Nidhan
టీ20 వరల్డ్ కప్‌లో ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన న్యూజిలాండ్ అందర్నీ తీవ్రంగా నిరాశపర్చింది. గ్రూప్ దశలోనే నిష్క్రమించింది కివీస్. దీంతో అభిమానులు ఆ బాధను తట్టుకోలేకపోతున్నారు.
టీ20 వరల్డ్ కప్‌లో ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన న్యూజిలాండ్ అందర్నీ తీవ్రంగా నిరాశపర్చింది. గ్రూప్ దశలోనే నిష్క్రమించింది కివీస్. దీంతో అభిమానులు ఆ బాధను తట్టుకోలేకపోతున్నారు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన న్యూజిలాండ్ అందర్నీ తీవ్రంగా నిరాశపర్చింది. గ్రూప్ దశలోనే నిష్క్రమించింది కివీస్. దీంతో అభిమానులు ఆ బాధను తట్టుకోలేకపోతున్నారు. సాధారణంగా ఐసీసీ టోర్నమెంట్స్‌లో కివీస్ నెక్స్ట్ లెవల్ గేమ్‌తో అలరిస్తూ ఉంటుంది. ఎన్నోసార్లు అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి టాప్ టీమ్స్ తాట తీసింది. వరల్డ్ కప్ నెగ్గలేదు గానీ చాలామార్లు సెమీస్, ఫైనల్స్‌కు చేరుకున్న ఘనత ఆ జట్టుకు ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు అద్భుతమైన ఫీల్డింగ్‌తో చివరి బాల్ వరకు పోరాడటం న్యూజిలాండ్‌కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఆ టీమ్ అంటే చాలు.. అందరూ వణుకుతారు. కానీ పొట్టి కప్పులో ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేక తుస్సుమంది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి గ్రూప్ దశ ముగియక ముందే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మెగా టోర్నీలో ఫస్ట్ మ్యాచ్‌లో డేంజరస్ ఆఫ్ఘానిస్థాన్ చేతుల్లో 84 పరుగుల తేడాతో ఘోరంగా ఓటమిపాలైంది న్యూజిలాండ్. ఆ మ్యాచ్‌లో 75 పరుగులకే ఆలౌట్ అవడం అవమానకరమనే చెప్పాలి. ఆ తర్వాతి మ్యాచ్‌లోనైనా కోలుకుంటుందని భావిస్తే అది జరగలేదు. ఆతిథ్య వెస్టిండీస్‌తో కీలక మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ఓడింది కివీస్. దీంతో ఆ టీమ్ సూపర్-8 అవకాశాలు క్లోజ్ అయ్యాయి. ఉగాండా, పపువా న్యూ గినియాతో నెక్స్ట్ రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. కానీ వాటిల్లో నెగ్గినా తదుపరి దశకు చేరుకునే ఛాన్సులు లేకపోవడంతో ఆ రెండు మ్యాచులు నామమాత్రంగా మారాయి. కివీస్ వరుస ఓటములు, గ్రూప్ దశతోనే స్టోరీ ఎండ్ అవడంతో ఆ టీమ్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరుత్సాహానికి లోనవుతున్నారు. ఈ తరుణంలో ఆ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
కివీస్ సీనియర్ పేసర్ టిమ్ సౌతీని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మందలించింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఫ్రస్ట్రేషన్‌కు గురైన సౌతీ.. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సర్‌ను తన్నాడు. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ డేవిడ్ మూన్ జరిపిన విచారణలో తన తప్పును ఒప్పుకున్నాడు సౌతీ. అయితే ఐసీసీ 2.2 కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు, లెవల్ 1 నేరం కింద అతడికి ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. క్రమశిక్షణా చర్యల కింద డీమెరిట్ పాయింట్లో కోత్ వేయడమే గాక అతడ్ని మందలించింది కూడా. ఇలాంటిది మళ్లీ రిపీట్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. అసలే సూపర్-8 ద్వారాలు మూసుకుపోవడంతో బాధలో ఉన్న కివీస్‌కు.. సీనియర్ పేసర్‌ను ఐసీసీ హెచ్చరించడం, పాయింట్లలో కోత విధించడం పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. దీని గురించి తెలిసిన నెటిజన్స్.. న్యూజిలాండ్ కష్టం పగోడికి కూడా రావొద్దని అంటున్నారు. మరి.. సౌతీ విషయంలో ఐసీసీ వ్యవహరించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
New Zealand player Tim Southee has been handed an official reprimand for breaching Level 1 of the ICC Code of Conduct during their ICC Men’s T20 World Cup 2024 Group C match against the West Indies at the Brian Lara Cricket Academy in Trinidad on Wednesday. pic.twitter.com/730OPuyIJA
— IANS (@ians_india) June 14, 2024