iDreamPost

ప్రపంచంలో ఏ బ్యాటర్​కూ భయపడలేదు! అతనొక్కడికే భయపడ్డా: డేల్ స్టెయిన్!

  • Author singhj Updated - 07:53 PM, Wed - 6 December 23

వరల్డ్ క్రికెట్​లో టాప్ పేస్ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు సౌతాఫ్రికా మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్. అలాంటి స్టెయిన్​కు ఒక బ్యాటర్ అంటే చాలా భయమట.

వరల్డ్ క్రికెట్​లో టాప్ పేస్ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు సౌతాఫ్రికా మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్. అలాంటి స్టెయిన్​కు ఒక బ్యాటర్ అంటే చాలా భయమట.

  • Author singhj Updated - 07:53 PM, Wed - 6 December 23
ప్రపంచంలో ఏ బ్యాటర్​కూ భయపడలేదు! అతనొక్కడికే భయపడ్డా: డేల్ స్టెయిన్!

డేల్ స్టెయిన్.. క్రికెట్​కు సౌతాఫ్రికా అందించిన దిగ్గజ పేస్ బౌలర్లలో ఒకడు. గన్​లో నుంచి బుల్లెట్ వచ్చినంత వేగంగా అతడి చేతిలో నుంచి బాల్ బ్యాట్స్​మెన్​ మీదకు దూసుకొచ్చేది. చిరుత పులి లాంటి రనప్​తో పరిగెత్తుకుంటూ వస్తూ అతడు సంధించే బౌన్సర్లు, యార్కర్లకు ఎంతటి బ్యాటర్లైనా గజగజా వణికిపోయేవారు. టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఫార్మాట్ ఏదైనా బ్యాట్స్​మెన్​ను తన పేస్​తో వణికిస్తూ కట్టడి చేసేవాడు స్టెయిన్. స్వింగ్​తో పాటు సీమింగ్ డెలివరీస్​తో అపోజిషన్ టీమ్స్​ను భయపెట్టేవాడు. స్టెయిన్ బౌలింగ్​లో బాల్​ను టచ్ చేయాలంటే కూడా కొందరు బ్యాటర్లు తడబడేవారు. అంతలా క్రికెట్ పిచ్ మీద అతడి డామినేషన్ సాగింది. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్​లో బాల్స్ వేస్తూ.. రన్స్ ఇవ్వకుండా బ్యాటర్ల మీద ప్రెజర్ పెట్టేవాడీ సఫారీ బౌలర్.

స్వింగ్ లేదా సీమ్​కు పిచ్ కాస్త సహకరించినా మరింత చెలరేగిపోయేవాడు స్టెయిన్. ప్రత్యర్థులను తక్కువ స్కోర్లకే కుప్పకూలుస్తూ ఎన్నో మ్యాచుల్లో సౌతాఫ్రికాకు సింగిల్ హ్యాండ్​తో విజయాలు అందించాడీ పేసర్. 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు వేయడం, ఒకే లెంగ్త్​ను పట్టుకొని బాల్​ వేస్తూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టేవాడు. అలెన్ డొనాల్డ్, షాన్ పొలాక్, మఖయా ఎన్తిని లాంటి వాళ్ల తర్వాత సఫారీ టీమ్ నుంచి వచ్చి వరల్డ్ క్రికెట్​ఫై ఆధిపత్యం చెలాయించిన పేసర్ అంటే స్టెయిన్ అనే చెప్పాలి. దాదాపు 16 ఏళ్ల పాటు సౌతాఫ్రికాకు సేవలు అందించాడీ పేసర్. 2004లో ఇంగ్లండ్​పై మొదటి టెస్ట్ ఆడిన స్టెయిన్.. 2020, ఫిబ్రవరి 21న ఆస్ట్రేలియాతో ఆడిన టీ20 మ్యాచ్​తో క్రికెట్​కు గుడ్ బై చెప్పేశాడు. అదే ఏడాది ఐపీఎల్​లోనూ లాస్ట్ మ్యాచ్ ఆడేశాడు.

పద్నాలుగేళ్ల కెరీర్​లో 93 టెస్టులు ఆడిన స్టెయిన్ 439 వికెట్లు తీశాడు. 125 వన్డేల్లో 196 వికెట్లు పడగొట్టాడు. 47 టీ20లు ఆడి 64 వికెట్లు తీశాడు. వరల్డ్ క్రికెట్​లో బెస్ట్ బ్యాట్స్​మెన్​ అనదగ్గ చాలా మందిని అతడు తన బౌలింగ్​తో భయపెట్టాడు. అలాంటి స్టెయిన్​ ఒక బ్యాటర్​కు వణికిపోయాడు. ఆ బ్యాటర్​కు బౌలింగ్ వేయాలంటేనే తనకు దడ పుట్టేదని అన్నాడు. అయితే స్టెయిన్ బౌలింగ్​లో టీమిండియా లెజెండరీ బ్యాటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్​, విరాట్ కోహ్లీ ఎన్నో రన్స్ చేశారు. దీంతో అందరూ వాళ్ల ముగ్గురిలో ఎవరి పేరైనా చెబుతారని అంతా అనుకున్నారు. కానీ స్టెయిన్ భయపడింది మాత్రం రోహిత్ శర్మతోనట. ‘రోహిత్ శర్మకు బౌలింగ్ వేసేందుకు నేను ఎప్పుడూ ఇబ్బంది పడేవాడ్ని. అతడు అద్భుతమైన బ్యాటర్’ అని స్టెయిన్ చెప్పాడు. స్టెయినే కాదు.. ప్రస్తుత జనరేషన్ బౌలర్లకు కూడా హిట్​మ్యాన్ సింహస్వప్నంగా మారాడు. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్​లో ఆ బౌలర్, ఈ బౌలర్ అనే తేడాల్లేకుండా అందర్నీ చితగ్గొట్టాడు రోహిత్. మరి.. రోహిత్​ అంటే తనకు భయం అంటూ స్టెయిన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IPL 2024: RCB ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్ చెప్పిన మాక్స్​వెల్.. ఇది భయ్యా డెడికేషన్ అంటే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి