వీడియో: పాక్‌ క్రికెటర్‌ మైండ్‌బ్లోయింగ్‌ షాట్‌! చూసి నవ్వకుండా ఉంటే గ్రేట్‌!

Usman Mir, Pakistan, The Hundred 2024: ప్రపంచంలో ఎక్కడ క్రికెట్‌ ఆడినా.. పాకిస్థాన్‌ క్రికెటర్లు తమ బ్రాండ్‌ ఆఫ్‌ క్రికెట్‌తో నవ్వులపాలు కాకుండా ఉండలేరు. తాజాగా ఓ పాక్‌ క్రికెటర్‌ దేశం పేరు నిలబెడుతూ.. ఏం చేశాడో చూడండి.

Usman Mir, Pakistan, The Hundred 2024: ప్రపంచంలో ఎక్కడ క్రికెట్‌ ఆడినా.. పాకిస్థాన్‌ క్రికెటర్లు తమ బ్రాండ్‌ ఆఫ్‌ క్రికెట్‌తో నవ్వులపాలు కాకుండా ఉండలేరు. తాజాగా ఓ పాక్‌ క్రికెటర్‌ దేశం పేరు నిలబెడుతూ.. ఏం చేశాడో చూడండి.

క్రికెట్‌లో చిత్రవిచిత్రమైన పనులు చేయాలంటే పాకిస్థాన్‌ క్రికెటర్లకే సాధ్యమనే అభిప్రాయం చాలా మంది క్రికెట్‌ అభిమానుల్లో ఉంది. సింపుల్‌ క్యాచ్‌లను వదిలేయడం, ఒక క్యాచ్‌ కోసం ఇద్దరు ముగ్గురు పోటీ పడి.. చివరికి ఆ బాల్‌ను వదిలేయడం, చెత్త ఫీల్డింగ్‌తో నవ్వులపాలు కావడం, బ్యాటింగ్‌లో చిత్రమైన షాట్లు ఆడి వికెట్‌ సమర్పించుకోవడం.. ఇలాంటి ఫన్నీ థింక్స్‌ అన్నీ.. పాకిస్థాన్‌ క్రికెటర్లు ఎక్కువగా చేస్తుంటారు. తాజాగా ఓ పాకిస్థాన్‌ క్రికెటర్‌ ఇలాంటి ఫన్నీ థింగ్‌ ఒకటి చేశాడు. అదేంటో తెలిస్తే, ఆ వీడియో చూస్తే ఏ క్రికెట్‌ అభిమాని అయిన సరే నవ్వుకుండా ఉండలేరు.

పాకిస్థాన్‌ క్రికెటర్‌ ఉస్మాన్‌ మీర్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్‌ టోర్నీలో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా గురువారం సౌతాంప్టన్‌లోని అతను రోజ్ బౌల్ స్టేడియంలో సదరన్ బ్రేవ్, మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఉస్మాన్‌ మీర్‌ 6 బంతుల్లో రెండు ఫోర్లతో 11 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉన్నాడు. అదే సమయంలో క్రిస్‌ జోర్డాన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడేందుకు డీప్‌ క్రీజ్‌లోకి వెళ్లి.. బ్యాట్‌ను వెనక్కి లే…పి బాల్‌ను కొట్టబోయి వికెట్లను కొట్టేశాడు. దాంతో హిట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. ఏదో భారీ షాట్‌ ఆడతాడు అనుకుంటే.. వికెట్లను కొట్టి హిట్‌ వికెట్‌ అవ్వడంతో గ్రౌండ్లో ఉన్న ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా నవ్వుకున్నారు.

ప్రస్తుతం ఉస్మాన్‌ మీర్‌ వికెట్లను బ్యాట్‌తో కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసి.. ప్రపంచంలో ఎక్కడ ఆడినా పాకిస్థాన్‌ క్రికెటర్లు తమ బ్రాండ్‌ ఆఫ్‌ క్రికెట్‌ను చూపిస్తారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్లు నష్టానికి 116 పరుగులు చేసింది. ఛేజింగ్‌కు దిగిన సదరన్ బ్రేవ్ జట్టు 78 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. మరి ఈ మ్యాచ్‌లో ఉస్మాన్‌ మీర్‌ ఆడిన షాట్‌పై అవుటైన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments