iDreamPost
android-app
ios-app

పాకిస్థాన్ క్రికెట్​ను అదే నాశనం చేసింది.. దాని వల్లే ఈ దుస్థితి: మాజీ క్రికెటర్

  • Published Jun 15, 2024 | 5:43 PMUpdated Jun 15, 2024 | 5:43 PM

పొట్టి కప్పు నుంచి పాకిస్థాన్​ జట్టు నిష్క్రమించింది. గ్రూప్ స్టేజ్ నుంచే దాయాది ఇంటిదారి పట్టింది. దీంతో ఆ టీమ్​పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

పొట్టి కప్పు నుంచి పాకిస్థాన్​ జట్టు నిష్క్రమించింది. గ్రూప్ స్టేజ్ నుంచే దాయాది ఇంటిదారి పట్టింది. దీంతో ఆ టీమ్​పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

  • Published Jun 15, 2024 | 5:43 PMUpdated Jun 15, 2024 | 5:43 PM
పాకిస్థాన్ క్రికెట్​ను అదే నాశనం చేసింది.. దాని వల్లే ఈ దుస్థితి: మాజీ క్రికెటర్

టీ20 వరల్డ్ కప్​-2024లో అనూహ్యమైన ఫలితాలను చూస్తున్నాం. చిన్న జట్లు అద్భుతమైన విజయాలతో ముందుకెళ్తున్నాయి. పెద్ద జట్లు ఘోర ఓటములతో ఇంటిదారి పడుతున్నాయి. స్లో, ట్రికీ పిచ్​లపై ఎలా ఆడాలో తెలియక తికమకపడుతున్న బిగ్ టీమ్స్.. పసికూనల చేతుల్లో ఓడి మెగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నాయి. న్యూజిలాండ్, శ్రీలంకతో పాటు క్రికెట్​లో ఎంతో ఘన చరిత్ర కలిగిన పాకిస్థాన్​ది కూడా ఇదే పరిస్థితి. యూఎస్​ఏ, టీమిండియా చేతుల్లో ఓడిన దాయాది జట్టు.. గ్రూప్ స్టేజ్ నుంచి ఇంటిబాట పట్టింది. ఐర్లాండ్​తో ఆఖరి మ్యాచ్ ఆడాల్సి ఉన్నా దాని రిజల్ట్​తో సంబంధం లేదు. బాబర్ సేన సూపర్-8 అవకాశాలు అప్పుడే మూసుకుపోయాయి. చెత్త బ్యాటింగ్, అంచనాలను అందుకోని బౌలింగ్, వరస్ట్ ఫీల్డింగ్​తో వరల్డ్ కప్​లో పాక్​ అందర్నీ తీవ్రంగా నిరుత్సాహపర్చింది.

కెప్టెన్​గా, బ్యాట్స్​మన్​గా బాబర్ ఆజం ఫెయిల్యూర్ పాక్​ను ముంచేసింది. బాబర్​తో పాటు మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాహీన్ అఫ్రిదీ, షాదాబ్ ఖాన్ వంటి సీనియర్ ప్లేయర్లు దారుణంగా విఫలమవడం ఆ జట్టును కోలుకోలేని విధంగా దెబ్బకొట్టింది. వన్డే వరల్డ్ కప్-2023 ఓటమిని మర్చిపోక ముందే పొట్టి కప్పులోనూ గ్రూప్ స్టేజ్​కే పరిమితం అవడంతో పాక్​పై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. చెత్తాటతో పరువు తీశారంటూ ఆటగాళ్లపై ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. మీరు ఆడి దండగ అంటూ సీరియస్ అవుతున్నారు. ఈ తరుణంలో పాక్​ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. స్వయంకృతాపరాధం వల్లే తమ జట్టు పరిస్థితి ఇలా తయారైందని అన్నాడు. బాబర్ సేన ఇంత చెత్తగా ఆడుతుందని అస్సలు ఊహించలేదన్నాడు.

పాకిస్థాన్ ప్లేయర్లు జట్టుగా కలసికట్టుగా ఆడితే రిజల్ట్ మరోలా ఉండేది. టీమ్​లోని ఆటగాళ్లంతా పర్సనల్ మైల్​స్టోన్స్ కోసం ఆడుతున్నారు. అందుకే జట్టుకు ఈ గతి పట్టింది. వ్యక్తిగత ప్రదర్శనల కోసం ఆడుతూ పాక్ క్రికెట్​ను నాశనం చేస్తున్నారు. బాబర్ ఆజం కింగ్ కాదు. అతడ్ని సోషల్ మీడియా అలా జెనరేట్ చేసింది’ అని అహ్మద్ షెహజాద్ విమర్శించాడు. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు గత నాలుగైదేళ్లుగా రెగ్యులర్​గా ఆడుతున్నారని.. అయినా ఇదేం పెర్ఫార్మెన్స్ అని దుయ్యబట్టాడు. రాజకీయాలు చేయడం తప్ప.. వీళ్లకు ఏదీ చేతకాదని సీరియస్ అయ్యాడు. పాక్ టీమ్​లోని ఏ ఆటగాడికీ ఫిట్​నెస్ లేదన్నాడు షెహజాద్. సూపర్-8 క్వాలిఫికేషన్ కోసం ఐర్లాండ్ టీమ్​ మీద ఆధారపడటం ఏంటని ప్రశ్నించాడు. పాక్​కు సూపర్-8కి వెళ్లే అర్హత లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. షెహజాద్​ కామెంట్స్​తో కొందరు నెటిజన్స్ ఏకీభవిస్తున్నారు. ఈసారి పాకిస్థాన్ చెత్తగా ఆడిందని.. ఆ టీమ్ కంటే యూఎస్​ఏ, ఆఫ్ఘానిస్థాన్ వంద రెట్లు బెటర్​గా పెర్ఫార్మ్ చేశాయని మెచ్చుకుంటున్నారు. మరి.. పాక్​ క్రికెట్​కు ఈ గతి పట్టడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి