SNP
Ahmed Shehzad, Gully Cricket: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై దారుణమైన కామెంట్స్ చేసిన ఓ మాజీ క్రికెటర్ తాజాగా తన పరువును తానే తీసుకున్నాడు. అది కూడా ఓ గల్లీ బౌలర్ చేతిలో. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
Ahmed Shehzad, Gully Cricket: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై దారుణమైన కామెంట్స్ చేసిన ఓ మాజీ క్రికెటర్ తాజాగా తన పరువును తానే తీసుకున్నాడు. అది కూడా ఓ గల్లీ బౌలర్ చేతిలో. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
SNP
అంతర్జాతీయ క్రికెట్‌లో ఫీల్డింగ్ విన్యాసాలతో నవ్వులు పూయించే పాకిస్థాన్ క్రికెట్లు ఇప్పుడు ఆఫ్ ది ఫీల్డ్ కూడా తమ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు. క్రికెట్ ఎక్కడ ఆడినా.. నవ్వులపాలు కావడం తమకు మాత్రమే సాధ్యమంటూ మరోసారి చాటిచెప్పారు. తాజాగా ఓ పాకిస్థాన్ మాజీ క్రికెటర్.. సరదాగా గల్లీ క్రికెటర్లతో ఆడుతూ.. నాలుగు బంతుల్లో ఏకంగా మూడు సార్లు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో విశేషం ఏంటంటే.. ఇలా నాలుగు బంతుల్లో మూడు సార్లు అవుటైన ఆ పాక్ క్రికెటర్‌ను పాక్ క్రికెట్ అభిమానులే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరంటే.. అహ్మద్ షెహజాద్. పాకిస్థాన్ తరఫున 13 టెస్టులు, 81 వన్డేలు, 59 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 982, వన్డేల్లో 2605, టీ20ల్లో 1471 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్స్‌లోనూ సెంచరీలు ఉన్నాయి. అలాంటి ఆటగాడు సరదాగా ఒక గార్డెన్‌లో కొంతమందితో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతుంటే.. ఆ బౌలర్ ఛాలెంజ్ చేసి మరీ.. షెహజాద్‌ను నాలుగు బంతుల్లో మూడు సార్లు అవుట్ చేశాడు. ఒక ఓవర్‌లో మూడు సిక్సులు కొడతానంటూ షెహజాద్ బ్యాటింగ్‌కు దిగాడు. కానీ, నాలుగు బంతుల్లో మిడ్ వైపు ఎక్రాస్ ది లైన్ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు.
దీంతో.. అతనిపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ 2024 సందర్భంగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై దారుణమైన కామెంట్స్ చేశాడు షెహజాద్. బాబర్ అజమ్ ఒక చెత్త క్రికెటర్ అంటూ.. తనకంటే నేను బెస్ట్ అంటూ ఓ టీవీ షోలో పేర్కొన్నాడు. ఇప్పుడు ఓ గల్లీ బౌలర్ బౌలింగ్‌లో నాలుగు బంతుల్లో మూడు సార్లు అవుట్ కావడంతో బాబర్ ఆజమ్ అభిమానులు షెహజాద్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ahmed Shehzad was bowled out three times in an over by a local resident in Chitral…. 🥵 pic.twitter.com/yJUZlLRJcY
— Nawaz 🇵🇰 (@Rnawaz31888) July 23, 2024