iDreamPost
android-app
ios-app

బుద్ధి మార్చుకోని పాక్.. ఫిక్సింగ్ విషయంలో టీమిండియాను లాగుతూ..!

  • Author singhj Published - 12:27 PM, Mon - 4 December 23

పాకిస్థాన్ తన వక్ర బుద్ధిని మార్చుకోలేదు. ఫిక్సింగ్ విషయంలో టీమిండియాను లాగుతూ ఆ దేశ సీనియర్ ప్లేయర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

పాకిస్థాన్ తన వక్ర బుద్ధిని మార్చుకోలేదు. ఫిక్సింగ్ విషయంలో టీమిండియాను లాగుతూ ఆ దేశ సీనియర్ ప్లేయర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

  • Author singhj Published - 12:27 PM, Mon - 4 December 23
బుద్ధి మార్చుకోని పాక్.. ఫిక్సింగ్ విషయంలో టీమిండియాను లాగుతూ..!

వన్డే వరల్డ్ కప్​-2023 పలు దేశాల్లో అనూహ్య మార్పులు తీసుకొచ్చింది. మెగా టోర్నమెంట్​లో బాగా పెర్ఫార్మ్ చేసిన ఆఫ్ఘానిస్థాన్, నెదర్లాండ్స్ లాంటి టీమ్స్ మంచి జ్ఞాపకాలు, ఆత్మవిశ్వాసం, గర్వంతో స్వదేశానికి వెళ్లాయి. అదే టైమ్​లో చెత్తాటతో నిరాశపర్చిన పాకిస్థాన్, ఇంగ్లండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి టీమ్స్ ఎన్నో విమర్శల్ని ఎదుర్కొన్నాయి. ప్రపంచ కప్​లో ఫెయిల్యూర్​ ఎఫెక్ట్ పాకిస్థాన్, శ్రీలంక మీద బాగా పడింది. ఆయా దేశ ప్రజలు తమ టీమ్ ఆటతీరుకు ఎంతో నిరాశ చెందారు. దీంతో ప్లేయర్లతో పాటు ఆయా దేశాల బోర్డులు భారీగా విమర్శల్ని మూటగట్టుకున్నాయి. దీంతో లంక క్రికెట్ బోర్డును ఆ దేశ ప్రభుత్వం రద్దు చేయడం, దాని స్థానంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే.

పాకిస్థాన్​ క్రికెట్​లోనూ వరల్డ్ కప్​ ఫెయిల్యూర్​తో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ వైఫల్యాలకు బాధ్యతగా టీమ్ బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్, కెప్టెన్ బాబర్ ఆజం తమ బాధ్యతల నుంచి వైదొలిగారు. టీమ్ ఫారెన్ కోచింగ్ స్టాఫ్​ను పూర్తిగా తొలగించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). కొత్త చీఫ్ సెలక్టర్​గా వాహబ్ రియాజ్, కొత్త టీమ్ డైరెక్టర్​గా మహ్మద్ హఫీజ్​ను నియమించింది. రియాజ్​కు తన బృందాన్ని ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది పీసీబీ. దీంతో పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్​ను సలహాదారుడిగా ఎంచుకున్నాడతను. కానీ దీనిపై పెద్ద ఎత్తును విమర్శలు రావడంతో భట్​ను ఆ పాత్ర నుంచి తొలగించారు.

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై 2010లో సల్మాన్ భట్​ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సస్పెండ్ చేసింది. అతడితో పాటు ఫిక్సింగ్​కు పాల్పడ్డట్టు తేలిన మరో ఇద్దరు పాకిస్థాన్ ప్లేయర్లు మహ్మద్ ఆమిర్, మహ్మద్ ఆసిఫ్​ మీదా నిషేధం విధించారు. దీంతో భట్ కెరీర్ అక్కడితో ముగిసింది. బ్యాన్ వల్ల క్రికెట్​కు దూరమైన అతడు మళ్లీ కమ్​బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నించినా కుదర్లేదు. అయితే చాన్నాళ్ల తర్వాత పాక్ క్రికెట్​లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు అతడికి ఓ అవకాశం దొరికింది. చీఫ్​ సెలక్టర్​ వహాబ్ రియాజ్​కు కన్సల్టెంట్​గా ఉండే ఛాన్స్ వచ్చింది. కానీ ఒక ఫిక్సర్​ను ఆ రోల్​కు ఎలా తీసుకుంటారంటూ విమర్శలు రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ విషయంలో భారత్​ను లాగడం కాంట్రవర్సీగా మారింది.

సల్మాన్​ భట్​ను సలహాదారు పాత్ర నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించిన టైమ్​లో ఈ విషయంలోకి టీమిండియాను లాగాడు రియాజ్. భారత క్రికెటర్లు మహ్మద్ అజహరుద్దీన్, అజయ్ జడేజాల పేర్లను ప్రస్తావించాడు. ఫిక్సింగ్ ఆరోపణలతో వీళ్లిద్దరూ నిషేధాన్ని ఎదుర్కొన్నారని.. కానీ వారిని ఇండియాలో క్షమించారని అన్నాడు. అజహరుద్దీన్, జడేజాలు ఇప్పుడు క్రికెట్​లోని పనిచేస్తున్నారని చెప్పాడు. అయినా అక్కడెవరూ గొడవ చేయట్లేదన్నాడు. హైదరాబద్ క్రికెట్ అసోసియేషన్​కు అజహర్ ప్రెసిడెంట్​గా పనిచేశాడని గుర్తుచేశాడు. వరల్డ్ కప్​లో ఆఫ్ఘానిస్థాన్​కు జడేజా కన్సల్టెంట్​గా ఉన్నాడని రియాజ్ పేర్కొన్నాడు. అయితే అతడి కామెంట్స్​పై భారత ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

పాక్ బుద్ధి మారదని అంటున్నారు అభిమానులు. అజయ్ జడేజా, అజహరుద్దీన్​ ఫిక్సింగ్ వల్ల పేరు, క్రేజ్ కోల్పోయారు. ఆర్థికంగానే గాక ఎన్నో రకాలుగా నష్టపోయారు. అలాగే నిషేధాన్ని ఎదుర్కొన్నారు. వాళ్లు తమ తప్పు ఒప్పుకొని సారీ కూడా చెప్పారు. ఇది జరిగి రెండు దశాబ్దాలు దాటిపోయింది. వాళ్లను క్షమించిన బీసీసీఐ బ్యాన్ తర్వాత వదిలేసింది. దీంతో క్రికెట్ వ్యవహారాల్లో యాక్టివ్ అయ్యారు. ప్రజలు కూడా అంతా మర్చిపోయారు. ఈ టైమ్​లో పాక్ బోర్డు తమ క్రికెట్​లో తప్పు జరిగితే దాంట్లోకి భారత క్రికెటర్లను లాగడం ఎంత వరకు కరెక్ట్? అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పాకిస్థాన్​కు సిగ్గులేదని అంటున్నారు. మరి.. రియాజ్ కామెంట్స్ కాంట్రవర్షియల్​గా మారడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Suryakumar Yadav: కెప్టెన్‌గా తొలి సిరీస్‌ విక్టరీ.. ధోనిని ఫాలో అయిన సూర్యకుమార్‌!