iDreamPost
android-app
ios-app

BAN vs PAK: ఇంతకంటే అవమానం మరోటి ఉండదు.. పాక్ మ్యాచ్ కు టిక్కెట్ రూ. 15 మాత్రమే!

  • Published Aug 13, 2024 | 11:05 AM Updated Updated Aug 13, 2024 | 11:05 AM

బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది పాక్. అయితే ఈ మ్యాచ్ లు చూడ్డానికి ఫ్యాన్స్ వస్తారా? లేదా? అన్న భయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కలిగినట్లుంది. అందుకే మ్యాచ్ టికెట్ల రేట్లను దారుణంగా తగ్గించేసింది.

బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది పాక్. అయితే ఈ మ్యాచ్ లు చూడ్డానికి ఫ్యాన్స్ వస్తారా? లేదా? అన్న భయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కలిగినట్లుంది. అందుకే మ్యాచ్ టికెట్ల రేట్లను దారుణంగా తగ్గించేసింది.

BAN vs PAK: ఇంతకంటే అవమానం మరోటి ఉండదు.. పాక్ మ్యాచ్ కు టిక్కెట్ రూ. 15 మాత్రమే!

ప్రపంచ క్రికెట్ లో పాకిస్థాన్ పరిస్థితి పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న సంగతి తెలిసిందే. వారు చెప్పే మాటలకు అక్కడి పరిస్థితులకు అస్సలు పొంతన ఉండదు. పైగా ఎప్పుడూ భారత్ పై, టీమిండియా క్రికెటర్లపై పడి ఏడుస్తూ ఉంటారు. విరాట్ కోహ్లీ కంటే బాబర్ అజం గొప్ప అంటూ పలికిమాలిన పోలికలు చేస్తుంటారు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. టీ20 వరల్డ్ కప్ 2024లో ఘోర ఓటమి తర్వాత పాక్ తొలి సిరీస్ కు రెడీ అయ్యింది. బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ లు చూడ్డానికి ఫ్యాన్స్ వస్తారా? లేదా? అన్న భయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కలిగినట్లుంది. అందుకే మ్యాచ్ టికెట్ల రేట్లను దారుణంగా తగ్గించేసింది.

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య ఆగస్ట్ 21 నుంచి రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ చూడ్డానికి ప్రేక్షకులు వస్తారో, రారో అన్న భయం పాక్ కు పట్టుకుంది. దాంతో చేసేది ఏమీ లేక టికెట్ రేట్లను దారుణంగా తగ్గించేసింది. రావల్పిండి వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కు టిక్కెట్ కనీస ధర పీకేఆర్ 200( భారత కరెన్సీలో సుమారు రూ. 60). ఇక రెండో టెస్ట్ కు ఈ ధరను మరింతగా తగ్గించింది. కరాచీ నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కు టిక్కెట్ కనీస ధర పీకేఆర్ 50(ఇండియన్ కరెన్సీలో రూ. 15)గా నిర్ణయించింది పాక్ క్రికెట్ బోర్డ్.

pakistan test match 15rs only

కాగా.. దశాబ్ద కాలంలో కరాచీ స్టేడియంలో ఇంత తక్కువ ధరకు టికెట్స్ విక్రయించడం ఇదే తొలిసారి. ఇక ఈ సిరీస్ కు సంబంధించిన టికెట్ల విక్రయాలు ఆగస్ట్ 13 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే టికెట్స్ రేట్లను ఇంత దారుణంగా తగ్గించడానికి ప్రధాన కారణం ఇటీవల ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్ గా చెప్పుకోవచ్చు. ఈ లీగ్ లో మ్యాచ్ లు జరిగినన్ని రోజులు దాదాపు ఖాళీ స్టాండ్సే దర్శనమిచ్చాయి. దాంతో అదే సీన్ రిపీట్ అవుద్దని భావించినట్లున్నారు పాక్ క్రికెట్ పెద్దలు. అందుకే ఇంత తక్కువ ధరకు టికెట్స్ అందుబాటులోకి తెస్తున్నారు. ఇక ఈ విషయం బయటకి తెలియడంతో.. పాకిస్థాన్ క్రికెట్ కు ఇంత కంటే అవమానం మరోటి ఉండదని కామెంట్స్ చేస్తున్నారు. మరి పీసీబీ టికెట్స్ రేట్లను ఇంత తగ్గించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.