Nidhan
Paris Olympics 2024: యంగ్ షూటర్ సరబ్జోత్ సింగ్ ఒలింపిక్స్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. షూటింగ్లో మిక్స్డ్ ఈవెంట్లో భారత్‌కు పతకాన్ని అందించాడతను.
Paris Olympics 2024: యంగ్ షూటర్ సరబ్జోత్ సింగ్ ఒలింపిక్స్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. షూటింగ్లో మిక్స్డ్ ఈవెంట్లో భారత్‌కు పతకాన్ని అందించాడతను.
Nidhan
పారిస్ ఒలింపిక్స్-2024 ఆరంభంలోనే భారత్‌కు మంచి స్టార్ట్ లభించింది. విమెన్ షూటర్ మనూ భాకర్ బ్రాంజ్ మెడల్ గెలిచి కోట్లాది మంది భారతీయుల్ని గర్వపడేలా చేసింది. ఆ తర్వాత మరో యంగ్ షూటర్ సరబ్జోత్ సింగ్‌తో కలసి షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో మరో కాంస్య పతకాన్ని కొల్లగొట్టింది. మనూ-సరబ్జోత్ జోడీ 16-10 పాయింట్ల తేడాతో నెగ్గడంతో దేశం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. ఈ గెలుపుతో 124 ఏళ్లలో ఒకే ఒలింపిక్స్‌లో 2 మెడల్స్ సాధించిన భారత అథ్లెట్‌గా మనూ చరిత్ర సృష్టించింది. ఆమెతో పాటు సరబ్జోత్ పేరు కూడా దేశవ్యాప్తంగా మార్మోగింది. రీసెంట్గా స్వదేశానికి వచ్చిన వీళ్లకు ఘనస్వాగతం లభించింది. అదే టైమ్‌లో భారీ నజరానా కూడా దక్కింది. అయితే సరబ్జోత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఒలింపిక్ మెడల్స్ గెలిచిన మనూ భాకర్-సరబ్జోత్ సింగ్‌కు హరియాణా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రెండు పతకాలు నెగ్గిన మనూకు రూ.5 కోట్లు, సరబ్‌జోత్‌కు రూ.2.5 కోట్ల క్యాష్మనీని ప్రకటించింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఆఫర్ చేసింది. హరియానా స్టేట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్‌ను సరబ్‌జోత్‌కు ఆ రాష్ట్ర సర్కారు ఆఫర్ చేసింది. అయితే అతడు దేశం కోసం ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించడం గమనార్హం. షూటింగ్ మీద మరింత ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యానని.. భవిష్యత్తులో భారత్‌కు మరిన్ని పతకాలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్లు సరబ్జోత్ తెలిపాడు. సర్కారు కొలువును ఆఫర్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన ఈ యంగ్ షూటర్.. ఇప్పుడు తాను ఉద్యోగం చేయాలనుకోవట్లేదని స్పష్టం చేశాడు.
‘గవర్నమెంట్ నుంచి జాబ్ ఆఫర్ రావడం మంచిదే. కానీ నేను ఇప్పుడు ఉద్యోగం చేయాలని అనుకోవడం లేదు. నా ధ్యాస అంతా షూటింగ్ మీదే ఉంది. నా గేమ్‌ను బెటర్ చేసుకోవడంపై ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యా. నా కుటుంబసభ్యులు కూడా మంచి జాబ్ చూసుకోమని అంటున్నారు. కానీ నా మనసు అందుకు ఒప్పుకోవడం లేదు. షూటింగ్‌లోనే కొనసాగాలనేది నా కోరిక. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు. ఇప్పుడు ఉద్యోగం చేసే ప్రసక్తే లేదు’ అని సరబ్జోత్ కుండబద్దలు కొట్టాడు. దేశానికి ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించడమే గొప్ప విషయం, అలాంటిది మెడల్ కూడా సాధించినందుకు గర్వపడుతున్నానని తెలిపాడు. తన షూటింగ్ జర్నీలో ఎప్పుడూ అండగా ఉంటూ వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అతడు కృతజ్ఞతలు తెలిపాడు. సరబ్జోత్ డెసిషన్‌ను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి అథ్లెట్ల అవసరం దేశానికి ఉందని.. నీ గట్స్‌కు హ్యాట్సాఫ్ బాస్ అని మెచ్చుకుంటున్నారు. మరి.. దేశం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని సరబ్జోత్ కాదనడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
22-year-old Indian shooter and Olympic bronze medallist Sarabjot Singh rejected a prestigious job offer from the Haryana government to work on his shooting.#Paris2024 #SarabjotSingh #Olympics pic.twitter.com/hgpSxS7JJB
— InsideSport (@InsideSportIND) August 10, 2024