Ollie Pope: 10కి 10 ఫెయిల్‌..! చెత్త కెప్టెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అంటూ ట్రోల్స్‌

Ollie Pope, ENG vs SL: ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ పరువు తీసుకున్నాడు. అతడ్ని చెత్త సారథి అంటూ భారీ ఎత్తున నెట్టింట ట్రోలింగ్ చేస్తున్నారు. దీనికి బ్యాటింగ్ కాదు.. మరో విషయంలో పోప్ ఫెయిల్యూరే కారణం.

Ollie Pope, ENG vs SL: ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ పరువు తీసుకున్నాడు. అతడ్ని చెత్త సారథి అంటూ భారీ ఎత్తున నెట్టింట ట్రోలింగ్ చేస్తున్నారు. దీనికి బ్యాటింగ్ కాదు.. మరో విషయంలో పోప్ ఫెయిల్యూరే కారణం.

క్రికెట్​లో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. అధునాతన సాంకేతికతను ఎప్పటికప్పుడు గేమ్​ అవసరాలను బట్టి వాడుకుంటున్నారు. అలా క్రికెట్ బాగా అడాప్ట్ చేసుకున్న టెక్నాలజీల్లో డీఆర్ఎస్ ఒకటి. ఔట్ల విషయంలో మరింత కచ్చితత్వం కోసం దీన్ని ప్రవేశపెట్టారు. అయితే దీన్ని సరిగ్గా వినియోగించాలంటే మంచి క్రికెట్ బుర్ర ఉండాలి. ఆటను అర్థం చేసుకుంటూ, మ్యాచ్ సిచ్యువేషన్​ను బట్టి సరైన సమయంలో రివ్యూ తీసుకోవాలి. కరెక్ట్​గా వాడుకుంటే టీమ్స్​కు ఎంతో లాభం. అలా వాడాలంటే మంచి కెప్టెన్ టీమ్​లో ఉండాలి. ఎడాపెడా నిర్ణయాలు తీసుకుంటూ అడ్డగోలుగా వాడితే జట్లకు నష్టమే తప్ప లాభం ఉండదు. ఇప్పుడు ఇంగ్లండ్ టీమ్ పరిస్థితి అలాగే ఉంది. ఆ టీమ్ కెప్టెన్ ఓలీ పోప్ డీఆర్ఎస్ విషయంలో వ్యవహరించిన తీరుతో ఇప్పుడు విమర్శల పాలవుతున్నాడు.

శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్​లో ఇంగ్లీష్ టీమ్ కెప్టెన్ ఓలీ పోప్ 10 రివ్యూలు తీసుకున్నాడు. అయితే పదింటికి పది అన్​సక్సెస్​ఫుల్ అయ్యాయి. ఒక్కటంటే కనీసం ఒక్క రివ్యూ కూడా విజయవంతం కాలేదు. పోప్ రివ్యూ తీసుకోవడం, ఇంగ్లండ్​కు వ్యతిరేకంగా నిర్ణయం రావడం ఈ సిరీస్​లో కామన్ అయిపోయింది. ఒక దాని తర్వాత ఒకటి రివ్యూలు ఫెయిల్ అవుతూ పోతున్నా ఏం కాన్ఫిడెన్సో ఏమో మరి.. పోప్ తగ్గేదేలే అంటూ తీసుకుంటూ పోయాడు. వరుసగా ఫెయిల్ అవడంతో సహచర ఆటగాళ్లతో డిస్కస్ చేసి అవసరమైన సమయంలో తీసుకున్నా ఆ రివ్యూలు కూడా విఫలమయ్యాయి. దీంతో అతడు సహా ఇంగ్లీష్ టీమ్ నెత్తి మీద చేతులు వేసుకున్నారు. పోప్ రివ్యూలు ఫెయిల్ అవడంపై సోషల్ మీడియాలో అవాక్కులు చవాక్కులు పేలుతున్నాయి. అతడ్ని నెటిజన్స్ ఓ రేంజ్​లో ఆడుకుంటున్నారు.

పోప్ చెత్త కెప్టెన్ అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇలాంటోడ్ని ఎలా సారథిని చేశారని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఒక్కటంటే ఒక్క రివ్యూ కూడా సరిగ్గా తీసుకోలేడా? వేస్ట్ అంటూ విమర్శిస్తున్నారు. భారత లెజెండ్ ఎంఎస్ ధోని దగ్గరకు వెళ్లి డీఆర్ఎస్ పాఠాలు నేర్చుకోమని సూచిస్తున్నారు. అటు మూడో టెస్టులో ఇంగ్లండ్ ఓడిపోవడంతో పోప్ మీద విమర్శలు మరింత పెరిగాయి. అతడు బ్యాటర్​గా రాణించినా, టీమ్​ను సరిగ్గా నడిపించలేకపోయాడని అంటున్నారు. అతడి కెప్టెన్సీ టీమ్ కొంపముంచిందని, డీఆర్ఎస్​ను బాగా వాడుకుంటే ఇంగ్లీష్ టీమ్​కు ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. చెత్త కెప్టెన్​ ఆఫ్ ది ఇయర్ అంటూ ఏకిపారేస్తున్నారు. అలా ఎలా సారథిని చేశారని సీరియస్ అవుతున్నారు. ఇక, సిరీస్ గెలిచినా ఆఖరి టెస్ట్​లో దారుణంగా ఓడిపోవడం, ఇటు డీఆర్ఎస్ నిర్ణయాల్లో విఫలమవడంతో పోప్ నిరాశలో కూరుకుపోయాడు. దీని నుంచి అతడు ఎలా బయటకు వస్తాడో చూడాలి. మరి.. ఈ మొత్తం వ్యవహారంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments