iDreamPost
android-app
ios-app

Pakistan: ఇండియా కొట్టిన దెబ్బకి.. ఇంకా కోలుకోని పాకిస్థాన్‌! ఇదుగో సాక్ష్యం..

  • Published Sep 12, 2024 | 7:58 PM Updated Updated Sep 12, 2024 | 7:58 PM

Team India is the reason for the downfall of Pakistan cricket: పాక్ క్రికెట్ పతనం వైపు సాగుతూ.. కోలుకోలేని స్థితికి చేరుకుంటోంది. పాక్ కు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఇండియానే అని మీకు తెలుసా? టీమిండియా గతేడాది కొట్టిన దెబ్బ దగ్గర నుంచి పాక్ పతనం మెుదలైంది.

Team India is the reason for the downfall of Pakistan cricket: పాక్ క్రికెట్ పతనం వైపు సాగుతూ.. కోలుకోలేని స్థితికి చేరుకుంటోంది. పాక్ కు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఇండియానే అని మీకు తెలుసా? టీమిండియా గతేడాది కొట్టిన దెబ్బ దగ్గర నుంచి పాక్ పతనం మెుదలైంది.

Pakistan: ఇండియా కొట్టిన దెబ్బకి.. ఇంకా కోలుకోని పాకిస్థాన్‌! ఇదుగో సాక్ష్యం..

పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితి రోజురోజుకు తీసికట్టుగా తయ్యారు అవుతోంది. ఆ జట్టు సొంత గడ్డపై సిరీస్ గెలిచి దాదాపు 3 ఏళ్లు కావొస్తుందంటే నమ్ముతారా? కానీ ఇది అక్షర సత్యం. సిరీస్ ల సంగతి అటుంచితే.. యూఏఈ లాంటి పసికూన లాంటి జట్లపై  ఓడిపోతూ ఇంటా, బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. బాబర్ అజం, మహ్మద్ రిజ్వాన్, నసీం షా, షాహీన్ షా లాంటి ప్లేయర్లతో పేపర్ పై పటిష్టంగా కనిపిస్తున్నా.. గ్రౌండ్ లోకి దిగేసరికి తేలిపోతోంది. దాంతో పాక్ క్రికెట్ పతనం వైపు సాగుతూ.. కోలుకోలేని స్థితికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో పాక్ కు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఇండియానే అని మీకు తెలుసా? టీమిండియా గతేడాది కొట్టిన దెబ్బ దగ్గర నుంచి పాక్ పతనం మెుదలైంది.

పాకిస్థాన్.. ఒకప్పడు ఈ జట్టును ఓడించాలంటే ప్రత్యర్థులకు చెమటలు పట్టేడి. వసీం అక్రమ్, సయ్యద్ అన్వర్, ఇమ్రాన్ ఖాన్ లాంటి దిగ్గజ క్రికెటర్ల హయాంలో పాక్ క్రికెట్ ఓ వెలుగు వెలిగింది. కానీ.. రానురాను ఆ జట్టు ఆటతీరు తీసికట్టుగా తయ్యారౌతూ వస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మూడేళ్లలో పాకిస్థాన్ క్రికెట్ పతనం వైపు కొనసాగుతోంది. ఈ మూడు సంవత్సరాల్లో పాక్ ఒక్క సిరీస్ కూడా సొంత గడ్డపై గెలవలేదు. మరి ఇంత దారుణంగా పాక్ ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం భారత్ కొట్టిన ఆ దెబ్బే. ఆ మ్యాచ్ లో టీమిండియా ఓడించిన దగ్గర నుంచి పాక్ పతనం ప్రారంభం అయ్యింది. 2023 ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ ప్రకారం 228 పరుగుల తేడాతో గెలిచింది.

Pakisthan vs India

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ 122 నాటౌట్, కేఎల్ రాహుల్ 111 నాటౌట్ సెంచరీలతో చెలరేగారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాక్ 32 ఓవర్లలో 8 వికెట్లకు 128 పరుగులు మాత్రమే చేసింది(డక్ వర్త్ లూయిస్ ప్రకారం). ఇక ఎప్పుడైతే ఈ మ్యాచ్ లో ఓడిపోయిందో.. అప్పటి నుంచి పాక్ పతనం మెుదలైందనే చెప్పాలి. ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో సూపర్ 4లోనే ఇంటిదారి పట్టింది. అదీకాక 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో లీగ్ స్టేజ్ లోనే నిష్క్రమించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 3-0తో చిత్తుగా ఓడిపోయింది. కొన్ని రోజుల క్రితం న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ ను కూడా కోల్పోయింది.

కాగా.. ఇవన్నీ ఒకెత్తు అయితే.. ఐర్లాండ్ చేతిలో టీ20, వరల్డ్ కప్ లో యూఏఈ చేతిలో దారుణ ఓటములు మరొకెత్తు. ఇక తాజాగా సొంత గడ్డపై రెండు టెస్ట్ ల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి.. ఇంతకంటే దారుణం మరోటి ఉండదని నిరూపించుకుంది పాకిస్థాన్. టీమిండియా గత సంవత్సరం ఇదే రోజుల్లో కొట్టిన దెబ్బకు పాక్ ఇంకా కోలుకోకపోవడం గమనార్హం. ఇక ఈ గణాంకాలు చూసి.. పాక్ క్రికెట్ పతనం వెనక టీమిండియా ఉందని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.