iDreamPost
android-app
ios-app

కోహ్లీ ఏదో లక్కీగా ఆ వికెట్‌ పడగొట్టలేదు! దాని వెనుక మాస్టర్ ప్లాన్..

  • Author Soma Sekhar Published - 02:11 PM, Tue - 14 November 23

వరల్డ్ కప్ లో భాగంగా నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వికెట్ తీయడం ఏదో లక్కీగా జరగలేదని, దాని వెనకాల పెద్ద ప్లానే ఉందని టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే తెలిపాడు.

వరల్డ్ కప్ లో భాగంగా నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వికెట్ తీయడం ఏదో లక్కీగా జరగలేదని, దాని వెనకాల పెద్ద ప్లానే ఉందని టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే తెలిపాడు.

  • Author Soma Sekhar Published - 02:11 PM, Tue - 14 November 23
కోహ్లీ ఏదో లక్కీగా ఆ వికెట్‌ పడగొట్టలేదు! దాని వెనుక మాస్టర్ ప్లాన్..

వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఆడిన తన చివరి గ్రూప్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను 160 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ విజయంతో వరుసగా 9 మ్యాచ్ ల్లో గెలిచి.. లీగ్ దశను ఘనంగా ముగించింది భారత్. ఇక డచ్ టీమ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఎవరూ ఊహించని ప్రయోగాలు చేసింది. రెగ్యూలర్ గా బౌలింగ్ చేసే ఐదుగురు బౌలర్లతో పాటుగా మరో నలుగులు ప్లేయర్లతో బౌలింగ్ చేపించి.. మెుత్తం 9 మంది ఆటగాళ్లు బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. కాగా.. కింగ్ విరాట్ కోహ్లీ బౌలింగ్ చేయడమే కాకుండా.. డచ్ సారథిని అద్భుతమైన మాస్టర్ ప్లాన్ తో బోల్తా కొట్టించాడు. అయితే కోహ్లీకి వికెట్ దక్కడం ఏదో లక్కీగా జరిగిందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ దాని వెనకాల ఓ మాస్టర్ ప్లానే ఉంది. ఈ విషయాన్ని టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే రివీల్ చేశాడు.

నెదర్లాండ్స్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఏకంగా 9 మంది టీమిండియా ప్లేయర్లు బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. కీపర్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మాత్రమే బౌలింగ్ చేయలేదు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా సారథి రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ తలా ఓ వికెట్ తీయడం విశేషం. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే? విరాట్ కోహ్లీ తీసిన వికెట్ ఏదో లక్కీగా, గాలివాటుగా తీసింది కాదు. ఈ వికెట్ తీయడానికి పక్కా ప్లాన్ వేసుకున్నాడు విరాట్ భాయ్. ఈ విషయాన్ని టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే వెల్లడించాడు.

తాజాగా మాంబ్రే మాట్లాడుతూ..”విరాట్ కోహ్లీకి వికెట్ దక్కవడం చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ వికెట్ ను మాస్టర్ ప్లాన్ తో పడగొట్టాడు కోహ్లీ. అద్భుతమైన ఫీల్డ్ సెటప్ తో, ఫైన్ లెగ్ దిశగా అతడు అడ్జస్ట్ చేసిన విధానం, కేఎల్ రాహుల్ తో అతడి సమన్వయం పక్కా ప్లాన్ ప్రకారమే జరిపాడు. అందుకే అతడు వికెట్ దక్కించుకున్నాడు. ఇది గ్రేట్ సెటప్” అంటూ విరాట్ ను ప్రశంసల్లో ముంచెత్తాడు మాంబ్రే. కాగా.. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 25వ ఓవర్ వేయడానికి వచ్చిన విరాట్.. 3వ బంతిని లెగ్ సైడ్ వేయగా.. అది కాస్త డచ్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ బ్యాడ్ ఎడ్జ్ తీసుకుని కీపర్ కేఎల్ రాహుల్ చేతిలో పడింది. దీంతో కోహ్లీ ఈ వరల్డ్ కప్ లో తొలి వికెట్ తీసుకున్నాడు. ఇది చూసిన చాలా మంది విరాట్ కోహ్లీకి ఏదో లక్కీగా వికెట్ దక్కిందని అనుకుంటున్నారు. వాళ్లందరికి సమాధానం చెప్పాడు మాంబ్రే. మరి కోహ్లీ ఈ ప్రపంచ కప్ లో తొలి వికెట్ తీయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.