iDreamPost
android-app
ios-app

అప్పట్లో సచిన్‌ను చూసి టీమ్‌ అంతా భయపడేవాళ్లం: పాక్‌ మాజీ క్రికెటర్‌

  • Published Jul 24, 2024 | 6:12 PMUpdated Jul 24, 2024 | 6:12 PM

Sachin Tendulkar, Basit Ali, IND vs PAK: టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అంటే తాము భయపడేవాళ్లం అంటూ పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ వెల్లడించాడు. ఈ కామెంట్‌ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Sachin Tendulkar, Basit Ali, IND vs PAK: టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అంటే తాము భయపడేవాళ్లం అంటూ పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ వెల్లడించాడు. ఈ కామెంట్‌ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Jul 24, 2024 | 6:12 PMUpdated Jul 24, 2024 | 6:12 PM
అప్పట్లో సచిన్‌ను చూసి టీమ్‌ అంతా భయపడేవాళ్లం: పాక్‌ మాజీ క్రికెటర్‌

దిగ్గజ మాజీ క్రికెటర్‌, గాడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్రికెట్‌ సచిన్‌ టెండూల్కర్‌ గురించి ఓ పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌ను రెండు దశాబ్దాల పాటు ఏలిన లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌.. తన బ్యాటింగ్‌ దండయాత్ర సాగుతున్న కాలంలో ఎంతో మంది గొప్ప గొప్ప బౌలర్లకు నిద్ర లేకుండా చేశాడు. చాలా మంది బౌలర్ల కెరీర్లను ముగించాడు. ఇండియా అంటే సచిన్‌.. సచిన్‌ అంటే ఇండియాగా సాగింది అప్పట్లో సచిన్‌ జైత్రయాత్ర. సచిన్‌ ఒక్కడ్ని అవుట్‌ చేస్తే చాలు టీమిండియాపై గెలిచినట్లే అని ప్రత్యర్థి జట్లు భావించేవి. ఇలాంటి మాటలు మనం చెప్పుకోవడం కాదు.. మన చిరకాల శత్రుదేశం పాకిస్థాన్‌కు ఆడిన మాజీ క్రికెటర్‌ చెబుతున్నాడు.

1993 నుంచి 1996 మధ్య కాలంలో పాకిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించిన బాసిత్‌ అలీ.. తాజాగా సచిన్‌ టెండ్కూలర్‌ గురించి మాట్లాడుతూ.. ‘సచిన్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌, నేను మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌.. అయినా కూడా సచిన్‌ బ్యాటింగ్‌ చేసేవాడ్ని. వసీం అక్రమ్‌ పాకిస్థాన్‌ జట్టు కెప్టెన్‌గా ఉన్న సమయంలో.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో, ప్రాక్టీస్‌లో, తినేటప్పుడు.. ప్రతి చోటా ఒకే మాట చెప్పేవాడు సచిన్‌ను అవుట్‌ చేస్తే చాలు ఇండియాపై మన గెలిస్తాం అని, అలాగే సచిన్‌ను త్వరగా అవుట్‌ చేస్తే పాకిస్థాన్‌ గెలిచేంది. ది గ్రేట్‌ అజహరుద్దీన్‌ టీమిండియాలో ఉన్నా.. ఆయన అంటే భయపడేవాళ్లం కాదు.. కానీ, సచిన్‌ అంటే భయమేసేది.’ అంటూ బాసిత్‌ అలీ వెల్లడించారు.

బాసిత్‌ అలీ, సచిన్‌ గురించి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. గతంలో సచిన్‌ టెండ్కూలర్‌ గురించి ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ సైతం ఇలాంటి కామెంట్స్‌ చేశాడు. కలలో కూడా సచిన్‌ తనను భయపెడుతున్నాడంటూ పేర్కొన్నాడు. ఇప్పుడు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌కు ఆడిన ఓ మాజీ క్రికెటర్‌ సచిన్‌ గురించి ఇలా మాట్లాడటంతో భారత క్రికెట్‌ అభిమానులు ఆ వీడియో తెగ షేర్‌ చేస్తున్నారు. కాగా బాసిత్‌ అలీ తన నాలుగేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 19 టెస్టులు, 50 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 858, వన్డేల్లో 1265 పరుగులు చేశాడు. రెండు ఫార్మాట్స్‌లో ఒక్కో సెంచరీ ఉంది. టెస్టుల్లో 5, వన్డేల్లో 9 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. మరి బాసిత్‌ అలీ సచిన్‌ గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి