వన్డే వరల్డ్ కప్-2023లో పాకిస్థాన్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్‌లో నెగ్గిన పాక్.. శ్రీలంకతో మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లోనూ గెలిచింది. భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసి కాన్ఫిడెన్స్‌ను మరింత పెంచుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ చీటింగ్ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో చేసిన తప్పునే తిరిగి లంక పైనా కావాలనే రిపీట్ చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాక్-నెదర్లాండ్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఓ ఘటన వివాదాస్పదంగా మారింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ టైమ్‌లో పాక్ ఫీల్డర్ బౌండరీ లైన్‌ను వెనక్కి నెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
నెదర్లాండ్స్ బ్యాటింగ్ టైమ్‌లో ఓ 30 నిమిషాల పాటు బౌండరీ లైన్ మ్యాచ్ మొదలైనప్పటి కంటే కాస్త వెనక్కి ఉన్నట్లు న్యూస్ వచ్చింది. అయితే దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ చీటింగ్ చేసిందంటూ సీరియస్ అయ్యారు. అయితే ఆ ఘటన విషయంలో నిజంగానే పాకిస్థాన్ ఫీల్డర్ బౌండరీ లైన్‌ను ఉద్దేశ పూర్వకంగా వెనక్కి నెట్టాడా? లేదా ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో బౌండరీని ఆపబోయి డైవ్ చేసిన క్రమంలో బౌండరీ లైన్ వెనక్కి జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇది జరిగి నాల్రోజులు కాలేదు.. మరో మ్యాచ్‌లో సేమ్ సీన్ రిపీట్ అయింది. శ్రీలంకతో మంగళవారం పాక్ ఆడిన సమయంలోనూ బౌండరీ లైన్ కాస్త వెనక్కి జరిగినట్లు కనిపించింది.
లంక ఇన్నింగ్స్ టైమ్‌లో బౌండరీ లైన్ వెనక్కి జరిగి ఉన్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ పాక్ మరోమారు చీటింగ్ చేసిందని.. ఆ టీమ్ కావాలనే బౌండరీ లైన్‌ను వెనక్కి నెట్టిందని విమర్శిస్తున్నారు. మ్యాచ్‌లో ఓడిపోతామనే పాక్ ఇలాంటి కుయుక్తులు పన్నుతోందని ట్రోల్ చేస్తున్నారు. ఆ జట్టు బుద్ధి మార్చుకోకపోతే కష్టమని సీరియస్ అవుతున్నారు. అసలు పాక్ ఆడినప్పుడే, అందులోనూ ఆ టీమ్ ఫీల్డింగ్ టైమ్‌లోనే ఎందుకిలా జరుగుతోందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
సాధారణంగా ఫీల్డర్లు బౌండరీ లైన్లో ఫోర్లను ఆపే ప్రయత్నంలో ఫోర్ లైన్ కాస్త వెనక్కి జరిగినా.. గ్రౌండ్ స్టాఫ్ వెంటనే దాన్ని సరిచేస్తుంటారు. బౌండరీ లైన్ ఎలా ఉండాలో అలా సెట్ చేసేస్తారు. కానీ నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 30 నిమిషాల పాటు బౌండరీ లైన్ అలాగే వెనక్కి ఉంది. లంకతో మ్యాచ్‌లోనూ బౌండరీ లైన్ వెనక్కి జరిగినా మళ్లీ సరిచేయలేదు. పాక్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ బౌండరీ వివాదం చోటుచేసుకుంది. ఈ రెండు మ్యాచ్‌లూ ఉప్పల్లోనే జరిగాయి. ఈ నేపథ్యంలో ఇది పాక్ చేస్తున్న చీటింగా? లేదా గ్రౌండ్ స్టాఫ్ అలసత్వం కారణంగా జరుగుతోందా? అనేది క్లారిటీ లేదు. మరి.. పాక్ చీటింగ్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: World Cup: సెంచరీ కొట్టాక హాస్పిటల్లో చేరిన స్టార్ క్రికెటర్!