SNP
Rishabh Pant, Khaleel Ahmed, Andre Russell: కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. బహుషా లైవ్ చూసిన వాళ్లు కూడా అది గుర్తించి ఉండరు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Rishabh Pant, Khaleel Ahmed, Andre Russell: కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. బహుషా లైవ్ చూసిన వాళ్లు కూడా అది గుర్తించి ఉండరు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. బుధవారం విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ సిక్సర్ల సునామీతో ఢిల్లీ బౌలర్లను ముంచెత్తింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 272 పరుగులు చేసి.. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్‌ను క్రియేట్ చేసింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన 277 పరుగుల స్కోర్‌ను కూడా కేకేఆర్ దాటేసేలా కనిపించింది. చివర్లో రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్‌లో ఏ ఒక్కరు ఉన్నా.. ఆ రికార్డు బద్దులయ్యేదే. కానీ, ఎస్‌ఆర్‌హెచ్ అదృష్టం కొద్ది ఆ రికార్డ్ పదిలంగా మిగిలిపోయింది. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉన్న రెండో అత్యధిక స్కోర్ రికార్డు మాత్రం బ్రేక్ అయింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఎవరు గుర్తించని ఓ సీన్ తాజాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ రస్సెల్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో.. పంత్ బౌలర్‌కు ఓ సిగ్నల్ ఇచ్చాడు.
కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఢిల్లీ బౌలర్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ వేసేందుకు వచ్చాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ నాలుగో బంతిని ఎలా వేయాలో.. పంత్ బౌలర్‌కు బాల్ వేసే ముందు సిగ్నల్ ఇచ్చాడు. తన తలను చూపిస్తూ.. వేస్తే తల పగిలిపోవాలి అన్నట్లు.. హార్డ్ బౌన్సర్ వేయాలని సూచించాడు. ఈ విషయం బయటి చేస్తున్న రస్సెల్‌కి మాత్రం తెలియదు. ఎందుకంటే.. అతను బాల్ కోసం రెడీ అవుతున్నాడు. అప్పటికే విధ్వంసం సృష్టిస్తున్న రస్సెల్‌ను అవుట్ చేసేందుకు పంత్ ఈ ప్లాన్ వేశాడు. ఆ టైమ్‌లో రస్సెల్ 16 బంతుల్లోనే 40 పరుగులు చేసి మంచి ఊపు మీదున్నాడు. బాల్ వస్తే చాలు బౌండరీకి బాదాలనే కసితో ఉన్నాడు.
అతన్ని అవుట్ చేసేందుకు ఇదే సరైన టైమ్‌గా భావించిన పంత్.. డీప్ ఫైన్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్‌ను కాస్త అడ్జెస్ట్ చేసుకుని.. బౌన్సర్‌తో రస్సెల్‌ను అవుట్ చేయాలని డేంజరస్ ప్లాన్ వేశాడు. పంత్ చెప్పినట్లే ఖలీల్ కూడా అద్బుతమైన బౌన్సర్ వేశాడు. కానీ, ఫేస్‌కి కాకుండా.. కాస్త అవుట్ సైడ్ ది ఆఫ్‌స్టంప్ వేయడంతో ఆ బాల్‌ను రస్సెల్ మిస్ అయ్యాడు. అది డాట్ బాల్‌గా వెళ్లింది. పంత్ ప్లాన్ ప్రకారం.. పేస్‌పైకి వేసి ఉంటే.. రస్సెల్ కచ్చితంగా ఆ బాల్‌ను ఆడేవాడు.. సిక్స్ వెళ్లడమో లేక గాల్లోకి లేచి.. డీప్ ఫైన్ లెగ్ ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లడమో జరిగేది. కానీ, రస్సెల్ ఆ బాల్ మిస్ చేయడంతో ఎలాంటి ఫలితం రాలేదు. కానీ, బాల్ వేసే ముందు పంత్ బౌలర్‌కు ఇచ్చిన సిగ్నల్స్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ప్లాన్స్ అప్పట్లో ధోని వేసేవాడని, ఇప్పుడు ధోని శిష్యుడిగా పంత్ కూడా అదే దారిలో వెళ్తున్నాడంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరి రస్సెల్‌ని అవుట్ చేసేందుకు పంత్ వేసిన ప్లాన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Keep your eye on Pant…signals the bouncer and Khaleel obliges.. #DCvsKKR pic.twitter.com/v7ETxvl1y4
— Lisa Sthalekar (@sthalekar93) April 3, 2024