iDreamPost
android-app
ios-app

చరిత్ర లిఖించిన అవని లేఖరా.. పారా ఒలింపిక్స్ లో భారత్ కి గోల్డ్ మెడల్!

Avani Lekhara Wins Gold Paralympics 2024: పారిస్ పారా ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్ చేరింది. అంతేకాక 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో అవనీ లేఖరా స్వర్ణం సాధించి.. అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.

Avani Lekhara Wins Gold Paralympics 2024: పారిస్ పారా ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్ చేరింది. అంతేకాక 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో అవనీ లేఖరా స్వర్ణం సాధించి.. అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.

చరిత్ర లిఖించిన అవని లేఖరా.. పారా ఒలింపిక్స్ లో భారత్ కి గోల్డ్ మెడల్!

ప్రస్తుతం పారిస్ వేదికగా పారా ఒలింపిక్స్ 2024లో జరుగుతున్న సంగతి తెలిసింది. గతకొన్ని రోజుల నుంచి భారత్ తో ఆశించిన స్థాయిలో పతకాలు రాలేదు. అయితే ఇటీవలే భారత్ పతకాల వేటను ప్రారంభించింది. దివ్యాంగులకు నిర్వహించే పారా ఒలింపిక్స్ లో భారత షూటర్ అవనీ లేఖరా చరిత్ర సృష్టించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (ఎస్ హెచ్1) విభాగంలో అవనీ టాప్ లో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. 249.7 పాయింట్లతో సమీప ప్రత్యర్థి లీ (సౌత్ కొరియా)పై విజయం సాధించింది. ఫలితంగా భారత్ ఖాతాలో గోల్డ్ మెడల్ చేరింది. ఇక తాజాగా గోల్డ్ మెడల్ సాధించడంతో అవనీ లేఖరా పారా ఒలింపిక్స్ లో రెండు స్వర్ణాలు సాధించిన తొలి ఇండియన్ గా కొత్త చరిత్రను లిఖించింది.

పారిస్ పారాలింపిక్స్ లో గోల్డ్ పతకం సాధించడం ద్వారా అవనీ లేఖరా ఈ సరికొత్త చరిత్రను లిఖించింది. టోక్యో వేదికగా జరిగిన 2020 పారాలింపిక్స్ లో కూడా అవనీ గోల్డ్ మెడల్ తో మెరిసింది. తాజాగా పారిస్ వేదికగా జరుగుతున్న ఈ ఒలింపిక్స్ లో మరోసారి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫలితంగా పారాలింపిక్స్ లో రెండు గోల్డ్ మెడలు సాధించిన తొలి భారతీయురాలిగా అవనీ రికార్డు క్రియేట్ చేసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో అవనీ టాప్ లో ఉండగా.. రెండో స్థానంలో 246.8 పాయిట్లతో లీ(సౌత్ కొరియా) సిల్వర్ మెడల్ సాధించింది. అలానే మూడో స్థానంలో భారత్ కే చెందిన మోనా అగర్వాల్ నిలిచి కాంస్య పతకాన్ని అందుకుంది.

వీరిద్దరి కృషి ఫలితంగా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో భారత్ కు రెండు పతకాలు దక్కాయి. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ అథ్లెట్స్ ఒక్క గోల్డ్ మెడల్ కూడా సాధించలేకపోయారు. అయితే ఒలింపిక్స్ ముగిసిన తరువాత ప్రారంభమైన పారా ఒలిపింక్స్ లో తొలి రోజే భారత్ ఖాతాలో గోల్డ్ మెడల్ చేరడం విశేషం. తాజాగా అవని లేఖరా కూడా భారత్ కు గోల్డ్ మెడల్ అందించింది. దీంతో అవనీ లేఖరాకు దేశంలోని ప్రముఖులు అభినందనలు తెలిపారు. మరి..మీరు కూడా అవనీ లేఖరాకు కంగ్రాట్స్ చెప్పాలని అనుకుంటున్నారా?. అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.