వీడియో: రేసులో లేనోడికి గోల్డ్ మెడల్! ఒలింపిక్స్​లో క్షణాల్లో మారిన ఫలితం!

Paris Olympics 2024: ప్రతిష్టాత్మక ఒలింపిక్ గేమ్స్​లో మెడల్ కొట్టాలంటే అంత ఈజీ కాదు. ఫుల్ కాంపిటీషన్​ను తట్టుకొని ఒత్తిడిని అధిగమించి బెస్ట్ ఇస్తే గానీ పతకం రాదు. కానీ ఓ అథ్లెట్​ మాత్రం ఊహించని రీతిలో గోల్డ్ మెడల్ కొట్టేశాడు.

Paris Olympics 2024: ప్రతిష్టాత్మక ఒలింపిక్ గేమ్స్​లో మెడల్ కొట్టాలంటే అంత ఈజీ కాదు. ఫుల్ కాంపిటీషన్​ను తట్టుకొని ఒత్తిడిని అధిగమించి బెస్ట్ ఇస్తే గానీ పతకం రాదు. కానీ ఓ అథ్లెట్​ మాత్రం ఊహించని రీతిలో గోల్డ్ మెడల్ కొట్టేశాడు.

ప్రతిష్టాత్మక ఒలింపిక్ గేమ్స్​లో మెడల్ కొట్టాలంటే అంత ఈజీ కాదు. ఫుల్ కాంపిటీషన్​ను తట్టుకొని ఒత్తిడిని అధిగమించి బెస్ట్ ఇస్తే గానీ పతకం రాదు. ఈ పోటీల కోసం ఏళ్ల పాటు రాత్రింబవళ్లు శ్రమిస్తారు అథ్లెట్లు. తమ ఫోకస్ అంతా దీని మీదే పెడతారు. వేల గంటల పాటు సాధన చేసి విశ్వక్రీడల కోసం సిద్ధమవుతారు. అయితే ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత టాలెంట్ ఉన్నా కాసింత అదృష్టం అనేది ఉండాలి. ఆటగాళ్ల గెలుపోటముల్లో లక్ ఫ్యాక్టర్ ఉంటుంది. అది తాజాగా మరోమారు ప్రూవ్ అయింది. పారిస్ ఒలింపిక్స్​-2024లో అద్భుతం చోటుచేసుకుంది.

ఎంతో కష్టపడితే గానీ రాని ఒలింపిక్​ మెడల్​ను ఓ ఆటగాడు అనూహ్య రీతిలో గెలుచుకున్నాడు. అసలు రేసులోనే లేనోడు ఆశ్చర్యకరంగా విన్నర్​గా నిలిచాడు. అప్పటివరకు ముందున్న వాళ్లంతా పోటీలో వెనుకబడిపోవడంతో అతడు విజేతగా నిలిచాడు. ఒలింపిక్స్​లో భాగంగా స్కేట్​బోర్డింగ్ పోటీల్లో ఇది చోటుచేసుకుంది. ఈ కాంపిటీషన్ ఫైనల్స్​లో ఐదుగురు క్రీడాకారులు పోటీపడ్డారు. గేమ్ మొదలైనప్పటి నుంచి నలుగురు అథ్లెట్లు నువ్వా? నేనా? అంటూ ఆడుతూ వచ్చారు. ఫస్ట్ ప్లేస్​ కోసం ఢీ అంటే ఢీ అంటూ వేగం పెంచుతూ స్కేటింగ్ చేశారు. ఎవరు గోల్డ్ గెలుస్తారో చెప్పలేని రీతిలో ఆ మ్యాచ్ సాగింది. అయితే క్షణాల్లో సీన్ మారిపోయింది. అనూహ్యంగా ఆఖరి ప్లేయర్ విన్నర్​గా నిలిచాడు.

ఫస్ట్ పొజిషన్​లోకి రావాలనే ప్రయత్నంలో రెండో స్థానంలో ఉన్న స్కేటర్ వేగంగా స్కేటింగ్ చేయబోయి బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో అతడు కింద పడిపోయాడు. అతడు తగలడంతో మూడో స్థానంలో ఆటగాడు, అలాగే మిగతా ఇద్దరు కూడా బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోయారు. దీంతో వీళ్లకు దూరంగా స్టేటింగ్ చేస్తున్న లాస్ట్ ప్లేస్​లో ఉన్న స్కేటర్ ఫినిష్ లైన్​ను దాటి గోల్డ్ మెడల్​ను గెలుచుకున్నాడు. ఇది చూసిన నెటిజన్స్ అదృష్టం అంటే అతడిదేనని అంటున్నారు. అతడికే మెడల్ రావాలని రాసి పెట్టినప్పుడు.. ఇతరులకు ఎలా దక్కుతుందంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. నక్క తోక తొక్కినట్లున్నాడు.. అందుకే రేసులో లేకపోయినా గోల్డ్ గెలిచాడని అంటున్నారు. మరి.. ఈ స్కేటింగ్ వీడియో చూశాక మీకేం అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments