iDreamPost
android-app
ios-app

BAN vs PAK: వీడియో: ముగ్గురు చేతుల్లో క్యాచ్ మిస్.. అంపైర్ రియాక్షన్ మామూలుగా లేదు!

  • Published Sep 01, 2024 | 12:13 PM Updated Updated Sep 01, 2024 | 12:13 PM

Pak vs Ban, Richard Kettleborough: బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో పాకిస్థాన్ ఫీల్డర్ల చెత్త ప్రదర్శన చూసి.. అంపైర్ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

Pak vs Ban, Richard Kettleborough: బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో పాకిస్థాన్ ఫీల్డర్ల చెత్త ప్రదర్శన చూసి.. అంపైర్ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

BAN vs PAK: వీడియో: ముగ్గురు చేతుల్లో క్యాచ్ మిస్.. అంపైర్ రియాక్షన్ మామూలుగా లేదు!

బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో పాకిస్థాన్ తన చెత్త ప్రదర్శనను కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే తొలి టెస్ట్ లో దారుణంగా 10 వికెట్లతో ఓడిపోయిన తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. ఇక తాజాగా ప్రారంభం అయిన రెండో టెస్ట్ లో కూడా అంతంత మాత్రంగానే ప్రదర్శన ఇస్తోంది. తొలిరోజు వర్షం కారణంగా ఆట తుడిచిపెట్టుకుపోగా.. రెండో రోజు టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లా బౌలర్లు రాణించడంతో.. పాక్ 274 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. ఇక ఈ మ్యాచ్ లో పాక్ ఫీల్డర్స్ ఓ క్యాచ్ ను మిస్ చేశారు. ఈ క్రమంలో అంపైర్ ఇచ్చిన రియాక్ష వైరల్ గా మారింది.

పాకిస్థాన్ ఆటగాళ్లు విమర్శలు ఎదుర్కొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా మరోసారి న్యూస్ లో నిలిచారు. బంగ్లాదేశ్ తో తొలి టెస్ట్ లో 10 వికెట్ల తేడాతో ఓడిపోయి.. దారుణంగా విమర్శలకు, ట్రోల్స్ కు గురౌతున్న పాక్ ఆటగాళ్లు మరోసారి పరువుపోగొట్టుకున్నారు. అసలేం జరిగిందంటే? బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్ట్ లొ తొలిరోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ లో 274 పరుగులు మాత్రమే చేసింది. సైమ్ ఆయూబ్(58), కెప్టెన్ షాన్ మసూద్(57), ఆగా సల్మాన్(54) పరుగులతో రాణించారు.  హసన్ మిర్జా 5 వికెట్లతో రాణించాడు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించింది బంగ్లాదేశ్. ఓపెనర్లుగా బరిలోకి దిగారు షాద్ మన్ ఇస్లామ్, జాకీర్ హసన్. మీర్ హమ్జా తొలి ఓవర్ వేయడానికి వచ్చాడు. తొలి బంతినే అద్భుతంగా బౌలింగ్ చేయగా.. డిఫెన్స్ ఆడాడు షాద్ మన్. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్ లోకి దూసుకెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సౌద్ షకీల్ చేతుల్లోకి బాల్ వెళ్లింది. కానీ సింపుల్ క్యాచ్ ను అతడు అందుకోలేకపోయాడు. అయితే బాల్ మిస్ కాగా.. పక్కనే ఉన్న అయూబ్ సైతం అందుకునే ప్రయత్నం చేశాడు కానీ.. అక్కడా మిస్ అయ్యింది. మూడో ఫీల్డర్ కూడా క్యాచ్ పట్టడానికి ట్రై చేసినా.. ఫలితం లేకుండా పోయింది. దాంతో ఒక్క క్యాచ్ ను ముగ్గురు ఫీల్డర్లు కూడా ఒడిసిపట్టలేకపోయారు.

ఇక ఇది చూసిన అంపైర్ రిచర్డ్ కెటిల్ బరోకి అక్కడ ఏం జరిగిందో అర్థం కాలేదు. ఈ క్రమంలో అతడు ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది. దాంతో పాక్ చెత్త ఫీల్డింగ్ పై మరోసారి విమర్శలు గుప్పిస్తున్నారు క్రికెట్ లవర్స్. ఇలా క్యాచ్ లు మిస్ చేయడం ఒక్క పాక్ ఆటగాళ్లకే సాధ్యం.. ఇంక మీరు మారరా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాక్ తొలి ఇన్నింగ్స్ లో 274 రన్స్ కు ఆలౌట్ కాగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్ 26 రన్స్ కే 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్ వైపు పయణిస్తోంది. మరి ముగ్గురు ఆటగాళ్లు క్యాచ్ మిస్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.