iDreamPost

ఉత్కంఠ మ్యాచ్ లో.. పాకిస్థాన్ కు చుక్కలు చూపించిన ఆఫ్ఘానిస్థాన్!

  • Author Soma Sekhar Published - 08:34 AM, Fri - 25 August 23
  • Author Soma Sekhar Published - 08:34 AM, Fri - 25 August 23
ఉత్కంఠ మ్యాచ్ లో.. పాకిస్థాన్ కు చుక్కలు చూపించిన ఆఫ్ఘానిస్థాన్!

వరల్డ్ క్రికెట్ లో పసికూనలు అనుకున్న జట్లు పెద్ద పెద్ద జట్లకే షాక్ ఇస్తున్నాయి. మెున్న యూఏఈ జట్టు న్యూజిలాండ్ పై సంచలన విజయం నమోదు చేసిన విషయం మనందరికి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం శ్రీలంక వేదికగా పాకిస్థాన్-ఆఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో తొలి వన్డేలో ఘోరంగా ఓటమిపాలైంది ఆఫ్ఘాన్. ఈ మ్యాచ్ లో కేవలం 59 పరుగులకే కుప్పకూలి 142 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. తాజాగా జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ కు చుక్కలు చూపింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో కేవలం ఒక్క వికెట్ తేడాతో ఆఫ్ఘానిస్థాన్ ఓడిపోయింది.

హంబన్ టోటా వేదికగా పాక్-ఆఫ్ఘాన్ మధ్య రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ను వణికించింది పసికూన ఆఫ్ఘాన్. తొలుత బ్యాటింగ్ లో అదరగొట్టిన ఆఫ్ఘాన్.. ఆ తర్వాత బౌలింగ్ లో సత్తా చాటింది. కానీ కీలకమైన ఓవర్లో తడబడటంతో.. ఒక్క వికెట్ తేడాతో పాక్ విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చింది. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 300 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘాన్ ఓపెనర్లు పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. తొలి వికెట్ కు అభేద్యమైన 227 పరుగులు జోడించారు.

ఓపెనర్ గుర్బాజ్ 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 151 రన్స్ తో చెలరేగగా.. మరో ఓపెనర్ ఇబ్రహీమ్ జద్రాన్ 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో.. భారీ స్కోరు సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది ఆఫ్ఘాన్ టీమ్. అనంతరం 301 పరుగుల లక్ష్యాంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ తడబడుతూనే లక్ష్యం వైపు సాగింది. 49.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో ఇమామ్ ఉల్ హక్ (91), షాదాబ్ ఖాన్ (48), బాబర్ అజామ్ (53) పరుగులతో రాణించారు. ఆఫ్ఘాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫారుఖీ మూడు వికెట్లతో సత్తా చాటాడు.

కాగా.. ఒకానొక దశలో ఆఫ్ఘాన్ విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. పాక్ కు చివరి రెండు ఓవర్లలో 27 పరుగులు అవసరం అవ్వగా.. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. పైగా మంచి ఊపుమీదున్న షాదాబ్ ను అద్భుతమైన రనౌట్ చేశాడు ఆఫ్ఘాన్ బౌలర్. దీంతో మ్యాచ్ మరోసారి ఉత్కంఠను రేకెత్తించింది. అయితే అద్భుత ఇన్నింగ్స్ లో షాదాబ్ ఖాన్, నసీం షా పాక్ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది పాక్.


ఇదికూడా చదవండి: 18 ఏళ్ల తర్వాత ధోని రికార్డు బద్దలు కొట్టిన అఫ్గాన్ కీపర్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి