సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు టైమ్ బాగా కలిసొస్తోంది. వన్డేలకు చాన్నాళ్లుగా దూరంగా ఉన్న ఈ క్రికెటర్.. ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆ సిరీస్‌లో రెండు మ్యాచుల్లో నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌లపై కంగారూ బ్యాట్స్‌మెన్‌ను స్పిన్ వేరియేషన్స్‌తో ఆటాడుకున్నాడు. ఇప్పుడు ఏకంగా వన్డే వరల్డ్ కప్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండు వారాలకు ముందు వరకు వన్డే టీమ్ ఛాయల్లోనే లేని స్టార్ స్పిన్నర్.. మరో వారం రోజుల్లో మొదలయ్యే వరల్డ్ కప్‌లో టీమిండియా స్పిన్ ఎటాక్‌ను లీడ్ చేయనున్నాడు. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడిన అక్షర్ పటేల్ ఇంకా కోలుకోకపోవడంతో వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు.
ఆల్‌రౌండర్ అక్షర్ గాయం అశ్విన్‌కు వరంగా మారింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అక్షర్ ప్లేసులో వరల్డ్ కప్ టీమ్‌లోకి అశ్విన్‌కు ఛాన్స్ ఇచ్చింది. ఈ సెలెక్షన్‌కు ఐసీసీ ఓకే చెప్పింది. అశ్విన్ ఎంట్రీతో భారత స్పిన్ ఎటాక్ మరింత వైవిధ్యంగా కనిపిస్తోంది. వరల్డ్ కప్‌కు ఎంపికైన జడేజా, అక్షర్, కుల్దీప్లు లెఫ్టాండర్ స్పిన్నర్లు అనేది తెలిసిందే. ఇప్పుడు అక్షర్ స్థానంలో అశ్విన్ రావడంతో స్పిన్ దాడికి వైవిధ్యం వచ్చింది. జడేజా ట్రెడిషనల్ లెఫ్టాండ్ స్పిన్, కుల్దీప్ చైనామన్ శైలి, అశ్విన్ ఆఫ్ స్పిన్‌ను ఎదుర్కోవడం ఎంతటి బ్యాట్స్‌మన్‌కైనా కష్టమనే చెప్పాలి. వరల్డ్ కప్ టీమ్‌లోకి అశ్విన్ అనుకోకుండా వచ్చాడని అందరూ అనుకుంటున్నారు. జాగ్రత్తగా గమనిస్తే అశ్విన్ సెలెక్షన్ వెనుక టీమ్ మేనేజ్మెంట్ వ్యూహం కనిపిస్తోంది.
ఆసియా కప్, ప్రపంచ కప్ స్క్వాడ్ ప్రకటించిన తర్వాత కూడా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఒకే మాట చెబుతూ వచ్చారు. పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి అవసరమైతే అశ్విన్ లేదా యుజ్వేంద్ర చాహల్‌ను తీసుకుంటామని పలుమార్లు చెప్పారు. భారత పిచ్‌లపై ఎంతో అనుభవం ఉన్న ఈ ఇద్దరు స్పిన్నర్లు కీలకమని భావించారేమో. వీళ్లతో తాము నిరంతరం మాట్లాడుతున్నామని రోహిత్, ద్రవిడ్ తెలిపారు. ఇప్పుడు అక్షర్ ప్లేసులో అశ్విన్‌ను సెలెక్ట్ చేశారు. చాహల్‌కు బదులు అశ్విన్‌ను సెలెక్ట్ చేయడానికి అతడికి ఉన్న బ్యాటింగ్ ఎబిలిటీ ఒక కారణమని చెప్పొచ్చు. వరల్డ్ కప్ టీమ్‌లోకి సెలెక్షన్ విషయంలో అశ్విన్‌కు భారత టీమ్ మేనేజ్మెంట్ ముందే హింట్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో అశ్విన్ చాన్నాళ్లు ప్రాక్టీస్ చేయడమే.
వరల్డ్ కప్‌కు ముందు ప్రకటించిన టీమ్‌లో లేని అశ్విన్ ఎన్ఏసీలో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పట్లో టెస్టులు కూడా లేవు. అలాంటప్పుడు అతడు అక్కడ ఎందుకున్నట్లు? ఎన్ఏసీలో ఉండి అక్కడి కోచ్ సాయిరాజ్ బహుతలే శిక్షణలో తన బౌలింగ్‌ను మరింత మెరుగుపర్చుకున్నానని ఆసీస్‌తో వన్డే మ్యాచ్ తర్వాత స్వయంగా అశ్విన్ చెప్పాడు. ఎన్సీఏలో బౌలింగ్ మెరుగువ్వడంతో పాటు ఫిజికల్‌గానూ ఫిట్ అయ్యాడు అశ్విన్. సో, ఆసీస్ సిరీస్‌కు ముందే ఎన్సీఏలో ఈ సీనియర్ స్పిన్నర్‌ను ద్రవిడ్, రోహిత్ సిద్ధం చేశారన్న మాట. పక్కా ప్లానింగ్ ప్రకారమే అతడ్ని కంగారూ సిరీస్‌లో ఆడించినట్లుగా కనిపిస్తోంది. ఆ సిరీస్‌లో రాణించడం, అదే టైమ్‌లో అక్షర్ గాయం నుంచి కోలుకోకపోవడంతో అశ్విన్ ఎంట్రీకి రూట్ క్లియర్ అయింది. పరిస్థితులు చూస్తుంటే.. ఒకవేళ అక్షర్ ఫిట్‌గా ఉన్నా అశ్విన్‌ను టీమ్‌లోకి తీసుకునేవారని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. మరి.. వరల్డ్ కప్ టీమ్‌లోకి అశ్విన్ ఎంట్రీపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పాకిస్థాన్ నెట్ బౌలర్‌గా హైదరాబాదీ కుర్రాడు!