iDreamPost
android-app
ios-app

Sarfaraz Khan: ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి సర్ఫరాజ్ ఏం చేశాడు? క్యూట్‌ లవ్‌స్టోరీ

  • Published Feb 16, 2024 | 7:50 PM Updated Updated Feb 16, 2024 | 7:50 PM

సర్ఫరాజ్‌ ఖాన్‌.. ఎట్టకేలకు టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. చాలా కాలంగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్న అతను ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌తో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా అతని క్యూట్‌ లవ్‌ స్టోరీ, మ్యారేజ్‌ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

సర్ఫరాజ్‌ ఖాన్‌.. ఎట్టకేలకు టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. చాలా కాలంగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్న అతను ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌తో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా అతని క్యూట్‌ లవ్‌ స్టోరీ, మ్యారేజ్‌ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

  • Published Feb 16, 2024 | 7:50 PMUpdated Feb 16, 2024 | 7:50 PM
Sarfaraz Khan: ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి సర్ఫరాజ్ ఏం చేశాడు? క్యూట్‌ లవ్‌స్టోరీ

ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ పేరు మారుమోగిపోతుంది. చాలా కాలంగా టీమిండియాలో చోటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన అతనికి ఎట్టకేలకు టీమ్‌లో ప్లేస్‌ దక్కింది. ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన మూడో టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. భారత దిగ్గజ మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే చేతుల మీదుగా టెస్ట్‌ క్యాప్‌ అందుకున్న సర్ఫరాజ్‌.. తొలి మ్యాచ్‌ ఆడుబోతున్న తరుణంలో సర్ఫరాజ్‌ చాలా ఎమోషనల్‌ అయ్యాడు. మ్యాచ్‌ చూసేందుకు గ్రౌండ్‌కు వచ్చిన అతని తండ్రి నౌషద్‌ ఖాన్‌, భార్య రోమానా జహూర్‌.. సర్ఫరాజ్‌ క్యాచ్‌ అందుకుంటున్న క్రమంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. క్యాప్‌ అందుకున్న తర్వాత సర్ఫరాజ్‌ పరిగెత్తుకుంటూ వచ్చి.. అతని తండ్రిని కౌగిలించుకోవడం, ఆయన క్యాప్‌ను ముద్దాడటం, ఆ తర్వాత భార్య చేతుల్లో క్యాప్‌ పెట్టి, ఆమె కన్నీళ్లను సర్ఫరాజ్‌ తుడవడం.. ఈ దృశ్యాలు అందరి చేత కంటతడి పెట్టించాయి.

ఆ తర్వాత తొలి రోజే బ్యాటింగ్‌కు దిగిన సర్ఫరాజ్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. 48 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి అదరగొట్టాడు. ఆ వెంటనే 62 రన్స్‌ చేసిన తర్వాత.. జడేజాతో మిస్‌ కమ్యూనికేషన్‌ కారణంగా దురదృష్టవశాత్తు రనౌట్‌ అయ్యాడు. ఇలా.. టీమిండియాలోకి ఎంట్రీ, ఫ్యామిలీ ఎమోషన్‌, సూపర్‌ బ్యాటింగ్‌, రనౌట్‌.. గురువారం మొత్తం ఇండియన్‌ క్రికెట్‌లో సర్ఫరాజ్‌ పేరు మారుమోగిపోయింది. సోషల్‌ మీడియాలోని ఏ ప్లాట్‌ఫామ్‌ చూసిన సర్ఫరాజ్‌ గురించే టాక్‌. అతని వీడియోలు బాగా వైరల్‌ అయ్యాయి. అతనితో పాటు అతని తండ్రి, భార్య వీడియోలు కూడా హల్‌చల్‌ చేశాయి. ముఖ్యంగా సర్ఫరాజ్‌ ఖాన్‌ హాఫ్‌ సెంచరీ చేసిన తర్వాత అతని భార్య ఫ్లకింగ్‌ కిసెస్‌ ఇస్తూ.. సర్ఫరాజ్‌పై తన ప్రేమను వ్యక్తం చేసింది. దీంతో.. ఆమె గురించి, ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ గురించి నెటిజన్లు సెర్చ్‌ చేస్తున్నారు. సర్ఫరాజ్‌తో తన మ్యారెజ్‌ ఎలా జరిగింది? వాళ్లది లవ్‌ మ్యారేజా? అనే యాంగిల్‌లో చాలా మంది అభిమానులు ఆసక్తి చూపింది. చాలా మంది అనుకుంటున్నట్లు సర్ఫరాజ్‌ ఖాన్‌ది లవ్‌ కమ్‌ అరేంజ్‌ మ్యారేజే. మరి సర్ఫరాజ్‌ ఖాన్‌ క్యూట్‌ లవ్‌స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం..

Sarfaraaz and romana love story

సర్ఫరాజ్‌ ఖాన్‌ ముంబైకి చెందిన కుర్రాడు. క్రికెటే జీవితంగా బతుకున్న ఈ కుర్రాడి జీవితంలోకి రోమానా జహూర్‌ అనే అందాల రాసి ఎంట్రీ ఇచ్చింది. ఒకసారి రోమానా తన స్నేహితురాలితో కలిసి క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చింది. ఆ ఫ్రెండ్‌ సర్ఫరాజ్‌కు కజిన్‌ అవుతుంది. ఆ మ్యాచ్‌ ముగిసిన తర్వాత.. సర్ఫరాజ్‌ తన కజిన్‌ను కలిశాడు. ఆమెతో ఉన్న రోమానా కూడా సర్ఫరాజ్‌ను కలిసింది. సర్ఫరాజ్‌-రోమానా తొలిసారి ఒక్కడే కలుసుకున్నారు. లవ్‌ఎట్‌ ఫస్ట్‌ సైడ్‌లా.. ఇద్దరికి ఒకరిపై ఒకరి ఇష్టం కలిగింది. ఆ తర్వాత.. ఇద్దరు ఫోన్‌ నంబర్లు మార్చుకుని.. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. రోమానా జమ్మూకశ్మీర్‌కు చెందిన అమ్మాయి. బీఎస్సీ వరకు చదువుకుంది. సర్ఫరాజ్‌తో పరిచయం అయ్యాకా.. అతనే జీవితంగా బతికింది.

ఇలా చాలా రోజులు ప్రేమలో ఉన్న ఈ జంట.. పెళ్లి వైపు చాలా ఈజీగా అడుగులేసింది. టీమిండియాకు ఆడిన తర్వాతే పెళ్లి చేసుకుంటాడని సర్ఫరాజ్‌ కుటుంబంతో పాటు అతని సన్నిహితులు భావించారు. కానీ, కళ్యాణమొచ్చినా, కక్కొచ్చినా ఆగదంటారు కదా.. అలానే సర్ఫరాజ్‌ జీవితంలోకి రోమానా కూడా బ్రేకుల్లేని బండిలా దూసుకొచ్చింది. అయితే.. ఇక్కడ ఊహించని ట్విస్ట్‌ ఏంటంటే.. తమ ప్రేమ సంగతి సర్ఫరాజ్‌ ఇంట్లో రోమానానే చెప్పింది. సర్ఫరాజ్‌ను తాను ఇష్టపడుతున్నానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. తండ్రి అంటే ఉన్న భయంతో సర్ఫరాజ్‌ ముందు ఓపెన్‌ కాలేకపోయాడు. కానీ, రోమానానే సర్ఫరాజ్‌ ఫ్యామిలీని ఒప్పించింది. ఇరు కుటుంబాల వారు కూడా సర్ఫరాజ్‌-రోమానా ప్రేమను అంగీకరించడంతో 2023 ఆగస్టు 6న ఈ జంట నిఖాతో ఒక్కటయ్యారు. ఆ అమ్మాయి ఇంట్లోకి అడుగుపెట్టిన వేళా విశేషం.. ఆమె వచ్చిన ఆర్నేళ్లకే సర్ఫరాజ్‌కు టీమిండియాలో చోటు దక్కింది. మరి సర్ఫరాజ్‌-రోమానా క్యూట్‌ లవ్‌స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetewin girişgrandpashabet