Somesekhar
ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బాబర్ అజమ్ లాంటి స్టార్ క్రికెటర్లకే సాధ్యం కాని ఓ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు ఓ పసికూన జట్టు ఆటగాడు. మరి ఆ రికార్డు ఏంటి? ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.
ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బాబర్ అజమ్ లాంటి స్టార్ క్రికెటర్లకే సాధ్యం కాని ఓ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు ఓ పసికూన జట్టు ఆటగాడు. మరి ఆ రికార్డు ఏంటి? ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.
Somesekhar
వరల్డ్ క్రికెట్ లో స్టార్ ప్లేయర్లు ఎవరు? అంటే సచిన్, సెహ్వాగ్, పాంటింగ్, ద్రవిడ్, సంగక్కర, జయసూర్య, లారా, బ్రాడ్ మన్ ప్రస్తుతానికొస్తే విరాట్ కోహ్లీ, రోహిత్ ఇలా చాలా మంది పేర్లే వస్తాయి. ఇక ఈ దిగ్గజ క్రికెటర్ల పేరు మీద ఎన్నో అద్భుతమైన రికార్డులు నెలకొల్పబడ్డాయి. కానీ ఓ అరుదైన రికార్డు మాత్రం పసికూన బ్యాటర్ పేరుమీద ఉంది. ఈ ఘనతను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బాబర్ అజమ్, డేవిడ్ వార్నర్ లు కూడా సాధించలేకపోయారు. మరి ఇంతకీ ఆ రికార్డు ఏంటి? ఆ అనామక క్రికెటర్ ఎవరు? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
విరాట్ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్ లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కానీ ఓ ఘనతలో మాత్రం వెనకబడే ఉన్నాడు. ఆ రికార్డు పసికూన జట్టు అయిన ఐర్లాండ్ స్టార్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ పేరిట ఉందంటే మీరు నమ్ముతారా? కోహ్లీనే కాదు.. ఈ రికార్డు లిస్ట్ లో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజమ్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ లాంటి మేటి ఆటగాళ్లు సైతం అతడి వెనకే ఉన్నారు అంటే వినడానికి మీకు నమ్మశక్యంగా లేదనుకుంటా. కానీ ఇది నిజం. ఇంతకీ వీరందరిని దాటుకుని అతడిని అగ్రస్థానంలో నిలిపిన ఆ రికార్డు ఏంటంటే?
అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాటర్ గా ప్రస్తుతం నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్. 135 టీ20 మ్యాచ్ ల్లో 401 బౌండరీలు బాదాడు ఈ ఐరిష్ ప్లేయర్. ఈ లిస్ట్ లో 395 ఫోర్లతో వెన్నంటే ఉన్నాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజమ్. ఇక 361 ఫోర్లతో విరాట్ మూడో స్థానలో ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా 359 బౌండరీలతో రోహిత్ శర్మ, 320 ఫోర్లతో డేవిడ్ వార్నర్ ఉన్నారు. కాగా.. వరల్డ్ క్రికెట్ లో ఎంతో మంది మోతుబరి ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ఐర్లాండ్ లాంటి చిన్న దేశానికి చెందిన పాల్ స్టిర్లింగ్ పై ఈ రికార్డు ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🚨 RECORD ALERT 🚨
Most fours – Men’s T20I
4⃣0⃣0⃣ Paul Stirling
3⃣9⃣5⃣ Babar Azam
3⃣6⃣1⃣ Virat Kohli
3⃣5⃣9⃣ Rohit Sharma
3⃣2⃣0⃣ David Warner #BackingGreen #BackingStirlo ☘️🏏 pic.twitter.com/p8iaTh0trf— Cricket Ireland (@cricketireland) March 15, 2024
ఇదికూడా చదవండి: క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ సృష్టించిన ఆ చెరగని చరిత్రకు నేటితో 12 ఏళ్లు!