iDreamPost
android-app
ios-app

చంద్రయాన్-3 సక్సెస్‌పై పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ ఊహించని ట్వీట్!

  • Published Aug 24, 2023 | 2:35 PM Updated Updated Aug 24, 2023 | 2:35 PM
  • Published Aug 24, 2023 | 2:35 PMUpdated Aug 24, 2023 | 2:35 PM
చంద్రయాన్-3 సక్సెస్‌పై పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ ఊహించని ట్వీట్!

ఇస్రో(ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతంమైంది. జులై 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట నుంచి రాకెట్‌ను నింగిలోకి పంపించారు. వివిధ దశలను విజయవంతంగా దాటి జాబిల్లిపై ఆగస్టు 23న విక్రమ్‌ ల్యాండర్‌ సక్సెస్‌ఫుల్‌ దిగింది. దీంతో చంద్రయాన్‌-3 ప్రయోగం సక్సెస్‌ అయినట్లు ఇస్రో ప్రకటించింది. చంద్రుడిపై ప్రపంచ దేశాలన్ని కలిపి ఇప్పటికే 111 ప్రయోగాలు చేశాయి. అందులో కొన్ని మాత్రమే విజయవంతం అయ్యాయి. అయితే.. చంద్రుడిపై ల్యాండర్‌ను దింపింది మాత్రం కేవలం నాలుగు దేశాలే.

ఈ చంద్రయాన్‌-3 ప్రయోగంతో విక్రమ్‌ ల్యాండర్‌ను జాబిల్లిపై ల్యాండ్‌ చేయడంతో చంద్రుడిపై జెండా పాతిన నాలుగో దేశంగా ఇండియా నిలిచింది. అలాగే చంద్రుడి దక్షిణ ద్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో యావత్‌ దేశం గర్వంగా తలెత్తుకుని విశ్వంలో ఇండియా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. చంద్రయాన్‌-3 రాకెట్‌ లాంచ్‌ చేసిన తర్వాత.. మనకంటే ముందుగా చంద్రుడి దక్షిణ ద్రువంపై కాలుమోపాలని రష్య హడావిడిగా చేపట్టిన ప్రయోగం విఫలం అయ్యింది. కానీ, నిదానమే ప్రధానంగా సాగిన చంద్రయాన్‌ ప్రయోగం విజయవంతమైంది.

రష్యా చేసిన లూనార్‌ ప్రయోగం విఫలం అయిన తర్వాత.. ప్రపంచం మొత్తం దృష్టి చంద్రయాన్‌-3 పడింది. విక్రమ్‌ ల్యాండర్‌ సేఫ్‌గా చంద్రుడిపై ల్యాండ్‌ అవుతుందా లేదా అని ప్రపంచ మొత్తం మనవైపు చూసింది. అందులో పాకిస్థాన్‌ కూడా ఉంది. బుధవారం సాయంత్రం 6.04 నిమిషాలకు విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై సేఫ్‌గా దిగడంతో ప్రపంచం మొత్తం ఇండియాను, ఇస్రోను అభినందనలతో ముంచెత్తింది. మన శత్రుదేశం పాకిస్థాన్‌ నుంచి కూడా కొంతమంది ఇండియా సాధించిన విజయాన్ని పొగుతూ సోషల్‌ మీడియాలో స్పందించారు. వారిలో ఓ స్టార్‌ క్రికెటర్‌ కూడా ఉండటం విశేషం.

పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ మొహమ్మద్‌ హఫీజ్‌.. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం కావడంపై స్పందిస్తూ.. ఇండియాకు శుభాకాంక్షలు తెలిపాడు. పైగా తన ట్వీట్‌లో మన జాతీయ జెండాను పెట్టడం విశేషం. అయితే చంద్రయాన్‌3మిషన్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ కూడా జతచేశాడు. శత్రుదేశం సాధించిన విజయంపై ఎంతో హుందాగా స్పందించిన పాక్‌ క్రికెటర్‌ హఫీజ్‌ను ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ సైతం అభినందిస్తున్నారు. హఫీజ్‌ పాకిస్థాన్‌ తరఫున 55 టెస్టులు, 218 వన్డేలు, 119 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మంచి ఆల్‌రౌండర్‌గా పాక్‌లో కీ ప్లేయర్‌గా చాలా ఏళ్లు కొనసాగాడు. 2003లో అంర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన హఫీజ్‌.. 2022 జనవరిలో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. మరి హఫీజ్‌ చంద్రయాన్‌-3 సక్సెస్‌ గురించి స్పందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చంద్రయాన్ సక్సెస్‌ని చంద్రబాబుకి అంటగట్టిన తమ్ముళ్లు!