IPL 2024 కోసం కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌!

IPL 2024 కోసం కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌!

Pat Cummins, Sunrisers Hyderabad: రానున్న ఐపీఎల్‌ సీజన్‌ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు కెప్టెన్‌ మార్కరమ్‌ను తప్పించి.. అతని స్థానంలో కొత్త కెప్టెన్‌ను నియమించింది. అతనెవరో? ఎందుకు నియమించారో ఇప్పుడు తెలుసుకుందాం..

Pat Cummins, Sunrisers Hyderabad: రానున్న ఐపీఎల్‌ సీజన్‌ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు కెప్టెన్‌ మార్కరమ్‌ను తప్పించి.. అతని స్థానంలో కొత్త కెప్టెన్‌ను నియమించింది. అతనెవరో? ఎందుకు నియమించారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎంతో పకడ్బందీగా సిద్ధం అవుతోంది. వేలంగా ఎవరూ ఊహించని విధంగా కొంతమంది ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించిన ఎస్‌ఆర్‌హెచ్‌.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు కెప్టెన్‌ ఎడెన్‌ మార్కరమ్‌ స్థానంలో కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌, వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో ఆసీస్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ప్యాట్‌ కమిన్స్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా నియమిస్తూ.. ఆ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఒక ప్రకటన చేసింది.

కమిన్స్‌ను కెప్టెన్‌గా నియమిస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నా.. మార్కరమ్‌కి సైతం మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉండటంతో మరి అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పిస్తారా? లేక అతన్నే కొనసాగిస్తారా? అనే విషయంపై ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానుల్లో అనుమానం నెలకొంది. ఆ డౌట్స్‌ అన్ని తీర్చేస్తూ.. మార్కరమ్‌ స్థానంలో కమిన్స్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ పగ్గాలు అప్పగించింది ఎస్‌ఆర్‌హెచ్‌. అయితే.. మార్కరమ్‌ సన్‌రైజర్స్‌కు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. అయినా కూడా అతన్ని కెప్టెన్‌గా తప్పించింది ఎస్‌ఆర్‌హెచ్‌.

ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం జరిగిన ఐపీఎల్‌ వేలంలో మంచి మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్‌.. రానున్న సీజన్‌లో దుమ్మురేపడం ఖాయమని క్రికెట్‌ నిపుణులు సైతం భావించారు. కానీ, ఎక్కువగా ఫారెన్‌ ఆటగాళ్లను కొనుగోలు చేయడం ఆ జట్టుకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఆ సమస్యను కొంతమేర తగ్గించుకునేందుకు మార్కరమ్‌ స్థానంలో కమిన్స్‌ను కెప్టెన్‌ చేసినట్లు తెలుస్తోంది. కెప్టెన్‌గా కమిన్స్‌ కచ్చితంగా టీమ్‌లో ఉంటాడు. అతను ఆల్‌రౌండర్‌ కావడంతో మార్కరమ్‌తో పోలిస్తే.. ఎస్‌ఆర్‌హెచ్‌కు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కేవలం నలుగురు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉండాలి కనుక.. కమిన్స్‌ రూపంలో ఆల్‌రౌండర్‌ ఉంటే.. బ్యాటింగ్‌లోనో బౌలింగ్‌లోనో ఇంకో ఆప్షన్‌ తీసుకోవచ్చు. ఈ కోణంలో ఆలోచించి కమిన్స్‌ను కెప్టెన్‌గా నియమించారా? లేదా అనేది తెలియదు కానీ.. ఇది కూడా ఒక కారణం కావచ్చు. మరి ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌గా కమిన్స్‌ను కెప్టెన్‌గా నియమించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments