ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెటర్‌.. ఇప్పుడు గల్లీ ప్లేయర్‌! పాపం.. పాక్‌ ఆటగాడు!

Pakistan, Kamran Akmal, Tape Ball Cricket: పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌.. గల్లీ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఆడుతూ కనిపించాడు.. 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ ఉన్న అతను ఎందుకు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నాడో ఇప్పుడు చూద్దాం..

Pakistan, Kamran Akmal, Tape Ball Cricket: పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌.. గల్లీ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఆడుతూ కనిపించాడు.. 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ ఉన్న అతను ఎందుకు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నాడో ఇప్పుడు చూద్దాం..

15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌.. 53 టెస్టులు, 157 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది.. ఇంత గొప్ప ఇంటర్నేషనల్‌ కెరీర్ ఉన్న క్రికెటర్‌ ఇప్పుడొక గల్లీ క్రికెటర్‌లా మారిపోయాడు. ఇంతకీ ఆ ప్లేయర్‌ ఎవరంటే.. పాకిస్థాన్‌ మాజీ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ కమ్రాన్‌ అక్మల్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రస్తుత భారత హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌తో గొడవకు దిగిన క్రికెటర్‌గా అక్మల్‌ పేరు భారత క్రికెట్‌ అభిమానులకు కూడా సుపరిచితమే. చివరి సారిగా 2017లో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడిన అక్మల్‌.. ఆ తర్వాత తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు.

అయితే.. తాజాగా ఓ గల్లీ క్రికెట్‌ టేప్‌ బాల్‌ టోర్నమెంట్‌లో ఆడుతూ కనిపించాడు. అయితే.. పాకిస్థాన్‌ తరఫున ఒక ఇంటర్నేషనల్‌ ప్లేయర్‌గా ఎన్నో అద్భుతమైన కెరీర్‌ చూసిన.. అక్మల్‌ ఇలా గల్లీ క్రికెట్‌ ఆడుకోవడం ఏంటి? మరి అంత దీన స్థితికి దిగజారిపోయాడా? అంటూ కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదేంటి అంత మంచి ఇంటర్నేషనల్‌ కెరీర్‌ ఉన్న ప్లేయర్‌ గల్లీ క్రికెట్‌ ఆడుకోవడం ఏంటా అని కంగారు పడకండి. పిల్లల్లో, యువతను క్రికెట్‌ వైపు ప్రొత్సహించడానికి పాకిస్థాన్‌లోని చక్వాల్ అనే ప్రాంతంలో నిర్వహిస్తున్న ఓ టేప్‌ టోర్నమెంట్‌లో సరదాగా ఆడాడు కమ్రాన్‌ అక్మల్‌. అయితే.. ఒకటి రెండు బాల్స్‌ కాకుండా.. ఒక పూర్తి మ్యాచ్‌ ఆడటం విశేషం.

టేప్‌ బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభోత్సవంలో కమ్రాన్‌ అక్మల్‌తో పాటు పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ రజాక్‌ సైతం పాల్గొన్నాడు. మ్యాచ్‌ తర్వాత.. అక్మల్‌, రజాక్‌ల ఆటోగ్రాఫ్‌ల కోసం క్రికెట్‌ అభిమానులు ఎగబడ్డారు. ఇక కమ్రాన్‌ అక్మల్‌.. 2002లో జింబాబ్వేతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అదే ఏడాది వన్డే క్రికెట్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. 2006లో టీ20 ఫార్మాట్‌లో అడుగుపెట్టాడు. మొత్తంగా.. 53 టెస్టుల్లో 2648 పరుగులు చేశాడు. అందులో 6 సెంచరీలు 12 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 157 వన్డేల్లో 3236 పరుగులు సాధించాడు. అందులో 5 సెంచరీలు, 10 హాఫ్‌ సెంచరీలు చేశాడు. 58 టీ20ల్లో 987 పరుగులు, 5 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇంత లాంగ్‌ కెరీర్‌ ఉన్న క్రికెటర్‌.. యువతను క్రికెట్‌ వైపు ప్రొత్సహించేందుకు టేప్‌ బాల్‌ క్రికెట్‌ ఆడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments