ప్రపంచ కప్‌కు టైమ్ దగ్గర పడుతోంది. మరో మూడ్రోజుల్లో ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు తెరలేవనుంది. దీంతో అన్ని టీమ్స్ ట్రోఫీ మీద కన్నేశాయి. ఈసారి మూడ్నాలుగు జట్లు ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నాయి. వాటిల్లో ఒకటి టీమిండియా. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్న భారత్‌కు కప్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. స్వదేశంలో టోర్నమెంట్ జరుగుతుండటం, ఆటగాళ్లు అందరూ ఫుల్ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు. ఇంగ్లండ్ లెజెండ్ స్టువర్ట్ బ్రాడ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఈసారి వరల్డ్ కప్‌లో తన ఫేవరెట్ కూడా భారత జట్టేనని బ్రాడ్ అన్నాడు. జోస్ బట్లర్ కెప్టెన్సీలోని ఇంగ్లండ్ జట్టు ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రపంచ కప్‌లో అడుగు పెడుతోందన్నాడు బ్రాడ్. అయితే టైటిల్‌ను నిలబెట్టుకోవాలంటే మాత్రం ఇంగ్లండ్ రక్తం చిందించాల్సి వస్తుందన్నాడు. అదే టైమ్‌లో టీమిండియా గనుక తమ స్థాయికి తగ్గట్లు ఆడితే.. ఆ జట్టును అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదని తేల్చిచెప్పాడు. ఒకవేళ ఇంగ్లండ్ గనుక మళ్లీ కప్ గెలిస్తే అది చాలా గొప్ప విషయమన్నాడు. అదే టైమ్‌లో భారత్‌ను అస్సలు తక్కువ అంచనా వేయకూడదని బ్రాడ్ పేర్కొన్నాడు.
‘టీమిండియా గనుక తమ పర్ఫెక్ట్ టోర్నమెంట్ ఆడితే ఆ జట్టును ఆపడం ఎవరికీ సాధ్యం కాదని నా గట్టి నమ్మకం. ఈ టోర్నమెంట్ బరిలో దిగుతున్న జాస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ టీమ్ చాలా బాగుంది. భారీ టార్గెట్లను నిర్దేశించే సత్తా ఆ జట్టుకు ఉంది. కానీ ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న భారత జట్టును ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు కష్టమనిపిస్తోంది. ప్రస్తుతం ఆ టీమ్ వన్డేల్లో నంబర్ వన్ పొజిషన్లో ఉంది’ అని బ్రాడ్ చెప్పుకొచ్చాడు. మరి.. భారత్‌ను ఆపడం ఇంగ్లండ్‌కు కూడా కష్టమేనంటూ బ్రాడ్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా బలాలు, బలహీనతలు.. ఆరో కప్ గెలిచే ఛాన్స్?