ఇప్పుడంతా వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ప్రపంచ కప్ గురించే మాట్లాడుకుంటున్నారు. మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న భారత్‌లో సందడి మొదలైంది. ఒక్కొక్కటిగా అన్ని జట్లు ప్రపంచ కప్ కోసం ఇండియాకు చేరుకున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు వార్మప్ మ్యాచ్ కూడా ఆడేశాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ నెగ్గింది. ఇదిలా ఉంటే.. పాక్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. షాదాబ్ మేనత్త కన్నుమూశారు. వరల్డ్ కప్‌లో ఆడేందుకు భారత్‌కు వచ్చిన షాదాబ్.. తన మేనత్త చనిపోయారనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
మేనత్త ఆత్మకు శాంతి చేకూరాలని, అందుకు ప్రార్థనలు చేయాలని అభిమానులను షాదాబ్ ఖాన్ కోరాడు. అయితే ఆమె ఎలా చనిపోయిందనే విషయాన్ని మాత్రం అతడు స్పష్టం చేయలేదు. షాదాబ్ ఇంట్లో విషాదం నెలకొనడంపై పాక్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. అతడి మేనత్త ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రపంచ కప్‌లో ఆడటం కోసం పాకిస్థాన్ జట్టు బుధవారం రాత్రి భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. చాన్నాళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన దాయాది టీమ్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. పాక్ ప్లేయర్లను చూసేందుకు వందలాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
హోటల్లోనూ పాక్ క్రికెటర్లకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. అనంతరం ప్రాక్టీస్ మొదలుపెట్టింది దాయాది టీమ్. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడింది. ప్రస్తుతం పాక్ ఆటగాళ్లు హైదరాబాద్‌లోనే ఉన్నారు. మెగా టోర్నీ ఫైనల్ నవంబర్ 19న జరగనుండగా.. నవంబర్ 12 వరకు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. దీంతో అప్పటిదాకా పాక్ టీమ్‌తోపాటు షాదాబ్ ఖాన్ కూడా ఇండియాలోనే ఉండే ఛాన్స్ ఉంది. హైదరాబాద్‌కు చేరుకున్న కొన్ని గంటల్లోనే సిటీలో నిర్వహించిన వరల్డ్ కప్ ఈవెంట్లో టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్‌తో కలసి షాదాబ్ పాల్గొన్నాడు.
ఇదీ చదవండి: వరల్డ్ కప్‌లో అతడ్ని ఆడించకుండా తప్పు చేస్తున్నారు: యువరాజ్
Heard the news of my phupo passing away. Please remember her in your prayers.
إِنَّا لِلَّٰهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُون
— Shadab Khan (@76Shadabkhan) September 30, 2023