస్తారో లేదో చూడాలి. ఒకవైపు భారత్ వరల్డ్ కప్‌లో డామినేట్ చేస్తుంటే.. మరోవైపు దాయాది పాకిస్థాన్ మాత్రం లీగ్ స్టేజ్ నుంచే ఇంటికి వెళ్లిపోయింది. తమపై ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశల్ని బాబర్ సేన అందుకోలేకపోయింది. వరుస పరాజయాలతో వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది పాక్.
వరల్డ్ కప్‌లో ఘోర వైఫల్యం నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ భారీ కుదుపునకు లోనైంది. బౌలింగ్ కోచ్ పదవికి మోర్నీ మోర్కెల్ రాజీనామా చేశాడు. ఈ ఫెయిల్యూర్‌కు బాధ్యత వహిస్తూ చీఫ్ సెలెక్టర్ ఇంజమాముల్ హక్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. మెగా టోర్నీలో టీమ్‌ను సరిగ్గా నడపడంలో ఫెయిలైన బాబర్ ఆజం కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. కోచ్ మికీ ఆర్థర్ సహా ఫారెన్ కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని పీసీబీ తొలగించింది. టీమ్ డైరెక్టర్‌గా మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్‌ను నియమించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌కు త్వరలోనే కొత్త కోచింగ్ స్టాఫ్‌ను ప్రకటిస్తామని పీసీబీ తెలిపింది.
ప్రస్తుతం ఉన్న కోచ్‌లు అందర్నీ నేషనల్ క్రికెట్ అకాడమీలో వర్క్ చేయాల్సిందిగా పీసీబీ ఆదేశించింది. వారిలో కొందర్ని మెయిన్ టీమ్ కోసం సెలెక్ట్ చేస్తామని తెలిపింది. అయితే టెక్నికల్ కమిటీలో సభ్యుడిగా ఉన్న హఫీజ్‌ను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ప్రమోట్ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కొన్ని రోజుల కింద తిట్టిన హఫీజ్‌కు కావాలనే పీసీబీ ప్రమోషన్ ఇచ్చిందని ఇండియన్ ఫ్యాన్స్ అంటున్నారు. సౌతాఫ్రికా మీద విరాట్ చేసిన సెంచరీని సెల్ఫిష్ అంటూ మండిపడిన హఫీజ్‌కు ప్రమోషన్ ఇవ్వడం ద్వారా పాక్ తన వక్ర బుద్ధిని మరోమారు చూపించిందని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మరి.. కోహ్లీని తిట్టిన హఫీజ్‌కు పీసీబీ ప్రమోషన్ ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వరుస విజయాలు ఊరికే రాలేదు.. ఆ ఓటమి వల్లే ఇక్కడి దాకా వచ్చిన భారత్!
Former 🇵🇰 captain Mohammad Hafeez has been given the responsibility of Director – Pakistan Men’s Cricket Team.
The PCB has changed the portfolio of the Pakistan coaching staff. All coaches will continue to work in National Cricket Academy while PCB will announce the new coaching… pic.twitter.com/zwwnsj5lzs
— Pakistan Cricket (@TheRealPCB) November 15, 2023