iDreamPost
android-app
ios-app

పాక్ పరువు మళ్లీ పోయింది.. బుమ్రాతో పోల్చారుగా ఇది మీకు జరగాల్సిందే!

  • Published Apr 24, 2024 | 8:58 AM Updated Updated Apr 24, 2024 | 8:58 AM

పాకిస్థాన్ జట్టు పరువు మళ్లీ పోయింది. టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రాతో పోల్చుకున్న బాబర్ సేనకు తగిన శాస్తి జరిగింది.

పాకిస్థాన్ జట్టు పరువు మళ్లీ పోయింది. టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రాతో పోల్చుకున్న బాబర్ సేనకు తగిన శాస్తి జరిగింది.

  • Published Apr 24, 2024 | 8:58 AMUpdated Apr 24, 2024 | 8:58 AM
పాక్ పరువు మళ్లీ పోయింది.. బుమ్రాతో పోల్చారుగా ఇది మీకు జరగాల్సిందే!

ప్రతి విషయంలోనూ భారత జట్టుతో పోల్చుకోవడం పాకిస్థాన్​కు అలవాటుగా మారింది. టీమిండియా కంటే అన్నింటా తామే తోపు అంటూ ఎప్పుడూ బడాయికి పోతూ ఉంటుంది దాయాది. ఆ దేశ అభిమానులు కూడా విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజం గొప్పోడు అని, భారత్ కంటే పాక్ పెద్ద టీమ్ అని, పాకిస్థాన్ సూపర్ లీగ్ ముందు ఐపీఎల్ దేనికీ పనికి రాదంటూ ఇష్టం వచ్చినట్లు వాగుతుండటం తెలిసిందే. అయితే కోహ్లీ రికార్డుల ముందు బాబర్ జూజూబీ అని కొత్తగా చెప్పనవసరం లేదు. వేలాది కోట్లతో నిర్వహించే ఐపీఎల్ ముందు పీఎస్​ఎల్ చాలా చిన్న టోర్నీ. ప్రతి విషయంలో కంపేర్ చేసుకోవడం ఆ తర్వాత ఫ్యాక్ట్స్ తెలిసి పాక్​ను క్రికెట్ ఫ్యాన్స్ తిట్టడం పరిపాటిగా మారింది. ఇప్పుడు ఆ జట్టు మరోమారు పరువు పోగొట్టుకుంది.

ఈ మధ్య ఓ సందర్భంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ టీమిండియా స్పీడ్​స్టర్ జస్​ప్రీత్ బుమ్రాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బుమ్రా కంటే తమ జట్టు పేసర్ నసీమ్ షానే గ్రేట్ అన్నాడు. డెత్ బౌలింగ్​లో నసీంను మించినోళ్లు లేరంటూ ఆకాశానికి ఎత్తేశాడు. డెత్ ఓవర్స్​లో టార్గెట్​ను డిఫెండ్ చేయడంలో బుమ్రా కంటే నసీం తోపు అంటూ ప్రశంసించాడు. దీనిపై సోషల్ మీడియాలో భారత జట్టు అభిమానులతో పాటు ఇతర క్రికెట్ కంట్రీస్ ఫ్యాన్స్ నుంచి కూడా బాబర్ విమర్శలు ఎదుర్కొన్నాడు. వరల్డ్ క్రికెట్​లో ఇప్పుడు బుమ్రాను మించినోళ్లు లేరని, అన్ని ఫార్మాట్లలోనూ అతడే బెస్ట్ అని.. అలాంటోడ్ని నసీం లాంటి బచ్చా ప్లేయర్​తో పోల్చడం ఏంటంటూ ట్రోల్ చేశారు. అయితే బుమ్రాతో కంపేరిజన్​కు వచ్చిన నసీం తాజాగా న్యూజిలాండ్ బీ టీమ్ మీద చెత్తగా బౌలింగ్ చేయడం గమనార్హం.

నసీం షా బౌలింగ్​లో కివీస్ బ్యాటర్లు చితగ్గొట్టారు. పాక్​తో ఆ టీమ్​కు మధ్య జరిగిన మూడో టీ20లో నసీం బౌలింగ్​ను న్యూజిలాండ్ బ్యాట్స్​మెన్ ఓ ఆటాడుకున్నారు. 16వ ఓవర్​లో బౌలింగ్​కు దిగిన పాక్ పేసర్​కు చుక్కలు చూపించారు. వరుసగా 6, 4, 6, 4, 1, 2 బాదారు. ఓవరాల్​గా ఆ ఓవర్​లో 23 పరుగులు పిండుకున్నారు. నసీం బౌలింగ్​లో వచ్చిన బాల్​ను వచ్చినట్లు పిచ్చకొట్టుడు కొడుతుంటే అతడితోపాటు బాబర్ ఆజంకు కూడా ఏమీ పాలుపోలేదు. పాక్ ఓడిన ఈ మ్యాచ్​లో నసీం 3 ఓవర్లలో ఏకంగా 44 పరుగులు ఇచ్చుకున్నాడు. దీంతో ట్రోలర్స్​ మళ్లీ విరుచుకుపడుతున్నారు. బుమ్రా కంటే తోపు అన్నారుగా.. మీకు తగిన శాస్తి జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు. విలియమ్సన్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ లేనప్పుడే ఇంతలా బాదారంటే.. వాళ్లే గనుక ఉంటే నసీం దుకాణం మూసుకోవాల్సి వచ్చేదంటూ ఎగతాళి చేస్తున్నారు. మరి.. పాక్ మళ్లీ పరువు పోగొట్టుకోవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.