Somesekhar
తాను యంగ్ బాయ్ ని అని, తనను బాబాయ్ అని పిలవకండి అంటూ అభిమానులను, నెటిజన్లను రిక్వెస్ట్ చేశాడు ఓ స్టార్ క్రికెటర్. మరి ఆ ప్లేయర్ ఎవరు? చూద్దాం పదండి.
తాను యంగ్ బాయ్ ని అని, తనను బాబాయ్ అని పిలవకండి అంటూ అభిమానులను, నెటిజన్లను రిక్వెస్ట్ చేశాడు ఓ స్టార్ క్రికెటర్. మరి ఆ ప్లేయర్ ఎవరు? చూద్దాం పదండి.
Somesekhar
సాధారణంగా తమ అభిమాన ఆటగాళ్లను ముద్దు పేర్లతో పిలుచుకుంటారు ఫ్యాన్స్. ఇక మరికొందరు వారి ఏజ్ ను బట్టి.. చిచ్చా, సర్, అంకుల్ అంటూ సంభోదిస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా పిలిస్తే సదరు ప్లేయర్లకు కోపం వస్తుంది. తనను కూడా చిచ్చా(బాబాయ్) అనిపిలిస్తే కోపం వస్తుందని, తాను యంగ్ బాయ్ ని అని, మీకు దండం పెడతా అలా పిలవొద్దని ఆవేదన వ్యక్తం చేశాడు ఓ స్టార్ ప్లేయర్. మరి ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆటగాళ్లను సోషల్ మీడియా వేదికగా లేదా ఎదురుగా వచ్చినప్పుడు సరదాగా వరుసలు పెట్టి పిలుస్తూ ఉంటారు అభిమానులు. అయితే కొందరు అలా పిలవడాన్ని క్యాజువల్ గా తీసుకుంటారు. కానీ కొందరు మాత్రం ఆ పిలుపుపై సీరియస్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం ఓ పాకిస్తాన్ ప్లేయర్ తనను చిచ్చా(బాబాయ్) అని పిలవకండి అంటూ ప్రాధేయపడుతున్నాడు. అతడే ఇఫ్తికర్ అహ్మద్. ఇతడి వయసు ప్రస్తుతం 33 సంవత్సరాలు. చూడ్డానికి వయసు మళ్లిన ప్లేయర్ లాగే కనిపిస్తాడు. దాంతో అభిమానులు ముద్దుగా చిచ్చా అని పిలుస్తుంటారు.
అయితే తనను ఇలా బాబాయ్ అని పిలవడం ఇష్టం లేదని తాను యంగ్ బాయ్ ని అని, మీకు దండం పెడతా.. దయచేసి అలా పిలవకండి అంటూ అందరిని వేడుకుంటున్నాడు ఇఫ్తికర్. అతడు ఇలా ఫ్యాన్స్ ను వేడుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో ఓ మ్యాచ్ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అతడిని చిచ్చా అనిపిస్తే.. ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇఫ్తికర్. ఆ వీడియో అప్పట్లో వైరల్ గా కూడా మారింది. ఇక అతడి కెరీర్ విషయానికి వస్తే.. పాక్ తరఫున 4 టెస్టులు, 28 వన్డేలు, 59 టీ20లు ఆడాడు. మరి బాబాయ్ అని పిలవకండి అంటూ వేడుకుంటున్న పాక్ ప్లేయర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.