iDreamPost
android-app
ios-app

ఒక్క తప్పిదంతో గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన పంజాబ్‌ కింగ్స్‌!

  • Published Apr 14, 2024 | 11:09 AM Updated Updated Apr 14, 2024 | 11:09 AM

PBKS vs RR, IPL 2024: పంజాబ్‌ కింగ్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో చేసిన ఓ తప్పిదమే పంజాబ్‌ ఓటమికి కారణమైంది. మరి ఆ తప్పు ఏంటో ఇప్పుడు చూద్దాం..

PBKS vs RR, IPL 2024: పంజాబ్‌ కింగ్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో చేసిన ఓ తప్పిదమే పంజాబ్‌ ఓటమికి కారణమైంది. మరి ఆ తప్పు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 14, 2024 | 11:09 AMUpdated Apr 14, 2024 | 11:09 AM
ఒక్క తప్పిదంతో గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన పంజాబ్‌ కింగ్స్‌!

ఐపీఎల్‌ 2024లో భాగంగా శనివారం ఛండీఘడ్‌లోని మల్లాన్‌పూర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఓటమి పాలైంది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ అందుకుంది. బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోయిన పంజాబ్‌.. బౌలింగ్‌లో మంచి ప్రదర్శన చేసి.. మ్యాచ్‌ను గెలిచే స్థితికి చేరుకుంది. కానీ, చివర్లో రాజస్థాన్‌ స్టార్‌ బ్యాటర్‌ హెట్‌మేయర్‌ సూపర్‌ ఫినిషింగ్‌తో పంజాబ్‌ కొంపముంచాడు. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ చేసిన ఓ తప్పు కూడా వారి ఓటమికి కారణం అయింది. మరి ఆ తప్పు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఈ మ్యాచ్‌లో గాయం కారణంగా పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ బరిలోకి దిగకపోవడంతో.. సామ్‌ కరన్‌ తాతాల్కిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. 147 పరుగుల టార్గెట్‌ను కాపాడుకునే ప్రయత్నంలో పంజాబ్‌ కింగ్స్‌ సరైన బౌలింగ్‌ మార్పులు చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే.. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న రాజస్థాన్‌కు 148 రన్స్‌ ఛేదించడం పెద్ద విషయం కాదు. కానీ, పంజాబ్‌ బౌలర్లు రాజస్థాన్‌ను కొంత ఇబ్బంది పెట్టారు. కానీ, చివరి ఓవర్లలో బౌలింగ్‌ ఎవరు వేయాలనే విషయంలో కాస్త అయోమయానికి గురి అయ్యారు. ముఖ్యంగా 19వ ఓవర్‌ సామ్‌ కరన్‌ వేయకుంటే.. ఫలితం వేరేలా ఉండేది. ఆ ఓవర్‌లో తొలి రెండు బంతులకు రెండు బౌండరీలు వచ్చాయి. అదే ఓవర్‌లో రెండు వికెట్లు పడినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇదే విషయంపై ఆ జట్టు కెప్టెన్‌ సామ్‌ కరన్‌ మాట్లాడుతూ.. ‘పిచ్ చాలా స్లోగా ఉంది. మేం బ్యాటింగ్‌లో మంచి స్టార్ట్‌ అందుకోలేకపోయాం. లోయరార్డర్ సూపర్ బ్యాటింగ్‌తో మాకు పోరాడే లక్ష్యం దక్కింది. కానీ, బౌలింగ్‌లో సరైన ముగింపు ఇవ్వలేకపోయాం. రాజస్థాన్ రాయల్స్‌ను ఓటమి ముంగిట నిలబెట్టాం. కానీ దురదృష్టవశాత్తు విజయాన్ని అందుకోలేకపోయాం. మా ప్లాన్స్‌కు తగ్గట్లు బ్యాటింగ్, బౌలింగ్ చేశాం. నెక్ట్స​్‌ మ్యాచ్‌లో కమ్‌బ్యాక్‌ ఇస్తాం’ అని పేర్కొన్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు మాత్రమే చేసింది. జితేశ్ శర్మ 29, అషుతోష్ శర్మ 16 బంతుల్లో 31 పరుగులు చేసి రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ సేన్, చాహల్, ట్రెంట్ బౌల్ట్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసి విజయం సాధించింది. జైస్వాల్ 39, షిమ్రాన్ హెట్‌మైర్ 10 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 27(నాటౌట్) రాణించారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడా, సామ్ కరణ్ రెండేసి వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, లియామ్ లివింగ్ స్టోన్, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. మరి థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓటమికి కారణమేంటో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.