iDreamPost
android-app
ios-app

కోహ్లీతో ఇక రోహిత్‌కి కష్టమే! గొడవ కాదు అంతకుమించి!

  • Published Sep 28, 2023 | 1:46 PM Updated Updated Sep 28, 2023 | 1:46 PM
  • Published Sep 28, 2023 | 1:46 PMUpdated Sep 28, 2023 | 1:46 PM
కోహ్లీతో ఇక రోహిత్‌కి కష్టమే! గొడవ కాదు అంతకుమించి!

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ.. 2-1తో సిరీస్‌ దక్కిందని, రోహత్‌ శర్మ, కోహ్లీ హాఫ్‌ సెంచరీలో రాణించారని భారత క్రికెట్‌ అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. అయితే.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ-విరాట్‌ కోహ్లీ మధ్య వచ్చిపడిన కొత్త సమస్యతో కాస్త ఆందోళనకు గురవుతున్నారు. ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌ కప్‌కి ముందు టీమిండియాకు వెన్నెముక లాంటి ఇద్దరు స్టార్‌ బ్యాటర్ల మధ్య ఇదేం సమస్య అంటూ టెన్షన్‌ పడుతున్నారు. అయితే.. రోహిత్‌-కోహ్లీకి గొడవేమైనా జరిగిందా? అని అనుమానపడకండి. అలాంటిదేం జరగలేదు కానీ, ఇది గొడవకు మించిన సమస్య. అసలు విషయంలోకి వెళ్తే..

బుధవారం రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో చాలా కాలం తర్వాత రోహిత్‌ శర్మ-విరాట్‌ కోహ్లీ మధ్య మంచి పార్ట్నర్‌షిప్‌ నమోదైంది. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. అయితే.. ఈ పార్ట్నర్‌షిప్‌ విషయంలో క్రికెట్‌ అభిమానులు సంతోషంగా ఉంటే.. అదే సమయంలో.. ఇద్దరు ఆటగాళ్లు రెండు భిన్న ధ్రువాల్లా ఆడటమే పెద్ద సమస్యగా మారింది. సాధారణంగా.. విరాట్‌ కోహ్లీ ఇన్నింగ్స్‌లో సింగిల్స్‌, డబుల్స్‌ ఎక్కువగా ఉంటాయి. వన్డే ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలో.. అచ్చం లానే స్ట్రైక్‌ రొటేట్‌ చూస్తూ పరుగులు సాధిస్తూ ఉంటాడు. సిక్సుల కంటే బౌండరీలు, డబుల్స్‌తోనే కోహ్లీ ఎక్కువ రన్స్‌ చేస్తుంటాడు.

ఇక రోహిత్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ను తీసుకుంటే.. ఓ ఓవర్‌లో రెండు, మూడు బంతులు డాట్‌ చేసినా.. నాలుగో బంతికి బౌండరీనో, సిక్సరో బాది లెక్క సరిచేస్తాడు. ఎక్కువగా బౌండరీలు, సిక్సులతో ఇన్నింగ్స్‌ నడిపిస్తాడు. డబుల్స్‌, త్రిబుల్స్‌ తీయడానికి పెద్దగా ఇష్టపడడు. సింగిల్‌ సైతం చాలా ప్రశాంతంగా తీస్తాడు. నిన్నటి మ్యాచ్‌లో సైతం 57 బంతుల్లో 81 పరుగులు చేశాడు. అందులో 5 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. ఫోర్ల కంటే సిక్సర్ల నంబర్‌ ఎక్కువగా ఉన్న విషయం మనం గుర్తించాలి. కానీ, ఆస్ట్రేలియాతో నిన్నటి మ్యాచ్‌లో మరో ఎండ్‌లో కోహ్లీ ఉండటంతో.. రోహిత్‌కు పరుగులు కోసం పరిగెత్తక తప్పలేదు. దీంతో కాస్త అలసిపోయినట్లు కనిపించాడు.

ఈ క్రమంలోనే మ్యాక్స్‌వెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 21వ ఓవర్‌ తొలి బంతికి కూడా కోహ్లీ రెండు రన్స్‌ కోసం పరిగెత్తించాడు. మూడో బంతికి సింగిల్‌ తీసి రోహిత్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు. ఇలా పరిగెత్తితే తాను మరింత అలసిపోతానని భావించిన రోహిత్‌.. ఇక లాభం లేదని భారీ షాట్లు కొట్టాలని ఫిక్స్‌ అయిపోయాడు. అనుకున్నదే తడువుగా మ్యాక్సీ వేసిన నాలుగో బంతికి భారీ సిక్స్‌ బాదాడు. చివరి బంతికి కూడా స్ట్రేయిట్‌గా బలమంతా పెట్టి కొట్టాడు. కానీ, మ్యాక్స్‌వెల్‌ చేతుల్లో బాల్‌ చిక్కడంతో అవుట్‌ అయ్యాడు. అయితే.. కోహ్లీ ఎక్కువగా పరిగెత్తించడంతో అలిసిపోయిన రోహిత్‌ వేగంగా ఆడే క్రమంలోనే అవుట్‌ అయినట్లు కనిపిస్తుంది. ఇలా ఇద్దరు టాప్‌ క్లాస్‌ ఆటగాళ్ల భిన్న శైలి కారణంగా.. టీమిండియాకు నష్టం జరుగుతుందేమో అనే భయం అభిమానుల్లో ఉంది.

ఎందుకంటే.. వరల్డ్‌ కప్‌ లాంటి కీలక మ్యాచ్‌లో తొలి వికెట్‌ పడిన వెంటనే కోహ్లీనే వన్‌ డౌన్‌లో వస్తాడు. రోహిత్‌ కాకుండా గిల్‌ అవుటై ఉంటే.. మళ్లీ రోహిత్‌-కోహ్లీ జోడీ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు కూడా కోహ్లీ సింగిల్స్‌, డబుల్స్‌ కోసం ఆడి, రోహిత్‌ అలసిపోతే ఇబ్బంది అవుతుంది. గతంలో కూడా వీళ్లిద్దరూ కలిసి ఆడినా.. అప్పుడు రోహిత్‌ ఇప్పటికంటే ఇంకా ఫిట్‌గా ఉండేవాడు. కానీ, ఇప్పుడు వయసు రిత్యా కూడా కాస్త తగ్గాడు. ఈ విషయంలో కోహ్లీని కూడా తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే వన్డేల్లో స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తేనే బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది.. రన్‌రేట్‌ కూడా తగ్గకుండా ఉంటుంది. అయితే.. ఇద్దరు టాప్‌ క్లాస్‌ ఆటగాళ్లు ఇలా భిన్నమైన శైలితో ఇబ్బంది పడుతుండటం మాత్రం కచ్చితంగా టీమిండియాకు సమస్యగా మారుతుందనే చెప్పాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆస్ట్రేలియాపై సిరీస్‌ గెలిచినా.. కప్పు ముట్టుకోని రోహిత్‌! కారణమేంటి?