SNP
మ్యాచ్ గెలిచిన సంతోషం ఏం చేసినా చెల్లుతుంది అనుకోవడం పొరపాటు.. మ్యాచ్‌లో ఎంత అద్భుతమైన ప్రదర్శన కనబర్చినా.. ప్రవర్తన బాగాలేకుంటే. విమర్శల పాలవుతుంటారు. ఇప్పుడు అలాంటి ఓ గలీజ్ పనితో పాకిస్థాన్ క్రికెటర్ తిట్లు తింటున్నాడు.
మ్యాచ్ గెలిచిన సంతోషం ఏం చేసినా చెల్లుతుంది అనుకోవడం పొరపాటు.. మ్యాచ్‌లో ఎంత అద్భుతమైన ప్రదర్శన కనబర్చినా.. ప్రవర్తన బాగాలేకుంటే. విమర్శల పాలవుతుంటారు. ఇప్పుడు అలాంటి ఓ గలీజ్ పనితో పాకిస్థాన్ క్రికెటర్ తిట్లు తింటున్నాడు.
SNP
క్రికెట్ భావోద్వేగాలతో కూడిన ఆట. ఓటమి సమయంలో బాధ.. విజయం వరిస్తే సంతోషం కామన్. కానీ, కొన్ని సందర్భాల్లో ఆటగాళ్లు చేసే పనులు వైరల్ అవుతుంటాయి. సెంచరీ చేసినా, వికెట్ తీసినా, మ్యాచ్ గెలిచినా.. కొంతమంది ఆటగాళ్లు తమ భావోద్వేగాలను అదుపు చేసుకోలేక తమ సంతోషాన్ని పలు విచిత్రమైన విధాలుగా వ్యక్తం చేస్తుంటారు. కొన్ని సెలబ్రేషన్స్ ఐకానిక్‌గా నిలిచిపోతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటాయి. అయితే.. తాజాగా ఓ పాకిస్థాన్ క్రికెటర్ చేసిన చేష్టలు మాత్రం ఛీ అనేలా ఉన్నాయి. విజయం తర్వాత సంతోషంలో ఏం చేసినా నడిచిపోతుందని అనుకున్నాడో ఏమో కానీ.. గ్రౌండ్‌లో గలీజ్ చేష్టలతో ప్రస్తుతం క్రికెట్ అభిమానులతో పాటు నెటిజన్ల చేత తిట్లు తింటున్నాడు. ఇంతకీ ఆ పాక్ క్రికెటర్ ఎవరు? ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ నెల 10న పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్‌లో భాగంగా నేషనల్ టీ20 కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. కరాచీ, అబోటాబాద్ జట్లు ఈ ఫైనల్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కరాచీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కరాచీ జట్టులో ఓపెనర్ ఖుర్రం మంజూర్ 37 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 55 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఒమైర్ యూసుఫ్ (36), డానిష్ అజీజ్ (22) మాత్రమే 20 పరుగుల మార్కును అధిగమించారు. అబోటాబాద్ బౌలర్లలో షహబ్ ఖాన్ తన 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, ఆదిల్ నాజ్, ఫయాజ్ ఖాన్ చెరో 2 వికెట్లు తీశారు. ఇక 156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన అబోటాబాద్ కేవలం 146 పరుగులకే పరిమతమై ఓటమి పాలైంది.
కరాచీ తరఫున బరిలోకి దిగిన ఆజాబ్ ఖాన్.. ఈ మ్యాచ్‌లో ఓ అద్భుతమైన క్యాచ్ అందుకుని మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. అబోటాబాద్ ఇన్నింగ్స్‌లో షానవాజ్ దహానీ షార్ట్ పిచ్‌గా వేసిన రెండో ఓవర్ చివరి బంతిని అబోటాబాద్ ఓపెనర్ సజ్జాద్ అలీ పుల్ షాట్‌కి ప్రయత్నించాడు. షాట్ మిస్ టైమ్ అవ్వడంతో బంతి గాల్లోకి చాలా పైకి లేచింది. వికెట్ కీపర్‌గా ఉన్న ఆజమ్ ఖాన్.. వెనక్కి పరుగెడుతూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్‌తో అందరి ప్రశంసలు పొందిన ఆజమ్ ఖాన్.. కొద్దిసేపటికే మ్యాచ్ ముగిశాక చేసిన గలీజ్ చేష్టలతో విమర్శల పాలయ్యాడు. గెలిచిన ఆనందంలో వికెట్ తీసుకున్న ఆజమ్ ఖాన్.. దాన్ని వేరేలా వాడుతూ చేసిన చేష్టలు నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. వేల మంది ప్రేక్షకులు, కెమెరాలు ఉన్న మైదానంలో ఎలా ప్రవర్తిస్తున్నామో కాస్త ఆలోచించి ప్రవర్తించాలని ఆజమ్ ఖాన్‌కు బుద్ధి చెబుతున్నారు. మరి ఆజమ్ ఖాన్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Azam Khan, what are you doing? 😂😂🙈 #NationalT20pic.twitter.com/zFLTwRdYOV
— Farid Khan (@_FaridKhan) December 11, 2023
Azam Khan takes a stunner.pic.twitter.com/hfLbqbxmtR
— CricTracker (@Cricketracker) December 11, 2023