SNP
SNP
ఓవర్ యాక్షన్‌కు మారుపేరుగా నిలిచే పాకిస్థాన్ క్రికెటర్లు.. ప్రపంచంలో ఏ మూలకెళ్లినా తమ తీరు మార్చుకోరు. ప్రత్యర్థి టీమ్‌లోని ఆటగాళ్లు బాగా ఆడితే చాలు.. అస్సలు ఓర్చుకోలేరు. వారిపై ఆటతో కాకుండా నోటితో దాడికి దిగుతారు. ఇలాంటి పిల్ల చేష్టలు పాక్ ఆటగాళ్లు వెన్నెతో పెట్టిన విద్య. అది తరతరాలుగా వారికి అలవాటు పడిన సాంప్రదాయం. దాన్నే యువ క్రికెటర్లు కూడా కొనసాగిస్తున్నారు. తాజాగా పాక్ యువ పేసర్ నసీమ్ షా తన పిల్ల చేష్టలతో ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. శ్రీలంకలో ఆదివారం ప్రారంభమైన లంక ప్రీమియర్ లీగ్‌లో తొలి మ్యాచ్ జఫ్ఫానా కింగ్స్ జాఫ్నా కింగ్స్-కోలంబో స్ట్రైకర్స్ మధ్య జరిగింది. కొలంబో స్ట్రైకర్స్ జట్టుకు ఆడుతున్న నసీమ్ షా.. ప్రత్యర్థి టీమ్ ఆడగాడైన రహమనుల్లా గుర్బాజ్‌పై నోరు పారేసుకున్నాడు.
ఆఫ్ఘానిస్థాన్‌కు చెందిన గుర్బాజ్ ఎంత మంచి ఓపెనరో అందరికీ తెలిసిందే. మంచి టాలెంలెడ్ క్రికెటర్. పైగా నసీమ్ కంట్ సీనియర్ ఆటగాడు కూడా. అలాంటి ప్లేయర్ తన బౌలింగ్‌లో ఓ సిక్స్ కొట్టాడని నసీమ్ కంట్రోల్ తప్పాడు. గుర్బాజ్ జాఫ్నా కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో జాఫ్నా ఇన్నింగ్స్ 3వ ఓవర్‌ను నసీమ్ షా వేశాడు. ఈ ఓవర్‌లో గుర్బాజ్ నాలుగో బంతిని స్ట్రేయిట్ సిక్స్ కొట్టాడు. చూడచక్కటి ఆ షాట్‌తో కామెంటేటర్ల నుంచి గుర్బాజ్‌పై ప్రశంసల వర్షం కురిసింది. దీంతో నసీమ్ షాకు చిర్రెత్తుకొచ్చింది. తర్వాతి బంతికి కూడా గుర్బాజ్ లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ నసీమ్ స్లో డెలవరీ వేయడంతో గుర్బాజ్‌కు కావాల్సినంత పవర్ లభించలేదు. లాంగ్ ఆన్‌లో రమేష్ మెండీస్ అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ అందుకోవడంతో గుర్బాజ్ అవుట్ అయ్యాడు.
అవుటై పెవిలియన్‌కు వెళ్తున్న గుర్బాజ్‌ను చూసి నసీమ్ బూతులతో రెచ్చిపోయాడు. కానీ గుర్బాజ్ మాత్రం ఏం పట్టించుకోకుండా.. నసీమ్‌ను అభినందిస్తూ హుందాగా వెళ్లిపోయాడు. ఈ సింపుల్ రియాక్షన్‌తో నసీమ్‌కు బుద్ధి వచ్చేలా గుర్బాజ్ చేశాడంటూ నెటిజన్లు అంటున్నారు. గుర్బాజ్ కేవలం 11 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే.. నసీమ్ ఓవర్ యాక్షన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నసీమ్ ఇంత అతి చేసినా.. చివరికి ఈ మ్యాచ్‌లో గుర్బాజ్ టీమే గెలిచింది. జఫ్నా కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేస్తే.. కొలంబో స్ట్రైకర్స్ 152లకే ఆలౌట్ అయింది. ఈ టీమ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ కూడా ఉన్నాడు. కానీ, 8 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలం అయ్యాడు. మరి ఈ మ్యాచ్‌లో నసీమ్ షా చేసి అతిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Naseem Shah took revenge from Gurbaz🔥👿 #LPL2023 pic.twitter.com/B1FKoKqn9v
— Peace Striver❤️🩹 (@peace_striver) July 30, 2023
Naseem Shah gets Gurbaz 🤩!!! pic.twitter.com/oc2ZEily2C
— Asad Abdullah (@asad_qureshi257) July 30, 2023
ఇదీ చదవండి: 40 బంతుల్లోనే సెంచరీ..! ఆ తర్వాత కూడా ఆగని పూరన్ విధ్వంసం