క్రికెట్లో చాలా మంది చిన్న వయసులోనే అరంగేట్రం చేస్తారు. యంగ్ ఏజ్‌లో ఎంట్రీ ఇస్తేనే సుదీర్ఘ కాలం గేమ్‌లో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫిట్‌గా ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆడేందుకు ఛాన్స్ ఉంటుంది. అయితే కొందరు క్రికెటర్లకు మాత్రం త్వరగా ఎంట్రీ ఇవ్వడం కుదరదు. కాంపిటీషన్‌ను దాటుకొని టీమ్‌లోకి వచ్చేసరికి ఆలస్యం అవుతోంది. అయితే లేటు వయసులో వచ్చినా సత్తా చాటి అభిమానుల్ని అలరించిన ప్లేయర్లు చాలా మందే ఉన్నారు. ఆ జాబితాలో తాజాగా పాకిస్థాన్ జట్టు లెఫ్టార్మ్ స్పిన్నర్ నొమన్ అలీ చేరాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఈ బౌలర్ తన సత్తా చాటాడు.
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో పర్యాటక పాకిస్థాన్ అద్భుతంగా ఆడింది. ఆతిథ్య జట్టుపై ఏకంగా 222 రన్స్ తేడాతో భారీ విజయాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో లంక 188 పరుగులకు కుప్పకూలింది. ఆ టీమ్ బ్యాటర్లలో ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (63 పరుగులు నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి తర్వాత దిముత్ కరుణరత్నే (41 పరుగులు) మాత్రమే రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో స్పిన్నర్ నొమన్ అలీ ఏకంగా 7 వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్‌ను కకావికలం చేశాడు. 36 ఏళ్ల వయసులో తన స్పిన్ బౌలింగ్‌తో అదరగొట్టాడు అలీ.
శ్రీలంక ఇన్నింగ్స్‌లో తొలి ఏడు వికెట్లు నొమన్ అలీనే పడగొట్టాడు. దీంతో ఒక దశలో అతడు పది వికెట్ల హాల్‌ను నమోదు చేస్తాడనిపించింది. ఇప్పటికే ఈ ఫీట్‌ను నమోదు చేసిన జిమ్ లేకర్ (1956), అనిల్ కుంబ్లే (1999), ఎజాజ్ పటేల్ (2021) సరసన నొమన్ చోటు దక్కించుకుంటాడేమోనని అనిపించింది. అయితే ఆఖర్లో స్పీడ్‌స్టర్ నసీమ్ షా టెయిలెండర్ల వికెట్లను రెండు ఓవర్ల వ్యవధిలో తీయడంతో నొమన్ తృటిలో ఆ ఫీట్‌ను చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన పాక్ జట్టు డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
Spin to win 🔥
Noman Ali recorded his career-best Test figures in Pakistan’s thumping victory over Sri Lanka 🙌
More ➡️ https://t.co/Ik1DZcJht3 pic.twitter.com/iz6Q8FtWxl
— ICC (@ICC) July 27, 2023