వన్డే వరల్డ్ కప్-2023లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది టీమిండియా. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో పాటు భారత్ కూడా ఈసారి సెమీస్‌కు చేరుకునే ఛాన్సులు గట్టిగా ఉన్నాయని వెటరన్ క్రికెటర్లతో పాటు అనలిస్టులు కూడా అంటున్నారు. సొంతగడ్డ మీద జరుగుతున్న ప్రపంచ కప్‌లో భారత్ ఛాంపియన్‌గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8వ తేదీన ఆస్ట్రేలియాతో జరిగే ఫస్ట్ మ్యాచ్‌తో టీమిండియా వరల్డ్ కప్ వేటను మొదలుపెట్టనుంది. ఆ తర్వాత అఫ్ఘానిస్థాన్‌తో రెండో మ్యాచ్ ఆడనున్న భారత్.. మూడో మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
ఆస్ట్రేలియాతో ఆడబోయే ఫస్ట్ మ్యాచ్ భారత్‌కు ఎంతో కీలకం కానుంది. ఫేవరెట్లలో ఒకటైన కంగారూలను ఓడిస్తే టీమ్‌లో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరుగుతాయి. అప్పుడు పాక్‌తో తర్వాతి మ్యాచ్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగొచ్చు. వరల్డ్ కప్‌లో అద్భుతమైన రికార్డు ఉన్న ఆసీస్ లాంటి టీమ్‌ను సెమీస్‌లో ఆపడం చాలా కష్టం. కాబట్టి ఇక్కడే ఝలక్ ఇస్తే ఆ జట్టు కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. రీసెంట్గా జరిగిన వన్డే సిరీస్‌లో ఎలాగూ ఓడించాం.. కాబట్టి మరోమారు ఆ టీమ్‌ను ఓడిస్తే ఆ గెలుపు గాలివాటం కాదని ప్రూవ్ అవుతుంది. అయితే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో సొంత అభిమానుల మధ్య తీవ్ర ఒత్తిడిలో ఆసీస్ లాంటి టాప్ టీమ్‌ను ఎదుర్కోవడం భారత్‌కు అంత ఈజీ కాదు.
మెగా టోర్నీలో భారత్ తొలి మ్యాచ్ చెన్నైలో జరుగుతుండటం సానుకూలాంశమని చెప్పొచ్చు. చెన్నై పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కంగారూల కోసం కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారట. ఆసీస్‌ను స్పిన్ ఉచ్చులో చిక్కేలా చేసి చిత్తు చేయాలని వ్యూహం పన్నుతున్నారట. అందుకోసం సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లను రెడీ చేస్తున్నారట. టీమ్‌లో ప్లేస్ ఫిక్స్ అని వారికి ముందే సమాచారం ఇచ్చి.. ఆసీస్ బ్యాటర్లను ఔట్ చేసేందుకు స్పెషల్ ప్లాన్స్ వేస్తున్నారని సమాచారం.
ఒక్కో బ్యాటర్‌కు వాళ్ల వీక్నెస్ను బట్టి ఎలా ఔట్ చేయాలనే దానిపై ద్రవిడ్-రోహిత్ స్కెచ్ వేస్తున్నారట. పిచ్ ఏమాత్రం టర్నింగ్‌కు అనుకూలించినా ఆసీస్‌ను స్పిన్ అటాక్‌తో కుప్పకూల్చాలని చూస్తున్నారట. అయితే మ్యాచ్ జరిగే రోజు పిచ్ కండీషన్‌తో పాటు వాతావరణ పరిస్థితులను బట్టి జట్టు కూర్పులో మార్పులు ఉన్నా ఆశ్చర్యం అక్కర్లేదు. అయితే ఆసీస్‌తో మ్యాచ్‌లో టీమిండియా స్పిన్ వ్యూహంతో బరిలోకి దిగుతుందా? లేదా ఇంకేదైనా వేరే ప్లాన్‌తో వస్తారా? అనేది చూడాలి. మరి.. ఈ విషయంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: టీమిండియా మాజీ కెప్టెన్‌కు షాకిచ్చిన సుప్రీం కోర్టు కమిటీ!
India might play the spin trio of Ravi Ashwin, Jadeja and Kuldeep against Australia on Sunday. (Cricbuzz). pic.twitter.com/vv17ppEKjo
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 6, 2023