iDreamPost
android-app
ios-app

33 పరుగులకే మ్యాక్స్‌వెల్‌ అవుట్‌! కానీ, డబుల్‌ సెంచరీతో మ్యాచ్‌ గెలిపించాడు

  • Author singhj Published - 04:13 PM, Wed - 8 November 23

ఆఫ్ఘాన్​తో మ్యాచ్​లో బ్యాట్​తో విధ్వంసం సృష్టించిన మ్యాక్స్​వెల్ 33 రన్స్ వద్దే మ్యాక్స్​వెల్ ఔట్. కానీ ఆ తర్వాత డబుల్ సెంచరీ చేసి టీమ్​ను గెలిపించాడు.

ఆఫ్ఘాన్​తో మ్యాచ్​లో బ్యాట్​తో విధ్వంసం సృష్టించిన మ్యాక్స్​వెల్ 33 రన్స్ వద్దే మ్యాక్స్​వెల్ ఔట్. కానీ ఆ తర్వాత డబుల్ సెంచరీ చేసి టీమ్​ను గెలిపించాడు.

  • Author singhj Published - 04:13 PM, Wed - 8 November 23
33 పరుగులకే మ్యాక్స్‌వెల్‌ అవుట్‌! కానీ, డబుల్‌ సెంచరీతో మ్యాచ్‌ గెలిపించాడు

వన్డే క్రికెట్ హిస్టరీలోనే ఒక బెస్ట్ ఇన్నింగ్స్ ఈ వరల్డ్ కప్​లో ఆవిష్కృతమైంది. కండరాల నొప్పిని పంటి బిగువన భరిస్తూ ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్​ను ఫినిష్ చేయడాన్ని.. ఇంతటి విధ్వంసాన్ని ఎవరూ ఎక్స్​పెక్ట్ చేసి ఉండరు. కానీ సాధించాలనే తపన, పట్టుదల, కృష్టి ఉంటే.. ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు వచ్చినా విక్టరీ కొట్టొచ్చని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ ప్రూవ్ చేశాడు. సెమీస్ చేరాలంటే కీలకంగా మారిన మ్యాచ్​లో ఆఫ్ఘానిస్థాన్​పై విశ్వరూపం ప్రదర్శించాడు మ్యాక్సీ. ఓటమి కోరల్లో చిక్కుకున్న ఆసీస్​ను ఒంటిచేత్తో గెలిపించా ఔరా అనిపించాడు. ఒంటిచేత్తో కాదు ఒంటికాలితో టీమ్​కు విజయాన్ని అందించాడు. మ్యాడ్ మ్యాక్స్ చెలరేగి ఆడితే ఎలా ఉంటుందో ఈ ఒక్క ఇన్నింగ్స్​తో అందరికీ తెలిసిపోయింది.

ఆఫ్ఘాన్​పై మ్యాక్స్​వెల్ ఆడిన ఇన్నింగ్స్ వన్డే క్రికెట్ బతికున్నంత కాలం అందరికీ గుర్తుండిపోతుందని చెప్పొచ్చు. 1983 వరల్డ్ కప్​లో జింబాబ్వేపై భారత లెజెండ్ కపిల్ దేవ్ (175 రన్స్)తో పోల్చదగ్గ ఇన్నింగ్స్ ఇదని క్రికెట్ అనలిస్టులు కూడా అంటున్నారు. 292 రన్స్ భారీ టార్గెట్ ఛేజింగ్​లో కంగారూ టీమ్ 91 రన్స్​కే ఏకంగా 7 వికెట్లు కోల్పోయింది. క్రీజులో ఉన్న మ్యాక్స్​వెల్ తప్ప స్పెషలిస్టు బ్యాటర్స్ లేరు. అయినా సరే అవతలి ఎండ్​లో ఉన్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సాయంతో మ్యాక్సీ వీరోచితంగా పోరాడాడు. రషీద్ ఖాన్, ముజీబ్, నూర్ లాంటి క్వాలిటీ స్పిన్‌ అటాక్​ను ఎదుర్కొని పరుగుల వరద పారించాడు. ఏ ఒక్క బౌలర్​ను వదలకుండా బౌండరీలు, సిక్సర్ల మోత మోగించాడు మ్యాక్సీ. అసలు జాలి, కనికరం అనేదే లేకుండా బ్యాటింగ్ చేశాడతను.

ఆఫ్ఘాన్​పై మ్యాక్స్​వెల్ తుఫాన్ ఇన్నింగ్స్​లో 21 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. దీన్ని బట్టే అతడు ఏ స్థాయిలో చెలరేగి బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. 128 బంతుల్లోనే 201 రన్స్ చేసి ఛేజింగ్​లో డబుల్ సెంచరీ చేసిన అరుదైన ఘనతను మ్యాక్సీ అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్​లో మ్యాక్స్​వెల్​కు అదృష్టం కూడా కలిసొచ్చింది. ఇది ఆఫ్ఘాన్ గెలవాల్సిన మ్యాచ్. అయితే స్పిన్నర్ ముజీబ్ చేసిన ఒక తప్పు ఆ టీమ్ కొంపముంచింది. మ్యాక్సీ 33 రన్స్ వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్​ను ముజీబ్ పట్టి ఉండే మ్యాచ్​లో రిజల్ట్ మరోలా ఉండేది. కానీ ఈజీ క్యాచ్​ను చేజార్చిన ముజీబ్.. బౌలింగ్​లోనూ ఫెయిలై ఏకంగా 72 రన్స్ ఇచ్చుకున్నాడు. అతడి బౌలింగ్​లోనే మ్యాక్స్​వెల్ విన్నింగ్ షాట్ కొట్టాడు. దీంతో ముజీబ్​ను ఆఫ్ఘాన్ ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు. మరి.. మ్యాక్సీ తుఫాన్ ఇన్నింగ్స్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆస్ట్రేలియాను గెలిపించింది మ్యాక్స్‌వెల్‌ కానీ, తెర వెనుక ఓ హీరో కష్టం!