iDreamPost
android-app
ios-app

IND vs ENG: ఓలీ పోప్ ఔట్ పై వివాదం.. ఔటా? నాటౌటా?

  • Published Feb 16, 2024 | 8:22 PM Updated Updated Feb 16, 2024 | 8:22 PM

ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్ టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే ఇది ఔటా? నాటౌటా? అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్ టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే ఇది ఔటా? నాటౌటా? అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

IND vs ENG: ఓలీ పోప్ ఔట్ పై వివాదం.. ఔటా? నాటౌటా?

క్రికెట్ లో మ్యాచ్ ల్లో కొన్ని ఔట్స్ వివాదాలకు దారితీస్తూ ఉంటాయి. కొన్ని రోజుల క్రితం శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ వివాదం ఎంత పెద్ద చర్చకుదారితీసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీంతో పాటుగా ప్రపంచ క్రికెట్ లో ఎన్నో వివాదాస్పదమైన క్యాచ్ లు, ఔట్ లు నమోదైయ్యాయి. తాజాగా ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టులో కూడా ఓ కాంట్రవర్సీ ఔట్ జరిగింది. ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్ టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే ఇది ఔటా? నాటౌటా? అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

టీమిండియాతో జరిగిన మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ-బెన్ డకెట్ లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. వీరిద్దరు తొలి వికెట్ కు 13 ఓవర్లలోనే 89 పరుగులు జోడించారు. మరోసారి బజ్ బాల్ క్రికెట్ తో ప్రేక్షకులను అలరించారు. ఇక ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని రవిచంద్రన్ అశ్విన్ విడగొట్టాడు. జాక్ క్రాలే(15)ను పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత రెండో వికెట్ తీయడానికి టీమిండియా బౌలర్లు చాలా కష్టపడాల్సి వచ్చింది. తొలి టెస్ట్ సెంచరీ హీరో ఓలీ పోప్ తో జతకలిసిన డకెట్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 93 పరుగులు జోడించారు.

ఈ క్రమంలోనే 30వ ఓవర్ వేయడానికి వచ్చాడు మహ్మద్ సిరాజ్. ఈ ఓవర్ చివరి బంతి ఓలీ పోప్ ప్యాడ్స్ కు తగలడంతో.. ఎల్బీకి అప్పీల్ చేశాడు సిరాజ్. దాంతో అంపైర్ నాటౌట్ ప్రకటించగా.. సిరాజ్ రోహిత్ తో పట్టుబట్టించి మరీ రివ్యూ కోరాడు. ఇక రివ్యూలో బాల్ లెగ్ స్టంప్ ను గిరాటేసినట్లు కనిపించింది. ఇంకేముందు ఓలీ పోప్ పెవిలియన్ కు చేరాడు. అయితే ఈ ఔట్ పై వివాదం రేగుతోంది. కొందరు నెటిజన్లు అసలు ఇది ఔట్ కదాని.. బాల్ పై నుంచి వెళ్లిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం వాళ్లకంటే నీకు ఎక్కువ తెలుసా? అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. అది ఔటా? నాటౌటా? అన్న చర్చ పక్కనపెడితే.. టీమిండియాకు మాత్రం సిరాజ్ అద్భుతమైన బ్రేక్ త్రూ ఇచ్చాడు. లేకుంటే ప్రమాదరకంగా మారుతున్న పోప్ మరోసారి భారత్ కు షాకిచ్చేవాడే. మరి ఈ ఔట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Sarfaraz Khan: ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి సర్ఫరాజ్ ఏం చేశాడు? క్యూట్‌ లవ్‌స్టోరీ