Nidhan
Dala Steyn: ఈతరంలో బెస్ట్ బౌలర్ ఎవరంటే అందరూ ఠక్కున పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరే చెబుతారు. కానీ సౌతాఫ్రికా లెజెండ్ డేల్ స్టెయిన్ మాత్రం తాను చూసిన బెస్ట్ బౌలర్ ఇంకొకరు ఉన్నారని అన్నాడు.
Dala Steyn: ఈతరంలో బెస్ట్ బౌలర్ ఎవరంటే అందరూ ఠక్కున పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరే చెబుతారు. కానీ సౌతాఫ్రికా లెజెండ్ డేల్ స్టెయిన్ మాత్రం తాను చూసిన బెస్ట్ బౌలర్ ఇంకొకరు ఉన్నారని అన్నాడు.
Nidhan
జస్ప్రీత్ బుమ్రా.. ప్రస్తుత క్రికెట్లో బెస్ట్ బౌలర్‌గా పేరు తెచ్చుకున్న క్రికెటర్. అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవాలంటే తోపు బ్యాటర్లు కూడా భయపడుతుంటారు. ఒకవైపు పరుగులు ఇవ్వకుండా నియంత్రిస్తూ, మరోవైపు బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను వణికిస్తుంటాడీ భారత పేసర్. టీ20, వన్డే, టెస్ట్.. ఫార్మాట్ ఏదైనా గానీ ఈ స్పీడ్‌స్టర్ బంతితో చేసే మ్యాజిక్‌లో ఎలాంటి మార్పూ లేదు. ఫార్మాట్‌కు అనుగుణంగా లెంగ్త్‌ను కాస్త అడ్జస్ట్ చేసుకొని చెలరేగిపోతాడు. వరుసగా డాట్ బాల్స్ వేస్తూ బ్యాటర్లను అయోమయంలో పడేస్తాడు. షాట్ కొట్టాలన్నా, డిఫెన్స్ చేయాలన్నా బ్యాటర్ జడుసుకునేలా చేస్తుంటాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్‌లోనూ బుమ్రా నెక్స్ట్ లెవల్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
పొట్టి వరల్డ్ కప్‌లో 15 వికెట్లు తీసిన బుమ్రా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. బ్యాటర్ల డామినేషన్ నడిచే టీ20 క్రికెట్ టోర్నమెంట్లో ఓ బౌలర్ ఇలా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకోవడం అంటే మాటలు కాదు. మెగాటోర్నీలో బుమ్రా ఎకానమీ 4.17గా ఉండటం మరో హైలైట్. పరుగులు ఇవ్వడంలో పిసినారిగా వ్యవహరించాడీ భారత స్పీడ్‌స్టర్. కొన్ని సందర్భాల్లో అతడు వికెట్లు తీయకపోయినా ప్రెజర్ బిల్డ్ చేస్తూ పోవడంతో మిగతా బౌలర్లకు వికెట్లు పడ్డాయి. ఫైనల్లోనూ ఆఖర్లో వచ్చి అద్భుతమైన స్పెల్‌తో మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పాడు. అందుకే ఈతరం అనే కాదు.. క్రికెట్లో తోపు బౌలర్ అంటే బుమ్రానే అంటూ దిగ్గజ ఆటగాళ్లు కూడా మెచ్చుకుంటున్నారు. అయితే సౌతాఫ్రికా పేస్ లెజెండ్ డేల్ స్టెయిన్ మాత్రం బుమ్రా కాదు.. పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తరే బెస్ట్ బౌలర్ అంటున్నాడు.
యార్కర్ల కింగ్‌గా పేరు తెచ్చుకున్న బుమ్రా ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్, రివర్స్ స్వింగ్, బౌన్సర్స్, కట్టర్స్, స్లో డెలివరీస్ వేయడంలో ఆరితేరాడు. అయితే అతడి యార్కర్ మాత్రం మోస్ట్ డేంజరస్ అనే చెప్పాలి. స్టార్ బ్యాటర్లను కూడా ఈ అస్త్రంతో ఎన్నోమార్లు పెవిలియన్‌కు చేర్చాడు. ఆస్ట్రేలియా లెజెండ్ బ్రెట్‌లీ తర్వాత అంత కచ్చితమైన యార్కర్లు వేయగల బౌలర్‌గా బుమ్రా పేరు తెచ్చుకున్నాడు. అయితే స్టెయిన్ మాత్రం బుమ్రా, బ్రెట్‌లీ కాదు.. అక్తర్ వేసే యార్కరే తోపు అన్నాడు. ఇప్పటిదాకా క్రికెట్ హిస్టరీలో బెస్ట్ యార్కర్ ఏదని మీరు భావిస్తున్నారంటూ స్టెయిన్‌కు ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు వెంటనే 1999 వరల్డ్ కప్‌లో అక్తర్ విసిరినదని జవాబిచ్చాడు. ఆ టోర్నీలో పీక్ ఫామ్‌లో ఉన్న అక్తర్.. 10 మ్యాచుల్లో 16 వికెట్లు తీశాడు. మరి.. బుమ్రా, అక్తర్ల్లో ఎవరి యార్కర్ గ్రేట్ అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
Which bowler has had the best yorker in history?
— Iceland Cricket (@icelandcricket) July 20, 2024