Vinesh Phogat: వినేశ్ ఫొగాట్ ఊహించని నిర్ణయం! రెజ్లింగ్ కు గుడ్ బై..

Vinesh Phogat: వినేశ్ ఫొగాట్ ఊహించని నిర్ణయం! రెజ్లింగ్ కు గుడ్ బై..

పారిస్ ఒలింపిక్స్ 2024లో గోల్డ్ మెడల్ సాధిస్తుంది అనుకున్న రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై అనూహ్యంగా అనర్హత వేటు పడింది. కేవలం 100 గ్రాములు బరువు ఎక్కువ ఉన్న కారణంగా ఆమె ఫైనల్ నుంచి డిస్ క్వాలిఫై అయ్యింది. దాంతో ఊహించని నిర్ణయం తీసుకుంది వినేశ్ ఫొగాట్.

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పారిస్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తుందని అందరూ భావించారు. అందుకు తగ్గట్లుగానే ఆమె రెజ్లింగ్ లో ఫైనల్ కు చేరుకుంది. ఇంకేముందు ఇండియాకు బంగారు పతకం ఖాయమని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా వినేశ్ అనర్హతకు గురైంది. తన బరువు విభాగం(50కేజీ)లో కేవలం 100గ్రాముల బరువు అధికంగా ఉండటం చేత ఆమెపై నిర్వహకులు అనర్హత వేటు వేశారు. దాంతో వినేశ్ పసిడి కల చెదిరింది. ఈ క్రమంలోనే ఆమె ఊహించని నిర్ణయం తీసుకుంది.

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ కు కచ్చితంగా పతకం వచ్చే విభాగాల్లో రెజ్లింగ్ ఒకటి. ఇక అంచనాలకు తగ్గట్లుగానే ఈ విభాగంలో(50కేజీ) ఫైనల్ కు చేరుకుంది స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్. కానీ దురదృష్టవశాత్తు కేవలం 100 గ్రాముల బరువు అధికంగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు వేశారు. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బరువు తగ్గడం కోసం రక్తం తొలగించుకోవడమే కాకుండా, జుట్టు కూడా కత్తిరించుకుంది వినేశ్. అయినప్పటికీ లాభం లేకపోయింది. గోల్డ్ దక్కించుకునే ఛాన్స్ కోల్పోవడంతో షాకింగ్ డెసిషన్ తీసుకుంది. రెజ్లింగ్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించింది.

“నాపై రెజ్లింగ్ గెలిచింది. నేను ఓడిపోయాను, ఇంక నాకు బలం లేదు. నా ధైర్యం కూడా ఓడిపోయింది, నన్ను క్షమించండి.  రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. 2001-2024 గుడ్ బై” అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఫొగాట్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవ్వరూ ఊహించని విధంగా వినేశ్ తీసుకున్న నిర్ణయం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments