Nidhan
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం పరువు మళ్లీ పోయింది. బాబర్ ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది. ఆజం ఖాన్ అతడి పరువు తీశాడు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం పరువు మళ్లీ పోయింది. బాబర్ ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది. ఆజం ఖాన్ అతడి పరువు తీశాడు.
Nidhan
పాకిస్థాన్ జట్టు గురించి తెలిసిందే. ఆ టీమ్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలియదు. టాప్ టీమ్‌ను మట్టికరిపించడం, పసికూన చేతుల్లోనూ ఓడటం ఆ జట్టుకు అలవాటుగా మారింది. అందుకే ఏ టోర్నమెంట్ ముందు కూడా మిగతా జట్లను అంచనా వేస్తారు. కానీ దాయాది గురించి మాత్రం ఎవరూ పెద్దగా ప్రిడిక్షన్ చెప్పరు. ఆ టీమ్ పరిస్థితి ఇప్పుడు మరింత దయనీయంగా మారింది. గత ఏడాది కాలంగా ఆ జట్టు ప్రదర్శన తీసికట్టుగా మారింది. వన్డే వరల్డ్ కప్-2023లో చెత్తాటతో గ్రూప్ స్టేజ్ నుంచే వైదొలిగింది పాక్. రీసెంట్గా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ 0-2తో ఓటమిపాలైంది. దీంతో టీ20 వరల్డ్ కప్-2024లో ఆ టీమ్ ఏమీ చేయలేదని అంటున్నారు. పాక్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు.
పాకిస్థాన్ సూపర్-8 దశ దాటితే అదే గొప్ప అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఐర్లాండ్, యూఎస్ఏ లాంటి పసికూనల చేతుల్లో ఓడకుండా ఉంటే గ్రేట్ అని చెబుతున్నారు. అయితే మాజీ క్రికెటర్లు తీసిపారేస్తున్నా ఆ జట్టు మాత్రం పటిష్టంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో బలంగా ఉంది. మెగా టోర్నీలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఫస్ట్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తోంది పాకిస్తాన్. ఈ తరుణంలో యంగ్ ప్లేయర్ ఆజం ఖాన్‌తో ఆ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. భారీకాయుడైన ఆజంను పాక్ ఆటగాళ్లు ఆటపట్టించం, అతడ్ని ఎగతాళి చేయడం మామూలేనట. అయితే సారథి బాబర్ కూడా అతడ్ని అవమానించడం కాంట్రవర్సీగా మారింది.
పాకిస్థాన్ ఆటగాళ్లు జోరుగా సాధన చేస్తున్నారు. సహచరులతో కలసి బాబర్ కూడా ఫుట్‌బాల్, రగ్బీ లాంటి గేమ్స్ ఆడుతూ ఫిట్నెస్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సెషన్స్‌లో పాక్ హల్క్ ఆజం ఖాన్ కూడా పాల్గొన్నాడు. అయితే అతడు ఓ బాల్‌ను డైవ్ చేసి అందుకోగా.. ఇలాగేనా పట్టేది అంటూ బాబర్ అన్నాడు. దీంతో ఆగ్రహం పట్టలేకపోయిన ఆజం ఖాన్.. ఇంకెలా పడతారంటూ బాబర్‌పై సీరియస్ అయ్యాడు. తనను అవమానించడంతో విసిగిపోయిన ఆజం ఖాన్.. కెప్టెన్ అని కూడా చూడకుండా బాబర్ వైపు చేయి చూపించి తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆజం ఖాన్‌ను అవమానించడం కరెక్ట్ కాదని.. తోటి ఆటగాళ్లతో కలసి బాబర్ అతడ్ని టార్గెట్ చేశాడని నెటిజన్స్ అంటున్నారు. అయితే ముఖం మీదే తిట్టడంతో బాబర్ పరువు పోయిందని.. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.
Should have not picked in the team if you have to insult your own team mate like this.
Very unprofessional.
pic.twitter.com/cx9wnyekeG— Cricketopia (@CricketopiaCom) June 3, 2024