iDreamPost
android-app
ios-app

BREAKING: పాకిస్థాన్‌ వరల్డ్‌ కప్‌ స్క్వౌడ్‌ ప్రకటన! హసన్‌ రీఎంట్రీ

  • Published Sep 22, 2023 | 12:35 PM Updated Updated Sep 22, 2023 | 12:35 PM
  • Published Sep 22, 2023 | 12:35 PMUpdated Sep 22, 2023 | 12:35 PM
BREAKING: పాకిస్థాన్‌ వరల్డ్‌ కప్‌ స్క్వౌడ్‌ ప్రకటన! హసన్‌ రీఎంట్రీ

మరికొన్ని రోజుల్లో క్రికెట్‌ మహా సంగ్రామం వన్డే వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులంతా.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసలు సిసలైన క్రికెట్‌ పండుగ అక్టోబర్‌ 5 నుంచి ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని ప్రధాన జట్టు సంసిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే చాలా దేశాలు తమ వరల్డ్‌ కప్‌ స్క్వౌడ్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్థాన్‌ సైతం తమ వరల్డ్‌ కప్‌ స్క్వౌడ్‌ను ప్రకటించింది. బాబర్‌ అజమ్‌ కెప్టెన్సీలో 15 మందితో కూడిన జట్టును పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు వీడియో రూపంలో వెల్లడించింది.

పాకిస్థాన్‌ జట్టులో విభేదాలు తలెత్తాయని.. ఈ నేపథ్యంలో పాక్‌ వైస్‌ కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌ను వైస్‌ కెప్టెన్సీ నుంచి తొలగించడమే కాకుండా.. వరల్డ్‌ కప్‌ కోసం కూడా ఎంపిక చేయరనే వార్త ప్రచారంలో ఉంది. కానీ, వాటికి పుల్‌స్టాప్‌ పెడుతూ.. పీసీబీ టీమ్‌ను ప్రకటించింది. వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌ ఉప సారథిగా షాదాబ్‌ ఖాన్‌ కొనసాగనున్నాడు. ఈ టోర్నీకి గాయం కారణంగా యువ పేసర్‌ నసీమ్‌ షా దూరం అయ్యాడు. ఆసియా కప్ 2023లో గాయపడిన హరీస్‌ రౌఫ్‌ గాయం నుంచి కోలుకోవడంతో అతన్ని వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి ఎంపిక చేశారు. నసీమ్‌ షా స్థానంలో హసన్‌ అలీ టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. కొంతకాలం క్రితం జట్టులో స్థానం కోల్పోయిన హసన్‌ అలీ.. నేరుగా వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి తిరిగి రావడం గమనార్హం.

పాకిస్థాన్‌ వరల్డ్‌ కప్‌ స్క్వౌడ్‌: బాబర్ (కెప్టెన్‌), ఇమామ్ ఉల్‌ హక్‌, ఫఖర్ జమాన్‌, అబ్దుల్లా షఫీక్, అఘా సల్మాన్, షకీల్, ఇఫ్తాకర్ అహ్మద్‌, మొహమ్మద్‌ రిజ్వాన్, షాదాబ్ ఖాన్‌, నవాజ్, హరీస్‌ రౌఫ్‌, హసన్ అలీ, షాహీన్ షా అఫ్రిది, వసీం జూనియర్, ఉసామా మీర్. వీరితో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లను ట్రావెల్‌ స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. మరి వరల్డ్‌ కప్‌ కోసం ఎంపిక చేసిన పాక్‌ టీమ్‌పై మీ అభ్రియాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలవాలంటే.. వాళ్లని ఓడించాలి: గంభీర్‌