SNP
IND vs SL, Yashasvi Jaiswal, Suryakumar Yadav, Basit Ali: శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఓటమికి కారణం సెలెక్టర్లే అంటూ పాక్ మాజీ క్రికెటర్ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
IND vs SL, Yashasvi Jaiswal, Suryakumar Yadav, Basit Ali: శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఓటమికి కారణం సెలెక్టర్లే అంటూ పాక్ మాజీ క్రికెటర్ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
SNP
శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 0-2 తేడాతో ఓడిపోవడం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతేడాది వన్డే వరల్డ్ కప్ 2023లో వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి.. ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్ వరకు దూసుకెళ్లిన జట్టు.. ఇప్పుడు శ్రీలంక లాంటి జట్టుపై వరుసగా రెండు వన్డేలు ఓడిపోయి.. సిరీస్‌ను కోల్పోవడంతో అంతా షాక్ అవుతున్నారు. అదే సమయంలో టీమిండియాపై విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే.. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ.. భారత సెలెక్టర్లను తప్పబట్టాడు. వాళ్లు చేసిన పెద్ద తప్పు వల్లే టీమిండియా చిత్తుగా ఓడిందంటూ పేర్కొన్నాడు.
యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌ను అలాగే సూర్యకుమార్ యాదవ్‌ను వన్డే సిరీస్‌కు ఎంపిక చేయకుండా భారత సెలెక్టర్లు బ్లండర్ మిస్టేక్ చేశారని, శుబ్‌మన్ గిల్ కంటే జైస్వాల్ ఓపెనర్‌గా వందరెట్లు బెటర్ అని.. వాళ్లిద్దరూ వన్డే టీమ్‌లో ఉండి ఉంటే.. టీమిండియా పరిస్థితి మెరుగ్గా ఉండేదని అభిప్రాయపడ్డాడు. బాసిత్ అలీ వాదనతో చాలా మంది భారత క్రికెట్ అభిమానులు కూడా ఏకీభవిస్తున్నారు. అతను చెప్పినట్లు శుబ్‌మన్ గిల్ ప్లేస్‌లో జైస్వాల్‌ను తీసుకొని ఉంటే బాగుండేదని అంటున్నారు.
పైగా రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా కుదిరేదని, ఇద్దరు పవర్‌ప్లేలో వేగంగా ఆడితే.. మంచి స్కోర్ కూడా వస్తుందని అంటున్నారు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఉండి ఉంటే.. స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. స్వీప్ షాట్లు అద్భుతంగా ఆడి పెద్ద స్కోర్లు చేసేవాడని కూడా క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఈ సిరీస్‌లో టీమిండియా బ్యాటర్లు స్పిన్‌కే ఎక్కువ ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. తాము ఎక్కువగా స్వీప్ షాట్లు ఆడలేకపోయమంటూ తెలిపాడు. మరి వన్డే జట్టులో జైస్వాల్, సూర్య ఉండాల్సిందని పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.