SNP
SNP
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ మహా సంగ్రామం వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. అహ్మాదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌లో వరల్డ్ కప్ యద్ధం షురూ కానుంది. అయితే.. ఈ సారి వరల్డ్ కప్‌లో హాట్ ఫేవరేట్‌గా ఓ నాలుగు టీమ్స్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. టీమిండియా టాప్ మోస్ట్ ప్రెయారిటీగా ఉన్నా.. టీమిండియాతో పాటు మరో మూడు జట్లకు కూడా వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ చాలా మంది ఎక్స్‌పర్ట్‌లు అభిప్రాయపడుతున్నారు. వాటిలో.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో పాటు దాయాది పాకిస్థాన్ టీమ్ కూడా ఉంది. వన్డే క్రికెట్‌లో పాకిస్థాన్ బలమైన టీమ్‌గా ఉంది. మరి ఈ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ బలం, బలహీనతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
బలం..
పాకిస్థాన్ ప్రధాన బలం బౌలింగ్. ఇప్పుడే కాదు.. చాలా కాలంగా ఉన్న ప్రపంచ క్రికెట్‌లో పాకిస్థాన్ అనగానే మంచి బౌలింగ్ ఎటాక్ అనే ముద్ర ఉంది. దాన్ని వాళ్లు అలా నిలబెట్టుకుంటూనే వస్తున్నారు. ఈ వరల్డ్ కప్‌లో కూడా పాకిస్థాన్ ప్రధాన బలం బౌలింగ్ అనే చెప్పాలి. అయితే.. ఈ సారి వారి బౌలింగ్ ఎటాక్ బాబర్ అజమ్ రూపంలో అదనపు బలం చేకూరందని చెప్పాలి. పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ వరల్డ్ నంబర్ వన్డే బ్యాటర్‌గా ఉన్నాడు. వన్డేల్లో చాలా నిలకడగా పరుగులు చేస్తున్నాడు. అతనికి మిగితా బ్యాటర్ల నుంచి మంచి సపోర్ట్ లభిస్తే.. పాక్ టీమ్ డేంజరస్‌గా మారడం ఖాయం. బాబర్‌తో పాటు రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్ సైతం మంచి ఫామ్‌లో ఉండటం పాక్‌కు కలిసొచ్చే అంశం.
బలహీనతలు..
పాకిస్థాన్ ప్రధాన బలం బౌలింగే అయినా.. యువ పేసర్ నసీమ్ షా గాయంతో దూరం కావడంతో వారి బౌలింగ్ ఎటాక్ కాస్త వీక్ చేసిందనే చెప్పాలి. అలాగే.. పాకిస్థాన్ టీమ్ విజయాల కోసం ఎక్కువగా బాబర్ అజమ్, బౌలర్లు షాహీన్ షా అఫ్రిదీ, హరీస్ రౌఫ్‌పైనే ఆధారపడుతుండటం వారికి పెద్ద మైనస్. ఇక పాకిస్థాన్ మిడిల్డార్ అయితే దారుణంగా ఉంది. వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ ఫామ్‌లో లేకపోవడం పాక్ మిడిల్డార్‌ను వీక్ చేస్తోంది. అలాగే.. ఫీల్డింగ్ పాకిస్థాన్‌కు పెద్ద సమస్య. అనేక కీలక మ్యాచ్‌ల్లో వారి ఫీల్డింగ్ కారణంగానే ఓడిన సందర్భాలు ఉన్నాయి. తరాలు మారుతున్నా.. వారి ఫీల్డింగ్ మాత్రం మెరుగుపడటం లేదు. ఇక మరో ప్రధాన సమస్య.. ఎప్పుడు ఎలా ఆడతారో తెలియకపోవడం. క్రికెట్ ప్రపంచంలో నిలకడలేమి జట్టు ఏదైనా ఉందంటే అది పాకిస్థాన్ అనే చెప్పాలి. ఒక రోజు ఛాంపియన్‌లా ఆడే పాక్ మరో మ్యాచ్‌ల్లో పసికూనలా ఆడుతుంది. అది పాక్‌కి ఉన్న పెద్ద రోగం.
టీమ్: బాబర్ అజమ్(కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హారీస్ రవూఫ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, వజీం జూనియర్.
Pakistan Captain Babar Azam is ready for the World Cup 2023. pic.twitter.com/BuJWQNb5YO
— Johns. (@CricCrazyJohns) October 3, 2023
ఇదీ చదవండి: వరల్డ్ కప్‌లో ఇండియా బలాలు, బలహీనతలు! మూడో కప్ గెలిచే ఛాన్స్?