iDreamPost
android-app
ios-app

Saim Ayub: వీడియో: సూర్య క్యాచ్ కాపీ కొట్టబోయి నవ్వుల పాలు! పాకిస్థాన్ అంటార్రా బాబు!

  • Published Sep 18, 2024 | 2:02 PM Updated Updated Sep 18, 2024 | 2:02 PM

Saim Ayub copy Suryakumar Yadav catch: టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్బుతమైన క్యాచ్ ను కాపీ కొట్టబోయిన పాక్ ఫీల్డర్ అందుకు భారీ మూల్యమే చెల్లించుకున్నాడు.

Saim Ayub copy Suryakumar Yadav catch: టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్బుతమైన క్యాచ్ ను కాపీ కొట్టబోయిన పాక్ ఫీల్డర్ అందుకు భారీ మూల్యమే చెల్లించుకున్నాడు.

Saim Ayub: వీడియో: సూర్య క్యాచ్ కాపీ కొట్టబోయి నవ్వుల పాలు! పాకిస్థాన్ అంటార్రా బాబు!

పాకిస్థాన్ క్రికెట్ టీమ్.. నిత్యం ఏదో ఒక విషయంలో విమర్శలు ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవలే బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో దారుణంగా ఓడిపోయి.. ఇంటా, బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక పాక్ ఫీల్డింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రతి మ్యాచ్ లో దాదాపు ఐదారు క్యాచ్ లు మిస్ చేస్తూ.. పసికూన జట్లకంటే తీసికట్టుగా తయ్యారు అవుతూ వస్తోంది. తాజాగా మరోసారి మిస్ ఫీల్డ్ తో ట్రోల్స్ పాలవుతోంది. ఈసారి టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్బుతమైన క్యాచ్ ను కాపీ కొట్టబోయిన పాక్ ఫీల్డర్ అందుకు భారీ మూల్యమే చెల్లించుకున్నాడు.

ప్రస్తుతం పాకిస్థాన్ లో ఛాంపియన్స్ వన్డే కప్ టోర్నీ జరుగుతోంది. అందులో భాగంగా తాజాగా డాల్ఫిన్స్ వర్సెస్ లేక్ సిటీ పాంథర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ పట్టినట్లే క్యాచ్ పడదామని అనుకున్న పాకిస్థాన్ ప్లేయర్ కు ఊహించని షాక్ తగిలింది. దాంతో అతడు నవ్వులపాలవుతున్నాడు. అసలేం జరిగిందంటే? వన్డే కప్ లో భాగంగా డాల్ఫిన్స్-పాంథర్స్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో డాల్ఫిన్స్ బ్యాటర్ మహ్మద్ అఖ్లాక్ బ్యాటింగ్ చేస్తుండగా.. 18వ ఓవర్ వేయడానికి వచ్చాడు ఉసామా మీర్. ఓవర్ రెండో బంతిని ఫుల్ లెంగ్త్ బాల్ గా సంధించగా.. దాన్ని అఖ్లాక్ భారీ షాట్ కొట్టాడు. దాంతో బాల్ సరాసరి స్టాండ్స్ వైపు దూసుకెళ్లింది.

ఈ క్రమంలోనే లాంగ్ ఆఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సైమ్ అయూబ్ బాల్ ను సూర్యకుమార్ స్టైల్లో క్యాచ్ అందుకోబోయాడు. కానీ కుదరలేదు. బ్యాలెన్స్ తప్పడంతో బంతి కాస్త బౌండరీ లైన్ లో పడింది. దాంతో బౌలర్ తో పాటుగా అందరూ నిరాశకు లోనైయ్యారు. ప్రస్తుతం ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో.. నెటిజన్లు ఆయూబ్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సూర్యకుమార్ క్యాచ్ కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైయ్యావ్ కదా బ్రో, అసలు క్యాచ్ పట్టకపోయినా.. సిక్స్ వెళ్లకుండా ఆపాల్సింది కదా? పాకిస్థాన్ ప్లేయర్లు ఎంటర్ టైన్ చేయడంలో ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వరు.. పాకిస్థాన్ అంటార్రా బాబు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. పాపం సూర్యకుమార్ లాగా అద్బుతంగా క్యాచ్ పట్టి హీరో అయిపోదాం అనుకున్న ఆయూబ్ కాస్త విలన్ గా మారి విమర్శలపాలైయ్యాడు. కాగా.. స్కై ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన భారీ షాట్ ను బౌండరీ లైన్ దగ్గర సిక్సర్ వెళ్లకుండా అద్భుతంగా క్యాచ్ పట్టుకున్నాడు. దాంతో టీమిండియా 7 రన్స్ తో టీమిండియాను ఓడించి.. రెండోసారి పొట్టి ప్రపంచ కప్ ను ముద్దాడింది.