SNP
Pakistan, Basit Ali, Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
Pakistan, Basit Ali, Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
SNP
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. శ్రీలంకతో చివరి వన్డేకు సిద్ధమైంది భారత జట్టు. బుధవారం కొలంబో వేదికగా మూడో వన్డే ఆడనుంది. తొలి వన్డే టై కాగా, రెండో వన్డేలో రోహిత్ సేన ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే.. ఈ రెండు వన్డేల్లో విరాట్ కోహ్లీ ప్రదర్శనతో పాటు టీమిండియాలోని మరికొంత మంది భారత క్రికెటర్ల ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ.. రెండు వన్డేల్లోనూ స్పిన్నర్ల ముందు లెగ్ బిఫోర్‌గా అవుట్ అవ్వడం చూస్తుంటే.. అతను పెద్దగా ప్రిపేర్ కాకుండానే సిరీస్ ఆడుతున్నట్లు అనిపిస్తోందంటూ ఆరోపించాడు.
అతను మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లీ లాంటి గొప్ప బ్యాట్స్‌మెన్, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే ఇలా అవుట్ అయ్యి ఉంటే అర్థం చేసుకోవచ్చు. కానీ విరాట్ కోహ్లీ ఇలా అవుట్ అవ్వడం సరైంది కాదు. అతను సరైన ప్రాక్టీస్ చేయలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అలాగే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ సైతం ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా సిరీస్ ఆడేందుకు వచ్చినట్లున్నారు. ఇది ప్రపంచ క్రికెట్‌ను శాసించే బ్యాటింగ్ లైనప్‌లా కనిపించడం లేదు.’ అంటూ బాసిత్ అలీ విమర్శించాడు.
అలాగే శ్రేయస్ అయ్యర్ స్థానంలో.. రిషభ్ పంత్, రియాన్ పరాగ్‌లలో ఒకరిని జట్టులోకి తీసుకోవాలని కూడా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు సూచించాడు. దేశవాళి క్రికెట్‌లో వన్డే ఫార్మాట్ బాగా ఆడే ఆటగాళ్లను వెతికి పట్టుకోవాలని, లేదంటే.. వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా నుంచి మంచి ఫలితాలు ఆశించలేమంటూ ఎద్దేవా చేశాడు. విరాట్ కోహ్లీ.. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో వనిందు హసరంగా బౌలింగ్‌లో అలాగే, రెండో వన్డేలో జెఫ్రీ వాండర్సే బౌలింగ్‌లో లెగ్ బిఫోర్‌గా అవుటైన విషయం తెలిసిందే. బాసిత్ అలీ.. ఒక వైపు కోహ్లీని పొగుడుతూనే విమర్శలు గుప్పించాడు. మరి అతని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Basit Ali on Virat Kohli’s back-to-back LBW dismissals in SL vs IND ODI series 🗣#cricket #SLvIND #viratkohli #BasitAli #TeamIndia #CricketTwitter pic.twitter.com/bRy5DWeugE
— CricketTimes.com (@CricketTimesHQ) August 6, 2024