iDreamPost
android-app
ios-app

రోహిత్‌, కోహ్లీ కాదు.. టీమిండియాలో అతనే అసలైన హీరో!

  • Published Dec 27, 2023 | 11:36 AM Updated Updated Dec 27, 2023 | 4:20 PM

ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లో స్టార్‌ ప్లేయర్లు ఎవరంటే అంతా విరాట్‌కోహ్లీ, రోహిత్‌ శర్మ పేర్లు చెబుతారు. అది నిజమే కానీ, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఒక పెద్ద దిక్కు మాత్రం కొత్తగా పుట్టుకొచ్చాడు. అతనే భారత జట్టుకు అసలైన హీరోలా అవతరిస్తున్నాడు. అతనెవరో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లో స్టార్‌ ప్లేయర్లు ఎవరంటే అంతా విరాట్‌కోహ్లీ, రోహిత్‌ శర్మ పేర్లు చెబుతారు. అది నిజమే కానీ, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఒక పెద్ద దిక్కు మాత్రం కొత్తగా పుట్టుకొచ్చాడు. అతనే భారత జట్టుకు అసలైన హీరోలా అవతరిస్తున్నాడు. అతనెవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 27, 2023 | 11:36 AMUpdated Dec 27, 2023 | 4:20 PM
రోహిత్‌, కోహ్లీ కాదు.. టీమిండియాలో అతనే అసలైన హీరో!

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా తడబడుతూ నిలబడుతోంది. సెంచూరియన్‌ వేదికగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను.. సౌతాఫ్రికా పేసర్లు వణికించారు. స్టార్‌ బౌలర్‌ కగిసో రబడా, యంగ్‌ బౌలర్‌ బర్గర్‌ భారత టాపార్డర్‌ను కుప్పకూల్చారు. కేవలం 24 పరుగులకే టీమిండియా తొలి మూడు వికెట్లును కోల్పోయింది. ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఫస్ట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ సైతం అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌ సైతం కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. ఇలా ఆరంభంలోనే పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత జట్టును కోహ్లీ-శ్రేయస్‌ అయ్యర్‌ జోడీ ఆదుకుంది. కానీ, ఒక మంచి పొజిషన్‌ వచ్చిన తర్వాత.. లంచ్‌ ముగిసిన తర్వాత వారి లయతప్పింది. ముందుగా అయ్యర్‌, ఆ వెంటనే కోహ్లీ సైతం అవుట్‌ అయ్యారు. దీంతో మళ్లీ భారత జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడింది.

ఇక ఇక్కడి నుంచి టీమిండియా మహా అయితే.. 150 పరుగుల మార్క్‌ను అందుకుంటుందిలే అని అంతా అనుకున్నారు. కానీ, ఇక్కడి నుంచి కేఎల్‌ రాహుల్‌ తన పోరాటం కొనసాగించాడు. ఇతర బ్యాటర్ల నుంచి తన ఎలాంటి సహకారం లభించకపోయినా.. ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. నిప్పులు చిమ్ముతున్న సౌతాఫ్రికా బౌలింగ్‌ను ఎదుర్కొంటూ.. 105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో 70 పరుగులు చేసి తొలి రోజు ఆటముగిసే సమయానికి నాటౌట్‌గా నిలిచాడు. తనతో పాటు మొహమ్మద్‌ సిరాజ్‌ పరుగులేమి చేయకుండా నాటౌట్‌గా ఉన్నాడు. 105 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. తొలి రోజు ఆలౌట్‌ కాకుండా 208 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయి.. గౌరవ ప్రదంగా నిలిచిందంటే అందుకు కారణం కేఎల్‌ రాహుల్‌. అయితే.. ఈ టెస్ట్‌ సిరీస్‌ ఆరంభం కాకముందు.. అందరి ఫోకస్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీపైనే ఉంది. ఎందుకంటే.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 తర్వాత.. వీరిద్దరు తొలిసారి తిరిగి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టడమే అందుకు కారణం.

kl rahul superb batting

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఓటమి బాధను మర్చిపోయి.. వాళ్లిద్దరూ ఎలా ఆడతారా అని అంతా ఎదురుచూశారు. పైగా టెస్టుల్లో టీమిండియాకు రోహిత్‌, కోహ్లీనే పెద్ద దిక్కుగా అంతా భావిస్తున్నారు. కానీ, టెస్ట్‌ సిరీస్‌లో తొలి రోజే ఎదురైన కష్టంతో వాళ్లిద్దరూ కాకుండా టీమిండియాకు కొత్త పెద్ద దిక్కుగా, అసలైన హీరోగా, ఒక సేవియర్‌గా కేఎల్‌ రాహుల్‌ అవతరించాడు. ఐపీఎల్‌ 2023లో గాయంతో టీమిండియాకు దూరమైన రాహుల్‌.. గాయం నుంచి కోలుకుని.. తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. ఎంతో బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. వికెట్‌ కీపింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డ్‌లో మంచి సలహాలు ఇస్తూ.. కంప్లీట్‌ కెప్టెన్‌గా మెటిరియల్‌గా మారిపోయాడు. ముఖ్యంగా రోహిత్‌, కోహ్లీ లేకుంటే.. టీమిండియాకు అతనే పెద్ద దిక్కులా ఉన్నాడు. కామ్‌ అండ్‌ కంపోజ్‌గా ఉండే రాహుల్‌.. టీమ్‌ భారాన్ని మొత్తం తన భుజాలపై వేసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. వరల్డ్‌ కప్‌లో కానీ, తాజాగా సౌతాఫ్రికాతో గెలిచిన వన్డే సిరీస్‌లో కాని రాహుల్‌ ఆటను గమనిస్తే.. టీమిండియాలో హీరోలా ఆడుతున్నాడు. కానీ, రోహిత్‌, కోహ్లీ స్టార్‌డమ్‌ ముందు రాహుల్‌ చేస్తోంది కనిపించకుండా పోతుంది. కానీ, వాళ్ల షాడో దాటేందుకు రాహుల్‌కు పెద్దగా టైమ్‌ పట్టేలా లేదు. ఒక్క విషయం మాత్రం పక్కా.. రోహిత్‌ తర్వాత టీమిండియాను నడిపించేది మాత్రం రాహులే అనిపిస్తోందని క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.