iDreamPost
android-app
ios-app

పాక్ చెత్త ఫీల్డింగ్ కు ఇది మరో నిదర్శనం.. ఒక్క బాల్ కు ఇన్ని రన్సా?

  • Author Soma Sekhar Updated - 05:56 PM, Fri - 8 December 23

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాక్ మరోసారి తన చెత్త ఫీల్డింగ్ తో దారుణ విమర్శల పాలవుతోంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాక్ మరోసారి తన చెత్త ఫీల్డింగ్ తో దారుణ విమర్శల పాలవుతోంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

  • Author Soma Sekhar Updated - 05:56 PM, Fri - 8 December 23
పాక్ చెత్త ఫీల్డింగ్ కు ఇది మరో నిదర్శనం.. ఒక్క బాల్ కు ఇన్ని రన్సా?

పాకిస్థాన్ క్రికెట్ టీమ్.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నిలుస్తూ తరచుగా వార్తల్లో వినిపిస్తుంది. కొన్ని కొన్ని సార్లు తమ చెత్త ఫీల్డింగ్ తో విమర్శల పాలవుతూ ఉంటుంది. గతంలో ఈజీగా పట్టాల్సిన క్యాచ్ లను ఇద్దరు ఫీల్డర్లు నిలబడి చూస్తూ.. నేలపాలు చేసిన సంఘటనలు మనం ఎన్నో చూసే ఉన్నాం. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాక్ మరోసారి తన చెత్త ఫీల్డింగ్ తో దారుణ విమర్శల పాలవుతోంది. ప్రైమినిస్టర్ ఎలెవన్ తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ లో పాక్ తన చెత్త ఫీల్డింగ్ ను మరోసారి ప్రపంచానికి చూపించింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.

పాకిస్థాన్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అందులో భాగంగా ప్రైమినిస్టర్ ఎలెవన్ జట్టుతో 4 రోజుల వార్మప్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో 3వ రోజు ఓ ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. ఇప్పటికే పాక్ అంటే చెత్త ఫీల్డింగ్.. చెత్త ఫీల్డింగ్ అంటే పాక్ అనేంతగా మారిపోయింది. ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేసుకుని నవ్వులపాలవుతోంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో పాక్ బౌలర్ అహ్మద్ బౌలింగ్ చేయగా.. ప్రత్యర్థి బ్యాటర్ రెన్ షా బాల్ ను షాట్ ఆడాడు. ఫీల్డర్ ను దాటుకుని వెళ్తున్న బాల్ వెంట పరిగెత్తాడు పాక్ ప్లేయర్. బౌండరీ వెళ్తున్న బాల్ ను డైవ్ చేసి మరీ ఆపాడు.

ఈ  క్రమంలోనే అప్పటికే 3 పరుగులు పూర్తి చేసుకున్నారు ప్రత్యర్థి ఆటగాళ్లు. అనంతరం బాల్ త్రో వేయగా.. కీపర్ మిస్ చేయడంతో.. ఆ బాల్ కాస్త బౌండరీకి తరలింది. దీంతో ఒక్క బాల్ కు 7 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం ఈ మిస్ ఫీల్డ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు మీరింక మారరా? ఎదుటి దేశంపై మాటలు మాట్లాడటం కాదు.. ముందు ఫీల్డింగ్ నేర్చుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పాక్ మిస్ ఫీల్డింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabettaraftarium24 girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom