SNP
Pakistan, PCB, Army Training: బ్యాట్ బాల్ పట్టి గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేయాల్సిన క్రికెటర్లు.. గన్నులు పట్టి ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇలాంటి వింత వింత ఐడియాలన్నీ పాకిస్థాన్‌కే వస్తాయి. కానీ, ఈ ఐడియా వెనుక టీమిండియాను టార్గెట్ చేశారని తెలుస్తోంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
Pakistan, PCB, Army Training: బ్యాట్ బాల్ పట్టి గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేయాల్సిన క్రికెటర్లు.. గన్నులు పట్టి ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇలాంటి వింత వింత ఐడియాలన్నీ పాకిస్థాన్‌కే వస్తాయి. కానీ, ఈ ఐడియా వెనుక టీమిండియాను టార్గెట్ చేశారని తెలుస్తోంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
SNP
కాకుల్‌లోని ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ గతకొన్ని రోజులుగా పాకిస్థాన్ క్రికెటర్లు ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంటున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిపై కొంతమంది క్రికెట్ అభిమానులు జోకులు కూడా పేలుస్తున్నారు. క్రికెట్‌లో కప్పులు కొట్టాలంటే.. ఆటపై దృష్టిపెట్టాలని, ఇలా ఆర్మీ ట్రైనింగ్‌పై కాదని ట్రోల్ చేస్తున్నారు. అయితే.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఈ ఆర్మీ ట్రైనింగ్ ఇవ్వడం వెనుక పెద్ద ప్లానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కాకుండా.. టీమిండియానే టార్గెట్‌గా ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. క్రికెట్‌లో టీమిండియాను ఓడించేందుకు ఆర్మీ ట్రైనింగ్‌కు ఏంటి సంబంధం అనే డౌట్ చాలా మందికి రావొచ్చు.
అయితే.. ఆటగాళ్లు ఎంత బాగా ఆడినా కొన్ని సందర్భాల్లో మానసికంగా కూడా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే.. ప్రతి మ్యాచ్ వన్‌సైడ్ జరగదు. పైగా పాకిస్థాన్ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పడం చాలా కష్టం. మ్యాచ్ కాస్త నెక్ టూ నెక్ వెళ్తే.. వాళ్లు చేతులెత్తేస్తారు. అనేక సందర్భాల్లో ప్రెజర్‌కు లోనై పాకిస్థాన్ చాలా మ్యాచ్‌లు ఓడిపోయింది. ఎందుకంటే వాళ్లు ఒత్తిడిని తట్టుకోలేరు. దానికి మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. క్రమశిక్షణతో కూడిన ఫిజికల్ ఫిట్‌నెస్‌తో మెంటల్ స్ట్రెంత్ పెరుగుతుంది. అలాగే పాకిస్థాన్ టీమ్‌లో చాలా మందికి సరైన ఫిట్‌నెస్ కూడా లేదు. దాన్ని కూడా కఠినమైన ట్రైనింగ్‌తో అధిగమించవచ్చు. దాని కోసమే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా పాకిస్థాన్ టీమిండియాతో మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో ఎలాగైన గెలవాలనే కసితోనే పీసీబీ పాక్ క్రికెటర్లకు ఈ ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆటగాళ్లపై ఎంత ఒత్తిడి ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఆ ఒత్తిడిన అధిగమిస్తే కానీ, టీమిండియా లాంటి పటిష్టమైన జట్టుపై గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇలా టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాను ఓడించడమే లక్ష్యంగా, ఆటగాళ్లలో మానసిక, శారీరక బలాన్ని పెంచేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లుకు ఆ దేశ ఆర్మీతో కఠినమైన ట్రైనింగ్ ఇప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంత ట్రైనింగ్ తీసుకున్నా.. టీమిండియాను ఓడించడం వారి వల్ల కాదని భారత క్రికెట్ అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.